నేటి నుంచి ఏపీ ఈఏపీ సెట్‌ 2025 హాల్‌ టిక్కెట్లు విడుదల.. ఈ ఏడాది 3.61లక్షల దరఖాస్తులు-ap eap cet 2025 hall tickets released from today 3 61 lakh applications this year ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  నేటి నుంచి ఏపీ ఈఏపీ సెట్‌ 2025 హాల్‌ టిక్కెట్లు విడుదల.. ఈ ఏడాది 3.61లక్షల దరఖాస్తులు

నేటి నుంచి ఏపీ ఈఏపీ సెట్‌ 2025 హాల్‌ టిక్కెట్లు విడుదల.. ఈ ఏడాది 3.61లక్షల దరఖాస్తులు

Sarath Chandra.B HT Telugu

ఏపీ ఈఏపీ సెట్‌ 2025 హాల్‌ టిక్కెట్లు నేడు విడుదల కానున్నాయి. ఈ ఏడాది ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం 3.61లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈఏపీ సెట్‌కు రూ.4వేల లేట్‌ ఫీతో నేటి వరకు, రూ.10వేల ఫీజుతో 16వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

నేటి నుంచి ఏపీ ఈఏపీ సెట్‌ హాల్‌ టిక్కెట్ల విడుదల

ఏపీ- ఈఏపీ సెట్-2025 హాల్‌ టిక్కెట్లు నేటి నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయి. ఆన్‌లైన్‌తో పాటు వాట్సాప్‌ మనమిత్రలో కూడా హాల్‌ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఏపీ ఈఏపీ సెట్‌ హాల్ టికెట్లను మే 12 సోమవారం నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఈఏపీ సెట్ చైర్మన్ సీఎస్ఆర్కే ప్రసాద్, కన్వీనర్ వీవీ సుబ్బారావు ప్రకటించారు.

ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు మొత్తం 3,61,230 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈఏపీ సెట్‌ పరీక్షలు మే 19 నుంచి మొదలవుతాయి. ఈఏపీ సెట్ వెబ్సైట్, ఏపీ ప్రభుత్వ వాట్సప్ గవర్నెన్స్ నం.95523 00009 ద్వారా హాల్ టికెట్లు పొందవచ్చు.

అభ్యర్థులు పరీక్షా కేంద్రం తెలుసుకునేలా హాల్ టికెట్‌లో రూట్‌ మ్యాప్‌ ముద్రిస్తున్నట్టు కన్వీనర్‌ వివరించారు. అభ్యర్థులు సందేహాలకు 0884-2359599, 2342490 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

లేట్‌ ఫీతో అవకాశం…

ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీ సెట్‌ దరఖాస్తుల స్వీకరణ గడువు మరికొన్ని రోజుల్లో ముగుస్తుంది. రూ.4వేల జరిమానాతో మే 12 వరకు, రూ.10వేల లేట్‌ఫీతో మే 16వరకు ఈఏపీ సెట్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి 12న ఈఏపీ సెట్‌ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.

ఏపీ ఈఏపీ సెట్‌కు మార్చి 15 నుంచి ఆన్‌‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఏప్రిల్ 24 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులను స్వీకరిస్తారు.

మే 6 నుంచి మే 8వ తేదీ వరకు దరఖాస్తుల కరెక్షన్ విండో ఓపెన్ అవుతంది. రూ.4వేల ఆలస్య రుసుముతో మే 12 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రూ.10వేల ఆలస్య రుసుముతో మే 16వరకు దరఖాస్తు చేయవచ్చు.

ఏపీ ఈఏపీ సెట్‌ నోటిఫికేషన్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది…

మే 12 నుంచి హాల్‌ టిక్కెట్లు విడుదల.. ఏర్పాట్లు పూర్తి

మే 12 నుంచి ఈఏపీ సెట్‌ హాల్‌ టిక్కెట్లు విడుదల చేస్తారు. మే 19,20తేదీలలో ఈఏపీ సెట్‌ నిర్వహిస్తారు. జూన్‌ 6న ఫలితాలు విడుదల చేస్తారు.

ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా 46 కేంద్రాలు, హైదరాబాద్‌లో రెండు రీజనల్ కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తు న్నట్లు వెల్లడించారు. మే 12 నుంచి హాల్‌ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని, మే 19 నుంచి 27వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు జరుగుతాయన్నారు.

దరఖాస్తుదారులు సమాచార నమోదులో పొరపాటు జరిగితే హెల్ప్ లైన్ సెంటర్ ను సంప్రదించాలన్నారు. మే 6 నుంచి 8 లోగా సవరించుకునేందుకు అవకాశం కల్పి స్తామని వివరించారు.

అప్లికేషన్ ఫీజు వివరాలు

ఒక పేపర్ కు ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.500, ఇతరులందరికీ రూ.900 ఫీజు నిర్ణయించారు. రెండు పేపర్లకు అప్లై చేసుకునే అభ్యర్థులకు SC, ST, PWDలకు రూ. 1000 ఫీజు, మిగిలిన అభ్యర్థులు రూ.1800 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఏపీలోని ప్రభుత్వ,ప్రైవేట్ ఇంజనీరింగ్‌ కాలేజీలతో పాటు అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం ఏపీ ఈఏపీ సెట్ 2025 నిర్వహిస్తున్నారు.

ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ మార్చి 15వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది. పూర్తి వివరాలు

https://cets.apsche.ap.gov.in/ లో అందుబాటులోకి ఉంటాయి.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.