ఏపీ డీఎస్సీ పరీక్షల అప్డేట్స్ - ఇవాళ్టి నుంచి ప్రాథమిక 'కీ'లు విడుదల, లింక్ ఇదే-ap dsc exams 2025 updates preliminary key for sa kannada odia tamil and urdu exams will be released from today ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ డీఎస్సీ పరీక్షల అప్డేట్స్ - ఇవాళ్టి నుంచి ప్రాథమిక 'కీ'లు విడుదల, లింక్ ఇదే

ఏపీ డీఎస్సీ పరీక్షల అప్డేట్స్ - ఇవాళ్టి నుంచి ప్రాథమిక 'కీ'లు విడుదల, లింక్ ఇదే

ఏపీ డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయి. అయితే కొన్ని పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీలపై విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. నేటి నుంచి ( జూన్ 17) స్కూల్ అసిస్టెంట్ కన్నడ, ఒడియా, తమిళం ఉర్దూ పరీక్షల ప్రాథమిక కీలు అందుబాటులోకి వస్తాయి.

ఏపీ డీఎస్సీ పరీక్షల అప్డేట్స్

ఏపీ డీఎస్సీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు పరీక్షలు ముగిశాయి. జూన్ 30వ తేదీ నాటికి అన్ని పరీక్షలు పూర్తి కానున్నాయి. అయితే కొన్ని పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలను ఇవాళ విద్యాశాఖ విడుదల చేయనుంది. వీటిపై అభ్యంతరాలను కూడా స్వీకరించనుంది.

ఇవాళ ప్రాథమిక కీ లు విడుదల

నేటి నుంచి (జూన్ 17) స్కూల్ అసిస్టెంట్ కన్నడ, ఒడియా, తమిళం ఉర్దూ పరీక్షల ప్రాథమిక కీ విడుదల కానుంది. వీటికపై జూన్ 23వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఈ ప్రాథమిక కీలను https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ లో పొందవచ్చు. అభ్యంతరాలను కూడా ఇదే వెబ్ సైట్ నుంచి పంపవచ్చు. త్వరలోనే మిగతా పేపర్ల ప్రాథమిక కీ లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

మెగా డీఎస్సీ నిర్వహణలో భాగంగా సోమవారం జరిగిన స్కూల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజ్) సోషల్ స్టడీస్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 38,243 అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోగా 36,372 (95.11%) మంది హాజరయ్యారు. ఈ మేరకు డీఎస్సీ–2025 కన్వీనర్ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 227 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు ఉదయం అనంతపురం జిల్లాలో (97.84%) మంది, మధ్యాహ్నం చిత్తూరు జిల్లాలో (97.98%)అత్యధికంగా అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు.

స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్) మైనర్ మీడియా కన్నడ, ఒడియా, తమిళం, ఉర్దూ విభాగాలకు చెందిన ప్రాథమిక కీ నేటి (జూన్ 17) నుంచి అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. https://apdsc.apcfss.in వెబ్ సైటులో రెస్పాన్స్ షీట్ అభ్యర్థుల లాగిన్ లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అభ్యర్థులు ప్రాథమిక కీ పై తమ అభ్యంతరాలను తగిన ఆధారాలతో ఈ నెల 23లోపు వెబ్ సైట్ ద్వారా మాత్రమే తెలియజేయాలని స్పష్టం చేశారు.

ఏపీ మెగా డీఎస్సీలో భాగంగా…. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈసారి ఈ మెగా డీఎస్సీలోని అన్ని ఖాళీలకు కలిపి 5,77,417 అప్లికేషన్లు అందాయి. పలువురు అభ్యర్థులు వారి అర్హతలకు అనుగుణంగా… ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. పరీక్షలన్నీ పూర్తయ్యాక… సబ్జెక్టుల వారీగా హాజరైన అభ్యర్థుల విషయంలో క్లారిటీ రానుంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.