AP Senior Resident Posts : ఏపీలో 1,289 సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్, ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి-ap dme senior resident 1289 vacancies notification released application process ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ap Senior Resident Posts : ఏపీలో 1,289 సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్, ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి

AP Senior Resident Posts : ఏపీలో 1,289 సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్, ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి

HT Telugu Desk HT Telugu
Dec 29, 2024 06:00 PM IST

AP Senior Resident Posts : ఏపీ వైద్య విద్యా డైరెక్టరేట్ లో 1289 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డీఎంఈ కింద ప‌ని చేసే స్పెషాలిటీ, సూప‌ర్ స్పెషాలిటీ ప్రభుత్వ మెడిక‌ల్ కాలేజీ, ఆసుప‌త్రుల్లో ప‌ని చేసేందుకు సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల భ‌ర్తీ చేయనున్నారు.

ఏపీలో 1,289 సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్, ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి
ఏపీలో 1,289 సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్, ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి

AP Senior Resident Posts : ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లో 1,289 సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ విడుద‌ల అయ్యింది. అభ్యర్థులు ఆన్ లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ డీవీఎస్ఎల్ న‌ర‌సింహం నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. అర్హత‌, ఆస‌క్తి ఉన్న అభ్యర్థలు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరారు. వైద్య విద్యా డైరెక్టరేట్ (డీఎంఈ) కింద ప‌ని చేసే బోర్డు స్పెషాలిటీ, సూప‌ర్ స్పెషాలిటీ ప్రభుత్వ మెడిక‌ల్ కాలేజీ, ఆసుప‌త్రుల్లో ప‌ని చేసేందుకు సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల భ‌ర్తీ చేస్తున్నారు. అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://dmeaponline.com/ లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

yearly horoscope entry point

పోస్టులు

మొత్తం 40 విభాగాల్లో 1,289 సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టులను భ‌ర్తీ చేయనున్నారు.

1. స్పెషాలిటీలో 17 విభాగాల్లో 603 పోస్టులు ఉన్నాయి. అందులో జనరల్ మెడిసిన్ 79, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌న్ 80, గైనకాలజీ 38, అనస్థీషియా 44, పీడియాట్రిక్స్ 39, ఆర్థోపెడిక్స్ 34, ఆప్త్మాల‌జీ 19, ఈఎన్‌టీ 18, డీవీఎల్‌ (డెర్మటాలజీ/ ఎస్‌టీడీ) 8, రెస్పిరేట‌రీ మెడిషన్ 13, సైక్యాట్రీ 13, రేడియో-డైగ్నోసిస్‌/రేడియాలజీ 45, ఎమర్జెన్సీ మెడిసిన్ 134, రేడియోథెరపీ 26, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ 5, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ 9, న్యూక్లియర్ మెడిసిన్ 2 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు.

2. నాన్ క్లీనిక‌ల్‌లో ఎనిమిది విభాగాల్లో 590 పోస్టులు ఉన్నాయి. అందులో అనాట‌మీ 88, ఫిజియాలజీ 58, బయోకెమిస్ట్రీ 66, ఫార్మకాలజీ 84, పాథాలజీ 88, మైక్రోబయాలజీ 67, ఫోరెన్సిక్ మెడిసిన్ 59, ఎస్‌పీఎం/కమ్యూనిటీ మెడిసిన్ 80 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు.

3. సూప‌ర్ స్పెషాల‌టీలో 14 విభాగాల్లో 96 పోస్టులు ఉన్నాయి. అందులో కార్డియాలజీ 9, ఎండోక్రినాలజీ 3, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ 5, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ 1, న్యూరాలజీ 7, కార్డియో థొరాసిక్ సర్జరీ 6, ప్లాస్టిక్ సర్జరీ 6, పీడియాట్రిక్ సర్జరీ 7, యూరాలజీ 7, న్యూరోసర్జరీ 9, నెఫ్రాలజీ 7, సర్జికల్ ఆంకాలజీ 18, మెడికల్ ఆంకాలజీ 16, నియోనాటాలజీ 1 పోస్టులు భ‌ర్తీ చేస్తారు.

అర్హత‌లు

1. నేష‌న‌ల్ మెడిక‌ల్ కమిష‌న్ నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయి.

2. సంబంధిత స్పెషాలిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎండీ, ఎంఎస్‌, ఎండీ ఉండాలి.

3. ఆంధ్రప్రదేశ్ మెడిక‌ల్ కౌన్సిల్ రిజిస్ట్రేష‌న్

వయో ప‌రిమితి

నోటిఫికేషన్ విడుద‌ల అయిన తేదీ నాటికి 44 ఏళ్లు దాట‌కూడ‌దు. ప్రస్తుతం ప్రభుత్వ మెడిక‌ల్ కాలేజీల్లో ప‌ని చేసే వారు అనర్హులు.

వేత‌నం

బోర్డు స్పెషాలిటీ సీనియ‌ర్ రెసిడెంట్‌కు రూ.80,500, సూప‌ర్ స్పెషాలిటీ సీనియ‌ర్ రెసిడెంట్‌కు రూ.95,750 ఉంటుంది.

ఉద్యోగ వ్యవ‌ధి

సీనియ‌ర్ రెసిడెంట్ ఉద్యోగ వ్య‌వ‌ధి ఏడాది పాటు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా ఒక సంవత్సరం వ్యవధిని పూర్తి చేయాలి.

అప్లికేష‌న్ ఫీజు

అప్లికేష‌న్ ఫీజు ఓసీ అభ్యర్థుల‌కు రూ.2,000, ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు రూ.1,000 ఉంటుంది. అప్లికేష‌న్ ఫీజు ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది.

అప్లికేష‌న్‌తో జ‌త చేయాల్సిన ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు

1. ప‌దో త‌ర‌గ‌తి స‌ర్టిఫికేట్‌

2. ఏపీ మెడిక‌ల్ కౌన్సిల్‌లో పీజీ డిగ్రీ రిజిస్ట్రేష‌న్ అయిన స‌ర్టిఫికేట్‌

3. పీజీ (ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ) మార్కులు జాబితా (మార్కులు జాబితా లేక‌పోతే అప్లికేష‌న్‌ను ప‌రిగ‌ణించరు)

4. ఎంబీబీఎస్‌, పోస్టు గ్రాడ్యుష‌న్ (ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, డీఎం, ఎంసీహెచ్‌) ప్రొవిజ‌న‌ల్ స‌ర్టిఫికేట్స్‌

5. నాలుగో త‌ర‌గ‌తి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు స్టడీ స‌ర్టిఫికేట్లు. ఒకవేళ నాలుగో త‌ర‌గ‌తి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు తెలంగాణ‌లో చ‌దివితే, రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఆంధ్రప్ర‌దేశ్‌కు వ‌చ్చేస్తే మైగ్రేట్ స‌ర్టిఫికేట్‌.

6. కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

7. దివ్యాంగు స‌ర్టిఫికేట్

8. ఆధార్ కార్డు

ఎంపిక ప్రక్రియ

1. పోస్టు గ్రాడ్యుష‌న్‌లో మెరిట్ బ‌ట్టీ ఎంపిక ఉంటుంది.

2. అలాగే రూల్ ఆఫ్ రిజ‌ర్వేష‌న్‌కు అనుగుణంగా ఎంపిక ఉంటుంది.

3. ఒక వేళ ఒక అభ్యర్థి కంటే ఎక్కువ మంది అభ్యర్థుల‌కు స‌మానంగా మార్కులు వ‌స్తే, అప్పుడు పుట్టిన తేదీ (డేట్ ఆఫ్ బ‌ర్త్) ప‌రిగ‌ణన‌లోకి తీసుకుని, పెద్ద‌వారికి మొద‌టి ప్రాధాన్యత ఇస్తారు.

4. ఎంపిక‌కు ఒక క‌మిటీ ఉంటుంది. ఆ క‌మిటీ నేతృత్వంలోనే ఈ పోస్టుల భ‌ర్తీ చేస్తారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం