ఏపీ డిగ్రీ అడ్మిషన్లు 2025 : ఈనెల 6 వరకు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు - 10వ తేదీన సీట్ల కేటాయింపు-ap degree second phase counselling 2025 updates web options closed on october 6 ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ డిగ్రీ అడ్మిషన్లు 2025 : ఈనెల 6 వరకు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు - 10వ తేదీన సీట్ల కేటాయింపు

ఏపీ డిగ్రీ అడ్మిషన్లు 2025 : ఈనెల 6 వరకు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు - 10వ తేదీన సీట్ల కేటాయింపు

ఏపీలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షను అందుబాటులోకి వచ్చాయి. ఈనెల 6వ తేదీ రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. అక్టోబర్ 10వ తేదీన సీట్లను కేటాయిస్తారు.

ఏపీ డిగ్రీ అడ్మిషన్లు 2025

ఏపీలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు కూడా ముగిశాయి. ప్రస్తుతం వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. అక్టోబర్ 6 వరకు విద్యార్థులు కాలేజీలను ఎంచుకోవాలి.

ఈనెల 10వ తేదీన సీట్ల కేటాయింపు…

ఏపీ ఉన్నత విద్యా మండలి తెలిపిన వివరాల ప్రకారం… సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అక్టోబర్ 4వ తేదీ వరకు ఉంటుంది. వెబ్ ఆప్షన్ల గడువు అక్టోబర్ 6వ తేదీతో పూర్తవుతుంది. అక్టోబర్ 7వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు. ఫైనల్ గా అక్టోబర్ 10వ తేదీన సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందే విద్యార్థులు అక్టోబర్ 11వ తేదీ వరకు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. ఈ ప్రాసెస్ పూర్తి చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు.

  • అర్హత ఉన్న విద్యార్థులు https://oamdc.ucanapply.com/ వెబ్ సైట్ ద్వారా వెబ్ ఆప్షన్ల ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే వెబ్ సైట్ నుంచి అలాట్ మెంట్ కాపీని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • మొదటి విడత కౌన్సెలింగ్ లో భాగంగా అన్ని కోర్సుల్లో కలిపి మొత్తం 1,30,273 మందికి సీట్లు కేటాయించారు.
  • రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1200 కాలేజీల్లో 3,82,038 సీట్లు అందుబాటులో ఉండగా… 2,51,765 సీట్లు మిగిలిపోయాయి. ఈ రెండో విడతలో మిగిలిన సీట్ల భర్తీకి అవకాశం కల్పిస్తారు.
  • రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో 70,005 సీట్లు ఉండగా….. 27,348 సీట్లు భర్తీ అయ్యాయి.
  • ఇక ప్రైవేట్ కాలేజీల్లో 28,1940 సీట్లు ఉండగా 94,051 సీట్లు నిండాయి. ప్రైవేటు యూనివర్సిటీల్లో 1,461 సీట్లకు 428 భర్తీ అయ్యాయి.
  • ఏపీ ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన షెడ్యూల్ ఆధారంగా… రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్, అటానమస్ డిగ్రీ కాలేజీల్లో సాధారణ డిగ్రీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. దశల వారీగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తారు.
  • గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఆన్‌లైన్ అడ్మిషన్ మాడ్యుల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఏండీసీ) ద్వారా ఈ ప్రవేశాలను ప్రక్రియను పూర్తి చేస్తున్నారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం