ఏపీ విద్యార్థులకు ఉన్నత విద్యామండలి కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ ఏడాదికి సంబంధించిన ఎంట్రెన్స్ పరీక్షల తేదీలను ఖరారు చేసింది. ఈ షెడ్యూల్ వివరాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఉన్నత విద్యామండలి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… కీలమైన ఈఏపీసెట్ పరీక్షలు మే 19 నుంచి 27 తేదీ వరకు జరగనున్నాయి. ఈఏపీసెట్ (ఇంజినీరింగ్) స్ట్రీమ్ పరీక్ష మే 21 నుంచి 27వరకు ఉంటుంది. ఇక అగ్రికల్చర్, ఫార్మా స్ట్రీమ్ పరీక్ష మే 19, 20 తేదీల్లో జరగనుంది. ఏపీఐసెట్ మే 7వ తేదీన, లాసెట్ మే 25వ తేదీన నిర్వహిస్తారు.
ఇంజినీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ నిర్వహణ బాధ్యతలను ఈ ఏడాది జేఎన్‌టీయూ కాకినాడ చూడనుంది. కన్వీనర్‌గా ప్రొఫెసర్ వీవీ సుబ్బారావు నియమితులయ్యారు. ఇటీవలనే 8 ప్రవేశ పరీక్షలకు సంబంధించిన కన్వీనర్లను ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
లాసెట్ ప్రవేశ పరీక్షను శ్రీపద్మావతి మహిళా వర్శిటీ, ఈసెట్ - జేఎన్టీయ అనంతపురం, పీజీఈసెట్ - ఆంధ్రా యూనివర్శిటీ, ఐసెట్ - ఆంధ్రా యూనివర్శిటీ, పీఈసెట్ - ఆచార్య నాగార్జున యూనివర్శిటీ, ఎడ్ సెట్ - ఆచార్య నాగార్జున యూనివర్శిటీ, పీజీసెట్ - శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీ నిర్వహించనుంది.
సంబంధిత కథనం