Apcob Jobs: ఏపీ కో ఆప‌రేటివ్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజ‌ర్‌, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌...-ap cooperative bank has issued a notification for the recruitment of assistant manager and staff assistant posts ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Apcob Jobs: ఏపీ కో ఆప‌రేటివ్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజ‌ర్‌, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌...

Apcob Jobs: ఏపీ కో ఆప‌రేటివ్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజ‌ర్‌, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌...

HT Telugu Desk HT Telugu
Jan 13, 2025 03:38 PM IST

Apcob Jobs: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కోఆప‌రేటివ్ బ్యాంకులో ఉద్యోగ ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. రాష్ట్రంలోని కృష్ణా, క‌ర్నూలు, శ్రీ‌కాకుళం, గుంటూరు జిల్లాల్లో పోస్టులు భ‌ర్తీ చేస్తున్నారు.

ఏపీ కో ఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీ కో ఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్

Apcob Jobs: ఏపీ కో ఆపరేటివ్‌ బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. రాష్ట్రంలోని కృష్ణా, క‌ర్నూలు, శ్రీ‌కాకుళం, గుంటూరు జిల్లాల్లో పోస్టులు భ‌ర్తీ చేస్తున్నారు. ఆయా జిల్లాల్లో 251 అసిస్టెంట్ మేనేజ‌ర్‌, స్టాఫ్‌ అసిస్టెంట్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్య‌ర్థులు జ‌న‌వ‌రి 22 తేదీ లోపు ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసుకోవాల్సి ఉంటుంది.

yearly horoscope entry point

ఏ జిల్లాల్లో ఏ పోస్టులు ఎన్ని?

కృష్ణా, క‌ర్నూలు, శ్రీ‌కాకుళం, గుంటూరు జిల్లాల్లో ఏపీ స్టేట్ కోఆప‌రేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌లో ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. 251 అసిస్టెంట్ మేనేజ‌ర్‌, స్టాఫ్ అసిస్టెంట్‌ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టులు శ్రీకాకుళం జిల్లాలో 19, గుంటూరు జిల్లాలో 31 భ‌ర్తీ చేస్తున్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు-35, కృష్ణా జిల్లాలో స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు-66, క‌ర్నూలు జిల్లాలో స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు 50, గుంటూరు జిల్లాలో స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు 50 భ‌ర్తీ చేస్తున్నారు.

అర్హ‌త‌లు

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు గుర్తింపు పొందిన యూనివ‌ర్శిటీల నుంచి 60 శాతం మార్కుల‌తో ఏదైనా డిగ్రీ పూర్తి చేయాల్సి ఉంది. కామ‌ర్స్ అభ్య‌ర్థులు 55 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు భాష‌పై ప్రావీణ్యం ఉండాలి. కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం త‌ప్ప‌నిస‌రి.

ద‌ర‌ఖాస్తు ఇలా చేయాలి?

అర్హులైన ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తును ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి జ‌న‌వ‌రి 22 ఆఖ‌రు తేదీగా నిర్ణ‌యించారు.

అప్లికేష‌న్ ఫీజు

అప్లికేష‌న్ ఫీజు జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు రూ.700, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ‌, ఎక్స్ స‌ర్వీస్‌మెన్ అభ్య‌ర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ‌

ఈ పోస్టుల‌కు సంబంధించి ఫిబ్ర‌వ‌రిలో రాత ప‌రీక్ష ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఈ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ఇంగ్లీష్‌లోనే ప‌రీక్ష ఉంటుంది. వంద మార్కుల‌కు ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తారు. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. ఒక్కో త‌ప్పు స‌మాధానానికి 0.25 కోత విధిస్తారు. ఇంగ్లీష్ భాష నుంచి 30 ప్ర‌శ్న‌లు, రీజ‌నింగ్ 35 క్వాంటటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 35 మార్కులు ఉంటాయి.

నోటిఫికేష‌న్‌కు సంబంధించిన ముఖ్య‌మైన విష‌యాలు

1. ఉద్యోగ నోటిఫికేష‌న్ః ఏపీ స్టేట్ కోఆప‌రేటివ్ బ్యాంక్ లిమిటెడ్

2. ఉద్యోగాలుః అసిస్టెంట్ మేనేజ‌ర్‌, స్టాఫ్ అసిస్టెంట్‌

3. మొత్తం ఖాళీలుః 251 (అసిస్టెంట్ మేనేజ‌ర్‌-50 పోస్టులు, స్టాఫ్ అసిస్టెంట్‌-201 పోస్టులు)

4. ద‌ర‌ఖాస్తు చేసేందుకు ఆఖ‌రు తేదీః జ‌న‌వ‌రి 22

5. ద‌ర‌ఖాస్తు చేసే విధానంః ఆన్‌లైన్‌

6. రాత ప‌రీక్ష‌లుః ఫిబ్ర‌వ‌రి

ఈ డైరెక్ట్ లింకుల్లో జిల్లాల వారీగా నోటిఫికేష‌న్‌ల అద‌న‌పు స‌మాచారం

ఆయా జిల్లాల్లో పోస్టుల భ‌ర్తీకి సంబంధించి రిజ‌ర్వేష‌న్ ఇత‌ర స‌మాచారం కోసం ఈ క్రింది అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ల‌ను క్లిక్ చేయండి.

1. శ్రీకాకుళం జిల్లాలో అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టుల‌కు సంబంధించిన డైరెక్ట్ లింక్ https://apcob.org/wp-content/uploads/2025/01/Srikakulam-DCCB_Notification_Assistant-Managers.pdf

2. శ్రీకాకుళం జిల్లాలో స్టాఫ్ అసిస్టెంట్‌ పోస్టుల‌కు సంబంధించిన డైరెక్ట్ లింక్ https://apcob.org/wp-content/uploads/2025/01/Srikakulam-DCCB_Notification_Staff-Assistants.pdf

3. గుంటూరు జిల్లాలో అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టుల‌కు సంబంధించిన డైరెక్ట్ లింక్ https://apcob.org/wp-content/uploads/2025/01/Guntur-DCCB_Notification_Assistant-Managers.pdf

4. గుంటూరు జిల్లాలో స్టాఫ్ అసిస్టెంట్‌ పోస్టుల‌కు సంబంధించిన డైరెక్ట్ లింక్ https://apcob.org/wp-content/uploads/2025/01/Guntur-DCCB_Notification_Staff-Assistants.pdf

5. కృష్ణా జిల్లాలో స్టాఫ్ అసిస్టెంట్‌ పోస్టుల‌కు సంబంధించిన డైరెక్ట్ లింక్ https://apcob.org/wp-content/uploads/2025/01/Krishna-DCCB_Notification_Staff-Assistants.pdf

6. క‌ర్నూలు జిల్లాలో స్టాఫ్ అసిస్టెంట్‌ పోస్టుల‌కు సంబంధించిన డైరెక్ట్ లింక్ https://apcob.org/wp-content/uploads/2025/01/Kurnool-DCCB_Notification_Staff-Assistants.pdf

జిల్లాల వారీగా ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు డైరెక్ట్ లింక్‌లు

1. శ్రీకాకుళం జిల్లాలో అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టుల‌కు సంబంధించిన డైరెక్ట్ లింక్ https://ibpsonline.ibps.in/dccbmarc24/

2. శ్రీకాకుళం జిల్లాలో స్టాఫ్ అసిస్టెంట్‌ పోస్టుల‌కు సంబంధించిన డైరెక్ట్ లింక్ https://ibpsonline.ibps.in/dccbmarc24/

3. గుంటూరు జిల్లాలో అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టుల‌కు సంబంధించిన డైరెక్ట్ లింక్ https://ibpsonline.ibps.in/dccbmarc24/

4. గుంటూరు జిల్లాలో స్టాఫ్ అసిస్టెంట్‌ పోస్టుల‌కు సంబంధించిన డైరెక్ట్ లింక్ https://ibpsonline.ibps.in/dccbmarc24/

5. కృష్ణా జిల్లాలో స్టాఫ్ అసిస్టెంట్‌ పోస్టుల‌కు సంబంధించిన డైరెక్ట్ లింక్ https://ibpsonline.ibps.in/dccbmarc24/

6. క‌ర్నూలు జిల్లాలో స్టాఫ్ అసిస్టెంట్‌ పోస్టుల‌కు సంబంధించిన డైరెక్ట్ లింక్ https://ibpsonline.ibps.in/dccbmarc24 /

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner