Child Welfare Committee Jobs : ఏపీ చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీ, జువెనైల్ జ‌స్టిస్ బోర్డులో 91 ఖాళీలు, ముఖ్యమైన వివ‌రాలివే-ap child welfare committee juvenile justice board recruitment 91 vacancies announced ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Child Welfare Committee Jobs : ఏపీ చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీ, జువెనైల్ జ‌స్టిస్ బోర్డులో 91 ఖాళీలు, ముఖ్యమైన వివ‌రాలివే

Child Welfare Committee Jobs : ఏపీ చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీ, జువెనైల్ జ‌స్టిస్ బోర్డులో 91 ఖాళీలు, ముఖ్యమైన వివ‌రాలివే

HT Telugu Desk HT Telugu

Child Welfare Committee Jobs : ఏపీలో చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీ, జువెనైల్ జ‌స్టిస్ బోర్డులో 91 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆశక్తి ఉన్నవారు ఏప్రిల్ 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీ చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీ, జువెనైల్ జ‌స్టిస్ బోర్డులో 91 ఖాళీలు, ముఖ్యమైన వివ‌రాలివే

Child Welfare Committee Jobs: రాష్ట్రంలో చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీ, జువెనైల్ జ‌స్టిస్ బోర్డులో నియామ‌కాలకు నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. 91 ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు ఏప్రిల్ 9 ఆఖ‌రు గ‌డువు విధించారు. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ధ‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని బాలల సంక్షేమం, సేవలు శాఖ డైరెక్ట‌ర్‌ ఎం. వేణుగోపాల్ రెడ్డి కోరారు.

మొత్తం ఖాళీలు

రాష్ట్రంలోని 13 కొత్త జిల్లాల్లో బాలల సంక్షేమ కమిటీలు, జువెనైల్ జస్టిస్ బోర్డుల నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నారు. ఇందులో బాలల సంక్షేమ కమిటీల్లో ఒక్కొ జిల్లాలకు ఐదు ఖాళీలు చొప్పున 13 జిల్లాల‌కు 65 ఖాళీలు ఉన్నాయి. అలాగే జువెనైల్ జస్టిస్ బోర్డుల్లో ఒక్కో జిల్లాల‌కు రెండేసి ఖాళీలు చొప్పున 13 జిల్లాల‌కు 26 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 91 ఖాళీల‌ను భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు.

నియామ‌కాలు నిర్వహించే జిల్లాలు

రాష్ట్రంలోని 13 నూతన జిల్లాల్లో ఏర్పాటు చేయబోయే చైల్డ్ వెల్ఫేర్ కమిటీలలో చైర్ పర్సన్లు, మెంబర్లు, జువైనల్ జస్టిస్ బోర్డులలో (బాలల న్యాయ మండలిలో) సోషల్ వర్కర్ మెంబర్లుగా సేవలు అందించుటకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పార్వతీపురం మ‌న్యం, అల్లూరి సీతారామ‌రాజు, అన‌కాప‌ల్లి, కాకినాడ‌, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోన‌సీమ‌, ప‌శ్చిమ గోదావ‌రి, కృష్ణా, ప‌ల్నాడు, బాప‌ట్ల, నంద్యాల‌, అన్నమ‌య్య, చిత్తూరు, శ్రీ‌స‌త్యసాయి జిల్లాల్లో నియామకం చేప‌డుతున్నారు.

వ‌యో ప‌రిమితి

చైల్డ్ వెల్ఫేర్ కమిటీలలో చైర్ పర్సన్లు, మెంబర్లు, జువైనల్ జస్టిస్ బోర్డుల్లో సోషల్ వర్కర్ మెంబర్ల నియామ‌కానికి వ‌యో ప‌రిమితి 35 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉండాలి.

ద‌రఖాస్తు ఇలా చేసుకోవాలి

అప్లికేష‌న్ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://wdcw.ap.gov.in/dept_files/Application.pdf క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవాలి. అనంత‌రం ద‌ర‌ఖాస్తును పూర్తి చేసి, అర్హత ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీల‌ను జ‌త చేసి ఏప్రిల్ 9వ తేదీ సాయంత్రం 5.30 గంట‌ల‌లోపు విజయవాడలోని శాఖ డైరక్టర్ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తును ఈ చిరునామాకు The Director, Dept. of Juvenile Welfare, Correctional Services & Welfare of Street Children, D.No.3-1-265/4A, Govt. Observation Home for Boys premises, Near Kabela Centre, Rotary Nagar, Vidyadharapuram, Vijayawada – 520 012, NTR Dist., A.P పంపించాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్టుల ద్వారా మాత్రమే పంపాల్సి ఉంటుది. ఈ మెయిల్స్ ద్వారా పంపిన దరఖాస్తులు లేదా అసంపూర్తి దరఖాస్తులు అంగీకరించ‌డం కుద‌ర‌దు.

విద్యార్హతలు, అనుభవం, ఎంపిక విధానం, ఇతర వివరాలకు అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://wdcw.ap.gov.in/dept_files/Notification.pdf ను సందర్శించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం ప్రభుత్వ సెలవు దినాలు మినహా కార్యాలయ వేళల్లో మా అధికారి మొబైల్ నంబర్ 9100045396 కు కూడా సంప్రదించవ‌చ్చు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

సంబంధిత కథనం