APSDMA Recruitment 2025: ఏపీ విపత్తు నిర్వహణ సంస్థలో ఉద్యోగాలు - మంచి జీతం, ఇవిగో వివరాలు-andhra pradesh state disaster management authority notification for contract jobs 2025 ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Apsdma Recruitment 2025: ఏపీ విపత్తు నిర్వహణ సంస్థలో ఉద్యోగాలు - మంచి జీతం, ఇవిగో వివరాలు

APSDMA Recruitment 2025: ఏపీ విపత్తు నిర్వహణ సంస్థలో ఉద్యోగాలు - మంచి జీతం, ఇవిగో వివరాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 23, 2025 01:56 PM IST

APSDMA Recruitment 2025 : ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. కాంట్రాక్ట్ పద్ధతిలో రెండు ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. అర్హులైన వారు జనవరి 31లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://apsdma.ap.gov.in/ లింక్ పై క్లిక్ వివరాలు తెలుసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 2 ఖాళీలు ఉన్నాయి. ఇందులో ప్రాజెక్టు మేనేజర్ ఒక పోస్టు ఉండగా… మరో పోస్టు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉంది. ఈ రెండింటిని కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఖాళీల వివరాలు…

ప్రాజెక్టు మేనేజర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు డిజాస్టర్ మేనేజ్ మెంట్ లేదా ఇన్విరాన్ మెంటల్ సైన్స్ లేదా ఎర్త్ సైన్స్ లేదా Oceanography కోర్సులో పీజీ పూర్తి చేసి ఉండాలి. మూడేళ్లపాటు పని చేసిన అనుభవం కూడా ఉండాలి. 45 ఏళ్లలోపు వయసుగల వారు దరఖాస్తు చేసుకునేందుకు వీలు ఉంటుంది.

ఇక సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారు బీటెక్ లేదీ బీఈలో ఉత్తీర్ణత(65 శాతం) సాధించి ఉండాలి. 5 ఏళ్లకు పైగా పని చేసిన అనుభవం ఉండాలి. ఈ పోస్టుకు కూడా దరఖాస్తు చేసుకునే వారి వయసు 45 ఏళ్ల లోపు ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ప్రాజెక్టు మేనేజర్ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ. 49వేల జీతం చెల్లిస్తారు. ఇక సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ. 61,500 ఇస్తారు.

దరఖాస్తు విధానం…

అర్హులైన వారు జనవరి 31లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://apsdma.ap.gov.in/ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ వివరాలను నింపి… "The Managing Director, Andhra Pradesh State Disaster Management Authority, Revenue (DM) Department, D.No: 2U2B,, NH-16, Kunchanapalli, Tadepalli Mandal, Guntur, పిన్ కోడ్ - 522501" చిరునామాకు స్పీడ్ పోస్ట్ చేయాలి.

దరఖాస్తులను పరిశీలించిన తర్వాత.. షార్ట్ లిస్ట్ చేస్తారు. వారిని మాత్రమే ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఆ తర్వాత తుది జాబితాను ప్రకటిస్తారు.

ముఖ్య వివరాలు :

  • ఉద్యోగ ప్రకటన - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
  • ఖాళీలు - 02
  • ఖాళీల వివరాలు - ప్రాజెక్టు మేనేజర్ -1, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ - 1
  • కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేస్తారు
  • దరఖాస్తు విధానం - ఆఫ్ లైన్
  • దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ - 31 జనవరి 2025
  • అప్లికేషన్ డౌన్లోడ్ లింక్ - https://apsdma.ap.gov.in/files/33a653007e265e69f081919e756d220a.pdf
  • అధికారిక వెబ్ సైట్ - https://apsdma.ap.gov.in/

Whats_app_banner

సంబంధిత కథనం