District Judges Recruitment : జిల్లా జడ్జిల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. రాష్ట్రంలో మొత్తం 15 జిల్లా జడ్జి పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు దాఖలు చేసేందుకు మార్చి 27 ఆఖరు తేదీగా నిర్ణయించారు.
మొత్తం 15 జిల్లా జడ్జి పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో 14 జిల్లా జడ్జి పోస్టులు కాగా, ఒకటి జిల్లా సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) పోస్టు.
1. ఓసీ-4 (మహిళలకు ఒక పోస్టు)
2. ఈడబ్ల్యూఎస్- 2 (మహిళలకు ఒక పోస్టు)
3. బీసీ ఏ-1
4. బీసీ బీ-2 (మహిళలకు ఒక పోస్టు)
5. బీసీ సీ-2
6. బీసీ ఈ-1
7. ఎస్సీ-1
8. ఎస్టీ -1
జిల్లా జడ్జ్, సివిల్ జడ్జ్ పోస్టులకు -రూ.1,44,840-రూ.1,94,660
1. ఏడేళ్ల కంటే తక్కువ లేకుండా అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేసి ఉండాలి.
2. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వం కార్పొరేషన్లు, బాడీల్లో ఫుల్‌టైమ్ లా ఆఫీసర్‌గా ఉద్యోగం చేసినవారు, ఇండియన్ సిటిజన్ కాని వారు, అలాగే హైకోర్టు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసినవారు కూడా అనర్హులు.
2025 మార్చి 1 నాటికి 35 ఏళ్ల పూర్తి చేసుకోవాలి. 45 ఏళ్ల లోపు ఉండాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు వయోపరిమితి మూడేళ్ల సడలింపు ఉంటుంది.
1. పదో తరగతి, లా డిగ్రీతో పాటు ఇతర సర్టిఫికేట్లు
2. కుల ధ్రువీకరణ పత్రం
3. బార్ కౌన్సిల్ ఎన్‌రోల్ సర్టిఫికేట్
4. బార్ అసోసియేషన్ ఇచ్చిన ఒరిజినల్ ప్రాక్టీస్ సర్టిఫికేట్
5. వాదించిన కేసుల ఒరిజినల్ స్టేట్‌మెంట్లు (సివిల్, క్రిమినల్, ఇతర కేసుల వివరాలు)
6. సీనియర్ న్యాయవాదితో కలిసి వాయిదించిన కేసుల ఒరిజినల్ స్టేట్‌మెంట్లు (సివిల్, క్రిమినల్, ఇతర కేసుల వివరాలు)
7. సివిల్, క్రిమినల్ కేసుల్లో తిరస్కరణ గురైన కేసులు, రాత పూర్వక వాదనలు, జడ్జిమెంట్ ఆర్డర్ల ఒరిజినల్ స్టేట్‌మెంట్లు.
8. ఐటీ రిటర్నస్
అప్లికేషన్ ఫీజును favour of "Registrar(Recruitment), High Court of Andhra Pradesh, Nelapadu, Amaravati" డీడీ తీయాలి.
జిల్లా జడ్జి పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హైకోర్టు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తుంది. వంద మార్కులకు టెస్ట్ ఉంటుంది. వంద మల్టీపుల్ ఛాయిస్ అబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటుంది. రెండు గంటల పాటు ఎగ్జామ్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ జరిగే ప్రదేశం, సమయం హాల్ టిక్కెట్టుపైన ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్‌లో 40 శాతం మార్కులు వచ్చిన వారిని 1ః10 నిష్పత్తిలో షార్ట్ లిస్టు చేస్తారు. వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు.
రాత పరీక్ష మూడు పేపర్లు ఉంటుంది. ఒక్కో పేపరు 100 మార్కులు ఉంటుంది. ఒక్కో పేపరు పరీక్ష సమయం మూడు గంటలు ఉంటుంది. పేపర్-1లో రాజ్యాంగం, సివిల్ లా, పేపర్-2లో క్రిమినల్ లా, పేపర్-3లో ఇంగ్లీష్ (ట్రాన్స్‌లేషన్ అండ్ వ్యాస రచన) ఉంటుంది. ట్రాన్స్‌లేషన్ తెలుగు నుంచి ఇంగ్లీష్‌కు, ఇంగ్లీష్ నుంచి తెలుగుకు ఉంటుంది. వ్యాస రచన లీగల్ సబ్జెక్టలపై ఉంటుంది. ట్రాన్స్‌లేషన్‌కు 25 మార్కులు, వ్యాస రచనకు 75 మార్కులు కేటాయించారు.
రాత పరీక్షలో 60 శాతం కంటే తక్కువ లేకుండా మార్కులు వస్తే వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకు 50 మార్కులు ఉంటాయి. ఆ తరువాత మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు.
అప్లికేషన్‌ను ఆఫ్‌లైన్‌లోనే దాఖలు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తును ఈ డైరెక్ట్ లింక్ https://aphc.gov.in/docs/18032025182619recruitment_notifications.pdf ను క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవాలి. అప్లికేషన్‌లో ఖాళీలను పూరించి, దానికి గజిటెడ్ అధికారితో సంతకం చేయించిన ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీలను జత చేయాలి. ఆ అప్లికేషన్ సెట్‌ను the Chief Secretary to Government, Government of Andhra Pradesh, General Administration (SC.F) Department, Secretariat Buildings, Velagapudi, Amaravati, Guntur District, PIN Code – 522238, Andhra Pradesh అడ్రస్‌కు మార్చి 27 సాయంత్రం 5 గంటల లోపు పంపాలి.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం