బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఏఐబీఈ -20 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఎల్ఎల్ బీ పూర్తి చేసిన వారితో పాటు ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా ఈ పరీక్షను రాయవచ్చు. అర్హత ఉన్న అభ్యర్థులు allindiabarexamination.com వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
ఏఐబీఈ ఎగ్జామ్ ఆన్ లైన్ దరఖాస్తులకు అక్టోబర్ 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అక్టోబర్ 31వ తేదీ అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. నవంబర్ 15వ తేదీన హాల్ టికెట్లను విడుదల చేస్తారు. నవంబర్ 30వ తేదీన ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు. తెలంగాణతో పాటు ఏపీలోనూ పరీక్షా కేంద్రాలుంటాయి.
ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అనేది న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించాలనుకునే లా గ్రాడ్యుయేట్ల కోసం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంవత్సరానికి రెండుసార్లు సర్టిఫికేషన్ పరీక్షను నిర్వహిస్తుంది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ అందజేస్తుంది.
ఇక ఆలిండియా బార్ ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణత సాధించాలంటే జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కనీస మార్కులు 40 శాతంగా ఉంది. మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.3500 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.2500గా ఉంటుంది. కేవలం ఆన్ లైన్ ద్వారానే ఈ చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయాలి.
గతేడాది ఏఐబీఈ -19 పరీక్షను డిసెంబర్ 22వ తేదీన నిర్వహించారు. ఆ వెంటనే ప్రాథమిక కీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిపై అభ్యంతరాలను కూడా స్వీకరించారు. ఆ తర్వాత మార్చి 6వ తేదీన ఫైనల్ కీని ప్రకటించారు. ఆ తర్వాత తుది ఫలితాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
సంబంధిత కథనం
టాపిక్