AIIMS Mangalagiri Recruitment 2025 : మంగళగిరి ఎయిమ్స్‌లో 73 ఉద్యోగ ఖాళీలు - కేవలం ఇంటర్వ్యూనే, ఇవిగో వివరాలు
AIIMS Mangalagiri Recruitment 2025 : మంగళగిరి ఎయిమ్స్ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. 19 విభాగాల్లో 73 ఖాళీలను భర్తీ చేయనున్నారు. కేవలం ఇంటర్వ్యూతోనే వీటిని రిక్రూట్ చేస్తారు. జనవరి 23న ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.
మంగళగిరి ఎయిమ్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం ఇంటర్వ్యూతోనే ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. సీనియర్ రెసిడెంట్, సీనియర్ డిమోనిస్ట్రేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. జనవరి 23న ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పీఎంఎస్ఎస్‌వై) కింద ఈ పోస్టులను మూడేళ్ల కాల పరిమితితో భర్తీ చేస్తున్నారు.
పోస్టులు ఎన్ని….?
మొత్తం 19 విభాగాల్లో 73 పోస్టులను భర్తీ చేస్తున్నారు. జనరల్ కేటగిరిలో 21, ఓబీసీ 20, ఎస్‌సీ- 16, ఎస్టీ - 9, ఈడబ్ల్యూఎస్ 7 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను విభాగాల వారీగా చూస్తే… అనాటమీలో 3 ఖాళీలు ఉన్నాయి. ఇక కాలిన గాయాలు అండ్ ప్లాస్టిక్ సర్జరీ - 2, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ - 1, గ్యాస్ట్రోఎంటరాలజీ 2, జనరల్ మెడిసిన్ అండ్ సూపర్ స్పెషాలిటీ విభాగంలో 18 ఖాళీలు ఉన్నాయి.
ఇక జనరల్ సర్జరీ అండ్ సూపర్ స్పెషాలిటీలో 16, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ 1, మైక్రోబయాలజీ 1, పీడియాట్రిక్స్ / నియోనాటాలజీ 2, న్యూక్లియర్ మెడిసిన్ 2, ప్రసూతి & గైనకాలజీ 2, ఆప్తాల్మాలజీ 2, ఆర్థోపెడిక్స్ 2, పాథాలజీ 1, ఫిజికల్ మెడిసిన్ & రిహాబిలిటేషన్ 3, ఫిజియాలజీ 2, రేడియోడయాగ్నోసిస్ 3, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ మరియు హెమోథెరపీ 3, ట్రామా అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో 7 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అర్హతలు…
1. ఎండీ, ఎంఎస్, డీఎం, ఎం.సీహెచ్‌ల్లో పోస్టుగ్రాడ్యూషన్ మెడికల్ డిగ్రీ ఉండాలి.
2. గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డీఎన్‌బీ
3. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ), నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ), స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి.
4. ట్రామా అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఖాళీలకు అనస్థీషియా, ట్రామా & ఎమర్జెన్సీ మెడిసిన్, మెడికల్, సర్జికల్ బ్రాడ్, సూపర్ స్పెషాలిటీలు చెల్లుబాటు అయ్యే పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీతో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్వ్యూ తేదీ నాటికి 45 ఏళ్ల లోపు ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ ఐదేళ్లు, ఓబీసీ మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. అలాగే దివ్యాంగుల్లో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 10 ఏళ్లు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 13 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 15 ఏళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. మెడికల్ అభ్యర్థులకు ఏడో వేతన సంఘం పే లెవెల్-11 రూ.67,700 ఉంటుంది. అలాగే ఇతర అలవెన్సులు ఉంటాయి. నాన్ మెడికల్ అభ్యర్థులకు (పీహెచ్‌డీతో ఎంఎస్సీ) ఏడో వేతన సంఘం పే లెవెల్-10 రూ.56,100 ఉంటుంది. అలాగే ఇతర అలవెన్సులు ఉంటాయి.
ఎంపిక ప్రక్రియ…
కేవలం ఇంటర్వ్యూల ద్వారానే ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూలు కూడా ఫిజికల్ మోడ్‌లోనే నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలను మంగళగిరి ఎయిమ్స్ అడ్మిన్ అండ్ లైబ్రరీ బిల్డింగ్‌లో నిర్వహిస్తారు.
జనరల్, ఈడబ్ల్యుఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.1,500 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1,000. అప్లికేషన్ ఫీజును Name of the Bank SBI, AIIMS Mangalagiri Branch, Name of Account AIIMS MANGALAGIRI – RECEIPTS, Bank Account Number 38321557910, IFSC Code SBIN0061485పైన డీడీ తీయాలి.
దరఖాస్తు విధానం….
దరఖాస్తును ఆన్‌లైన్‌లో చేసుకోవాలి. ఈ లింక్ https://docs.google.com/forms/d/e/1FAIpQLSekBV_ncEm_EV0B0oKW8lXNmWeqf4wbS_t70FoS8ygcRHcPOg/viewform ను ఉపయోగించి దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూకి హాజరైనప్పుడు దరఖాస్తును ఫిజికల్‌గా అందజేయాల్సి ఉంటుంది. దానికి వయస్సు, మార్కుల జాబితా, డిగ్రీ సర్టిఫికేట్లు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు, కుల ధ్రువీకరణ పత్రం, దివ్యాంగు సర్టిఫికేట్ (ఉంటే)తో కూడిన ఒక సెట్ జిరాక్స్ కాపీలపై సెల్ఫ్ అటెస్టెడ్ చేయించి, దరఖాస్తుకు జత చేయాలి. అదనపు సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://www.aiimsmangalagiri.edu.in/wp-content/uploads/2025/01/Rolling-advertisement-for-recruitment-of-Senior-Residents-Senior-Demonstrators-at-AIIMS-Mangalagiri-January-2025.pdf ను సంప్రదించాలి.