AIIMS Bibinagar Recruitment 2025 : ఎయిమ్స్ బీబీనగర్‌లో 75 ఉద్యోగాలు - కేవలం ఇంటర్వ్యూనే..! ముఖ్య వివరాలు
AIIMS Bibinagar Recruitment 2025: బీబీ నగర్ ఎయిమ్స్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. సీనియర్ రెసిడెంట్(నాన్-అకడమిక్) ఉద్యోగాల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 75 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన వారు ఫిబ్రవరి 28లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
హైదరాబాద్ బీబీనగర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నుంచి ఉద్యోగ భర్తీ ప్రకటన విడుదలైంది. నాన్ - అకడమిక్ కోటాలోని సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 75 ఖాళీలు ఉన్నాయి.
75 ఖాళీలు….
ఈ పోస్టులకు అర్హులైన వారు… ఫిబ్రవరి 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారానే అప్లికేషన్ చేసుకోవాలి. అనస్థీషియాలజీ, ఈఎన్‌టీ, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ, జనరల్ మెడిసిన్ అండ్ సూపర్ స్పెషాలిటీస్, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్ అండ్ బ్లడ్ బ్యాంక్ తో పాటు మరికొన్ని విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. జనరల్ మెడిసిన్ అండ్ సూపర్ స్పెషాలిటీస్ విభాగంలో అత్యధికంగా 17 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధింత విభాగంలో పీజీ డిగ్రీ ఉండాలి. ఎంసీఐ లేదా ఎన్ఎంసీ లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవటంతో పాటు పని చేసిన అనుభవం కూడా ఉండాలి. ఈ పోస్టులను తాత్కాలిక పద్ధతిలో ఏడాది కాలానికి రిక్రూట్ చేస్తున్నారు. పని తీరు ఆధారంగా మూడేళ్ల వరకు పొడిగించవచ్చు.
ఎంపిక విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులు ఎయిమ్స్ బీబీ నగర్ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవాలి. అభ్యర్థుల ధ్రువపత్రాలు, అర్హతలను పరిశీలించిన తర్వాత… షార్ట్ లిస్ట్ చేస్తారు. వారిని మాత్రమే ఇంటర్వ్యూలకు పిలుస్తారు. మార్చి 5వ తేదీ నుంచి ఈ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఆడిటోరియంలో ఉదయం 09. 30 గంటలకు వీటిని నిర్వహిస్తారు. మార్చి 7వ తేదీలోపు అన్ని విభాగాల ఇంటర్వ్యూలు పూర్తవుతాయి. జనరల్ అభ్యర్థులు రూ. 1770, ఈడబ్యూఎస్ అభ్యర్థులు రూ. 1416 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు ఎలాంటి ఫీజు లేదు.
లింకావాల్సిన పత్రాలు:
- ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు ఆన్ లైన్ అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి.
- పుట్టిన తేదీ ధ్రువపత్రం.
- పదో తరగతి, ఎంబీబీఎస్ డిగ్రీ పత్రాలు.
- ఇంటర్న్ షిప్ పూర్తి చేసిన పత్రాలు.
- పీజీ పూర్తి చేసిన సర్టిఫికెట్లు.
- యూజీ, పీజీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు.
- కుల ధ్రువీకరణ పత్రం.
- పని చేసిన అనుభవం ఉంటే సంబంధిత పత్రాలు తీసుకెళ్లాలి.
ముఖ్య వివరాలు:
- ఉద్యోగ ప్రకటన - ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(బీబీనగర్), తెలంగాణ రాష్ట్రం
- ఉద్యోగాలు - సీనియర్ రెసిడెంట్ (నాన్-అకడమిక్)
- మొత్తం ఖాళీలు - 75 పోస్టులు
- అర్హత - ఎంబీబీఎస్/ బీడీఎస్ ఉత్తీర్ణత.
- వయసు - 45 ఏళ్లు మించకూడదు. కొన్ని వర్గాల అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. నోటిఫికేషన్ లో పూర్తి విరవాలు చూడొచ్చు
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్
- ఎంపిక విధానం - ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ - 28-02-2025.
- మెయిల్ అడ్రస్ - sr.aiimsbibinagar@gmail.com
ఈ లింక్ పై క్లిక్ చేస్తే ఆన్ లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది…..
సంబంధిత కథనం