AICTE : 2025 ఇయర్ ఆఫ్ ఏఐ.. 4 కోట్ల మంది విద్యార్థులు లబ్ధి పొందేలా ఏఐసీటీఈ ప్లానింగ్
AICTE : 2025 సంవత్సరాన్ని (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ఏఐ సంవత్సరంగా ఏఐసీటీఈ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న 14,000కు పైగా ఏఐసీటీఈ అనుబంధ సంస్థలకు చెందిన 4 కోట్ల మంది విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(AICTE) 2025ని 'ఇయర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)'గా ప్రకటించింది. ఏఐలో భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు చేస్తామని తెలిపింది. ఉన్న 14,000కు పైగా ఏఐసీటీఈ అనుబంధ సంస్థలకు చెందిన 4 కోట్ల మంది విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతారు. ఈ ప్రకటనతో ఏఐని ఉన్నత విద్యలో చేర్చడం, సృజనాత్మకత, నైతికత, నాయకత్వాన్ని ప్రోత్సహించడం, తద్వారా కృత్రిమ మేధ ఆధారిత పురోగతిలో భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా స్థాపించాలని ఏఐసీటీఈ లక్ష్యంగా పెట్టుకుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో భారత్ ను ప్రపంచ అగ్రగామిగా, ఇన్నోవేషన్, ఎథిక్స్, ఎడ్యుకేషన్‌లో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేయాలని ఏఐసీటీఈ పిలుపునిచ్చింది. ఇంటర్ డిసిప్లినరీ ఏఐ కోర్సులు, రీసెర్చ్ ప్రోగ్రామ్‌లు చేపట్టడం, పరిశ్రమల ప్రమాణాలకు అనుగుణంగా ఏఐ ల్యాబ్‌లను ఏర్పాటు చేయడం, సామాజిక ప్రయోజనం కోసం నైతిక ఏఐ పద్ధతులను ప్రోత్సహించడం వంటి చర్యలను కాలేజీలు ప్రోత్సహిస్తాయి.
AI for All: The Future Begins Here అనే దేశవ్యాప్త కార్యక్రమంలో చేరడానికి ఏఐసీటీఈ కింద ఉన్న సంస్థలను కూడా ప్రోత్సహిస్తారు. వర్క్ షాప్ లు, హ్యాకథాన్ లు, గెస్ట్ ఉపన్యాసాల ద్వారా ఏఐ అవగాహన వారోత్సవాలను నిర్వహించేలా ప్లాన్ చేస్తారు. ఇన్నోవేషన్ ను ప్రోత్సహించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యాపారాలపై కెరీర్ మెంటరింగ్ ప్రోగ్రామ్ ల ద్వారా దృష్టి సారిస్తారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచింగ్‌కు సంబంధించి కాలేజీల్లో ఫ్యాకల్టీని మెరుగుపరిచేందుకు వర్క్ షాప్ లు, సర్టిఫికేషన్ లను ఏఐసీటీఈ కల్పిస్తుంది. ఇందుకోసం అడోబ్, సిస్కో, ఐబీఎం వంటి సంస్థలతో భాగస్వామ్యం వల్ల ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్టులు, మెంటార్షిప్ల ద్వారా విద్యార్థులకు రియల్ వరల్డ్ ఎక్స్పోజర్ పెరుగుతుంది. అంతేకాకుండా అత్యుత్తమ పనితీరు కనబర్చిన సంస్థలను ఏఐ ఎక్సలెన్స్‌కు నమూనాలుగా కౌన్సిల్ గుర్తించి అవార్డులు ఇస్తుంది.
2024 డిసెంబర్ 31 లోగా అన్ని సంస్థలు తమ ఏఐ అమలు ప్రణాళికలను సమర్పించాలని ఏఐసీటీఈ కోరింది. పథకాలను ఏఐసీటీఈ సమీక్షించి టాప్ ప్రజెంటేషన్లను ఇతర సంస్థలకు ప్రామాణికంగా ప్రదర్శిస్తుంది. 2025ను కృత్రిమ మేధస్సు సంవత్సరంగా అభివర్ణిస్తున్న తరుణంలో భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని నిర్మించేందుకు అందరం ఏకమవుదామని ఏఐసీటీఈ పిలుపునిచ్చింది. ఏఐ ఆవిష్కరణ, నైతికత, విద్యలో భారతదేశాన్ని గ్లోబల్ లీడర్ గా తయారు చేయగలమని భావిస్తోంది.