ANGRAU Recruitment 2025 : ఎన్జీ రంగా యూనివర్శిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - కేవలం ఇంటర్వ్యూనే..!
ANGRAU Recruitment 2025 : ఆచార్య ఎన్జీ రంగా యూనివర్శిటీ నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. వేర్వురు నోటిఫికేషన్లు ద్వారా పదికిపైగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. కేవలం ఇంటర్వ్యూల ద్వారానే ఎంపిక చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
గుంటూరు జిల్లాలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్శిటీలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం ఇంటర్వ్యూలతోనే ఉద్యోగాలు పొందవచ్చు. ఈ ఇంటర్వ్యూలను జనవరి 28న నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్నవారు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని యూనివర్శిటీ డైరెక్టర్ ఓ ప్రకటనలో కోరారు.

పోస్టులు - అర్హతలు…
ఈ నోటిఫికేషన్ లో భాగంగా… మొత్తం 10 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో టెక్నికల్ అసిస్టెంట్-5, ఫీల్డ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ -4, ట్రాక్టర్ డ్రైవర్-1 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులు క్వాలిటీ సీడ్ ప్రొడక్సన్, సీడ్ టెక్నాలజీ రీసెర్చ్ విభాగాల్లో ఉన్నాయి.
1. టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కనీసం 55 శాతం మార్కులతో అగ్రికల్చర్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
2. ఫీల్డ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అగ్రికల్చర్, సీడ్ టెక్నాలజీలో డిగ్రీ, లేదా పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
3. ట్రాక్టర్ డ్రైవర్ పోస్టుకు పదో తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి. డ్రైవింగ్ అనుభవం, మోటార్ మెకానిక్ వర్క్ తెలిసి ఉండాలి.
ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థుల వయస్సు 42 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగు అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు…
1. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకుః రూ.35,400తో పాటు డీఎ+హెచ్ఆర్ఏ కూడా ఇస్తారు.
2. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకుః రూ.29,200తో పాటు డీఎ+హెచ్ఆర్ఏ కూడా ఇస్తారు.
3. ట్రాక్టర్ డ్రైవర్ పోస్టుకుః రూ.21,700తో పాటు డీఎ+హెచ్ఆర్ఏ కూడా ఇస్తారు.
ఇంటర్వ్యూలు 28వ తేదీ ఉదయం 10 గంటలకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్శిటీ గుంటూరులోని అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో జరుగుతాయి. ఇంటర్వ్యూతో పాటు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా ఉంటుంది. అదనపు సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://angrau.ac.in/UPLOADS/CareersPDFs/Notification%20(3)_.pdf ను చూడొచ్చు.
రీసెర్చ్ అసోసియేట్ పోస్టు:
రీసెర్చ్ అసోసియేట్ పోస్టును భర్తీ చేసేందుకు కూడా నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ పోస్టును ఇంటర్వ్యూ ద్వారానే భర్తీ చేస్తారు. జనవరి 21న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ ఉంటుంది. నంద్యాలలోని నూనేపల్లిలో రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్‌లో ఇంటర్వ్యూ జరుగుతుంది.
జీతం అగ్రికల్చర్‌లో పీహెచ్‌డీ డిగ్రీ ఉన్నవారికి రూ.54,000+ హెచ్ఆర్ఏ ఉంటుంది. అదే మాస్టర్ డిగ్రీ ఉన్న వారికి రూ.49,000+హెచ్ఆర్ఏ ఉంటుంది. వయస్సు పురుషులకు 40 ఏళ్లు, మహిళలకు 45 ఏళ్లు మించకూడదు. అదనపు సమచారం కోసం అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://angrau.ac.in/UPLOADS/CareersPDFs/RA%20notification%20(4).pdf ను చూడొచ్చు.
జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టును కూడా రిక్రూట్ చేయనున్నారు. ఈ పోస్టును ఇంటర్వ్యూ ద్వారానే భర్తీ చేస్తారు. జనవరి 25న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ ఉంటుంది. మారుటేరు ఆర్ఏఆర్ఎస్‌లో ఇంటర్వ్యూ జరుగుతుంది.
జీతం రూ.37,000 ఉంటుంది. ఈ పోస్టుకు ఎంఎస్సీ అగ్రికల్చర్, నెట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. వయస్సు పురుషులకు 40 ఏళ్లు, మహిళలకు 45 ఏళ్లు మించకూడదు. అదనపు సమచారం కోసం అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://angrau.ac.in/UPLOADS/CareersPDFs/JRF%20Interview-2.pdf చూడొచ్చు.
టెక్నాలజీ ఏజెంట్ పోస్టు:
టెక్నాలజీ పోస్టును భర్తీ చేసేందుకు ప్రకటన జారీ అయింది. ఈ పోస్టును ఇంటర్వ్యూ ద్వారానే భర్తీ చేస్తారు. జనవరి 20న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ ఉంటుంది. నంద్యాలలోని నూనేపల్లిలో రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్‌లో ఇంటర్వ్యూ జరుగుతుంది.
జీతం రూ.10,000 ఉంటుంది. ఈ పోస్టు అర్హత చూస్తే… అగ్రికల్చరల్‌లో బ్యాచిలర్ డిగ్రీ, సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. వయస్సు 21 నుంచి 45 మధ్య ఉండాలి. అదనపు సమచారం కోసం అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://angrau.ac.in/UPLOADS/CareersPDFs/WALK-IN-INTERVIEW%20for%20Technology%20Agent.pdf ను చూడొచ్చు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం