AAI Recruitment 2025: ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
AAI Recruitment 2025: ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఏఏఐ అధికారిక వెబ్ సైట్ https://aai.aero/ ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

AAI Recruitment 2025: ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఏఏఐ అధికారిక వెబ్సైట్ https://aai.aero/ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 224 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ 5 మార్చి 2025.
అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాల కోసం కింద చదవండి.
ఖాళీల వివరాలు
1. సీనియర్ అసిస్టెంట్ (అధికార భాష): 4 పోస్టులు
2. సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్): 21 పోస్టులు
3. సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్): 47 పోస్టులు
4. జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్): 152 పోస్టులు
అర్హతలు
అర్హులైన అభ్యర్థులు ఏఏఐ అధికారిక వెబ్సైట్ https://aai.aero/ లో అందుబాటులో ఉన్న డీటెయిల్డ్ నోటిఫికేషన్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయోపరిమితి 2025 మార్చి 5 నాటికి 30 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపిక ప్రక్రియలో రాతపరీక్ష, ఎంఎస్ ఆఫీస్ లో కంప్యూటర్ అక్షరాస్యత పరీక్ష, సీనియర్ అసిస్టెంట్ (అధికారిక భాష), (అకౌంట్స్) కోసం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి. ఎంపిక ప్రక్రియలో సీనియర్ అసిస్టెంట్ పోస్టుకు రాత పరీక్ష, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్ష ఉంటాయి. కంప్యూటర్ ఆధారిత/ ఆన్లైన్ పరీక్షను నిర్వహిస్తారు. ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్). అభ్యర్థులు రాసే తప్పు సమాధానానికి ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు.
దరఖాస్తు ఫీజు
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.1000 చెల్లించాలి. ఏఏఐలో 1 సంవత్సరం అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి, అలాగే మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ ఎక్స్ సర్వీస్మెన్ అండ్ అప్రెంటిస్ లకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్/ క్రెడిట్ కార్డులు/ డెబిట్ కార్డులు/ యూపీఐ/ వాలెట్ ద్వారా ఫీజు స్వీకరిస్తారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఏఏఐ అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.