AP Inter Results 2025 : విజయవాడలో విచిత్రం.. అన్ని సబ్జెక్టుల్లో 99 శాతం.. ఇంగ్లీష్‌లో మాత్రం 5 మార్కులే!-a student from vijayawada got only 5 marks in english in the ap inter results ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ap Inter Results 2025 : విజయవాడలో విచిత్రం.. అన్ని సబ్జెక్టుల్లో 99 శాతం.. ఇంగ్లీష్‌లో మాత్రం 5 మార్కులే!

AP Inter Results 2025 : విజయవాడలో విచిత్రం.. అన్ని సబ్జెక్టుల్లో 99 శాతం.. ఇంగ్లీష్‌లో మాత్రం 5 మార్కులే!

AP Inter Results 2025 : ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్ ఇయర్‌లో 70, సెకెండ్ ఇయర్‌లో 83 శాతం మంది పాస్ అయ్యారు. ఇక్కడిదాకా ఎలా ఉన్నా.. విజయవాడలో ఓ విచిత్రం కనిపించింది. ఓ విద్యార్థినికి అన్ని సబ్జెక్టుల్లో 99 శాతాం మార్కులు వచ్చాయి. కానీ.. ఇంగ్లీష్‌లో మాత్రం కేవలం 5 మార్కులే వచ్చాయి.

ఏపీ ఇంటర్ ఫలితాలు 2025

ఆ విద్యార్థిని బాగా చదివేది. ఫస్ట్ ఇయర్‌లో 470కి.. 461 మార్కులు వచ్చాయి. సెకెండ్ ఇయర్‌లో కూడా అన్ని సబ్జెక్టుల్లో 99 శాతం మార్కులు వచ్చాయి. కానీ ఫెయిల్ అయ్యింది. ఈ రిజల్ట్ చూసి.. విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులు, అధ్యాపకులు నోరెళ్లబెట్టారు. విజయవాడలో వెలుగులోకి వచ్చింది ఈ విచిత్రం. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అన్ని పేపర్లలో 99 శాతం..

విజయవాడకు చెందిన దండే రాజేశ్వరి ఇంటర్‌ సెకెండ్ ఇయర్ పరీక్షలు రాసింది. ఫలితాల్లో 530కి 431 మార్కులు వచ్చాయి. అన్ని పేపర్లలో 99.06 శాతం మార్కులు వచ్చాయి. కానీ.. ఇంగ్లీష్‌లో మాత్రం వందకు కేవలం 5 మార్కులే వచ్చాయి. ఈ ఫలితాలు ఆమెతోపాటు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. రెండో ఏడాది ఫలితాల్లో.. ఫిజిక్స్, కెమిస్ట్రీ 60కి 60 మార్కులు వచ్చాయి. సంస్కృతంలో వందకు 98, మ్యాథ్స్‌ 2ఏ పరీక్షలో 75కి 73, 2బిలో 75కి 75 మార్కులు వచ్చాయి. ప్రాక్టికల్స్‌ 60కి 60 వచ్చాయి.

మార్కులు వేయడంలో పొరపాటు..

కేవలం ఇంగ్లీష్‌లో మాత్రమే 5 మార్కులు వచ్చాయి. అయితే.. పరీక్ష పేపర్ దిద్దడం, లేదంటే మార్కులు వేయడంలో పొరపాటు జరిగి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. రాజేశ్వరికి ఇంటర్‌ ఫస్ట్ ఇయర్‌లో 470కి 461 మార్కులు వచ్చాయి. అప్పుడు ఇంగ్లీష్‌లో వందకు 94 మార్కులొచ్చాయి. అలాంటిది రెండో ఏడాదిలో 5 మార్కులు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తనకు మార్కులు ఇలా రావడంపై విద్యార్థిని రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేయడానికి సిద్ధమవుతోంది.

ఇవాళ్టి నుంచే ఛాన్స్..

తాజా ఫలితాలపై సంతృప్తిచెందని విద్యార్థులు రీకౌంటింగ్, రీవాల్యుయేషన్‌కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇవాళ్టి నుంచి 22వ తేదీ వరకు రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. చివరి తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించరు. చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వరు. మార్కులలో ఎలాంటి మార్పు లేకపోయినా సరే ఇవ్వరు. రీవాల్యుయేషన్ తర్వాత వచ్చే మార్కులే తుది మార్కులుగా పరిగణిస్తారు. మార్కులు తగ్గినా కూడా అంగీకరించాల్సి ఉంటుంది. రీవాల్యుయేషన్ కోసం అప్లై చేసే విద్యార్థులకు వారి జవాబు పత్రాల స్కానింగ్ కాపీ కూడా ఇస్తారు.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం