Government internships : ఈ ప్రభుత్వ సంస్థల్లో ఇంజినీర్లకు ఇంటర్న్​షిప్​ ఛాన్స్​- స్టైఫెండ్​ కూడా..-6 government internship opportunities for engineering students ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Government Internships : ఈ ప్రభుత్వ సంస్థల్లో ఇంజినీర్లకు ఇంటర్న్​షిప్​ ఛాన్స్​- స్టైఫెండ్​ కూడా..

Government internships : ఈ ప్రభుత్వ సంస్థల్లో ఇంజినీర్లకు ఇంటర్న్​షిప్​ ఛాన్స్​- స్టైఫెండ్​ కూడా..

Sharath Chitturi HT Telugu
Published Feb 07, 2025 12:15 PM IST

Government internships of Engineering : ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రభుత్వ సంస్థలు వివిధ ఇంటర్న్​షిప్ అవకాశాలను కల్పిస్తున్నాయి. ఆ లిస్ట్​ని ఇక్కడ చెక్ చేసుకోండి.

ప్రభుత్వ సంస్థల్లో ఇంజినీర్లకు ఇంటర్న్​షిప్​
ప్రభుత్వ సంస్థల్లో ఇంజినీర్లకు ఇంటర్న్​షిప్​

ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న డిగ్రీల్లో ఇంజినీరింగ్ ఒకటి. భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 15 లక్షల మంది ఇంజనీర్లు కాంప్​సల నుంచి బయటకి వస్తుంటారు. మరి మీరు కూడా ఒక ఇంజినీర్​ ఆ? లేక ఇంజినీరింగ్​ చదువుకుంటున్నారా? అయితే, మీ వృత్తిని ప్రారంభించడానికి ప్రభుత్వ ఇంటర్న్​షిప్ ఆప్షన్స్​ బాగా ఉపయోగపడతాయి.  విద్యా సంస్థలు, వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలతో సహా అనేక ప్రభుత్వ సంస్థలు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్​షిప్​ అవకాశాలను అందిస్తున్నాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఐఐటీ పాలక్కడ్ సమ్మర్ ఇంటర్న్​షిప్​: సైన్స్, ఇంజినీరింగ్, హ్యుమానిటీస్ విద్యార్థులకు ఈ ఇంటర్న్​షిప్​. ఇంజినీరింగ్​ 3వ ఏడాది, 4వ ఏడాది చదువుకుంటున్న వారు ఈ ఇంటర్న్​షిప్​కి అప్లై చేసుకోవచ్చు. ఆరు వారాల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ వివిధ హార్డ్​వేర్​, సాఫ్ట్​వేర్​ విశ్లేషణ సాధనాలతో ప్రత్యక్ష పరిశోధన శిక్షణను ఈ ఇంటర్న్​షిప్​ మిళితం చేస్తుంది. ఈ ఇంటర్న్​షిప్​కు ఎంపికైన అభ్యర్థులందరికీ నెలకు రూ.8000/- (మొత్తం కాలానికి రూ.12000/- ) ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.

నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇంటర్న్​షిప్​ ప్రోగ్రామ్: ఈ అవకాశాన్ని న్యూ అండ్​ రెన్యువబుల్​ మినిస్ట్రీ అందిస్తుంది. వివిధ ఇంజినీరింగ్, సైన్స్, మేనేజ్​మెంట్, లా, ఇతర విభాగాల విద్యార్థులు మంత్రిత్వ శాఖ, సంస్థల్లో ఇంటర్న్​షిప్​లు చేపట్టవచ్చు. ఎంఎన్ఆర్ఈ అవసరాన్ని బట్టి ఏడాదికి రెండుసార్లు ఈ ఇంటర్న్​షిప్​ లభిస్తుంది. ఎంపికైన ఇంటర్న్​లు అందరికీ ఫిజికల్ ఇంటర్న్​షిప్​ కోసం నెలకు రూ.15,000 స్టైఫెండ్ లభిస్తుంది. ఇంటర్న్​షిప్​ వ్యవధి రెండు నుంచి ఆరు నెలలు ఉంటుంది.

డబ్ల్యూఎస్ఏఐ ఐఐటీఎం సమ్మర్ ఇంటర్న్​షిప్​: ఏదైనా భారతీయ విశ్వవిద్యాలయం / విద్యా సంస్థలో వారి 2 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ (రెగ్యులర్ / ఫుల్ టైమ్ ఇన్ ఇంజనీరింగ్ లేదా సైన్స్) 4 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ / 1 వ సంవత్సరం ప్రీ-ఫైనల్ ఇయర్​లో ఉన్న విద్యార్థుల కోసం ఐఐటిఎంలోని వాధ్వానీ స్కూల్ ఆఫ్ డేటా సైన్స్ అండ్ ఏఐ (డబ్ల్యుఎస్ఎఐ) ఈ ఇంటర్న్​షిప్​ నిర్వహిస్తుంది. ఇంటర్న్​షిప్​ వ్యవధి కనిష్టంగా 3 నెలలు, గరిష్టంగా 6 నెలలు. ఇది వ్యక్తిగత సమ్మర్ ఇంటర్న్​షిప్​. ఇంటర్న్​షిప్​ స్టైఫండ్ కూడా లభిస్తుంది.

డిజిటల్​ ఇండియా ఇంటర్న్​షిప్​: ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) నిర్వహించే ఈ ఇంటర్న్​షిప్​ పథకం చివరి డిగ్రీ లేదా సర్టిఫికేట్ పరీక్షలో కనీసం 60% మార్కులు సాధించి ఇంజనీరింగ్, మాస్టర్ లేదా లా డిగ్రీలను అభ్యసించే భారతీయ విద్యార్థుల కోసం! ఎంపికైన విద్యార్థులు సంతృప్తికరమైన పనితీరుకు లోబడి, వారి సూపర్​వైజర్/మెంటార్ ద్వారా ధృవీకరించిన నెలకు రూ.10,000/- స్టైపెండ్ పొందుతారు. ఇంటర్న్​షిప్​ కనీస వ్యవధి రెండు నెలలు. దీనిని పొడిగించే అవకాశం కూడా ఉంది.

ఎన్ఐఈఎల్ఐటీ ఇంటర్న్​షిప్​ ట్రైనింగ్: ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులకు ఎన్ఐఈఎల్ఐటీ డామన్ ఈ ఇంటర్న్​షిప్​ అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ఇంటర్న్​షిప్​ వ్యవధి రెండు వారాలు. ఒక బ్యాచ్​లో 30 సీట్లు మాత్రమే ఉంటాయి. ఒకేసారి మూడు బ్యాచ్​లు స్టార్ట్​ అవుతాయి. ఈ ఇంటర్న్​షిప్​ స్కీమ్ స్టైఫండ్ ఇవ్వదు.

టీఈసీ ఇంటర్న్​షిప్ స్కీమ్: డిపార్ట్​మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) సాంకేతిక విభాగం ఈ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్ (టీఈసీ). ఈ ఇంటర్న్​షిప్​ స్కీమ్ కేవలం ఇంజినీరింగ్ విద్యార్థులకు మాత్రమే! ఇంటర్న్​షిప్​ కనీస వ్యవధి ఆరు నెలలు, గరిష్టంగా పన్నెండు నెలల వరకు పొడిగించవచ్చు. ప్రతి ఇంటర్న్​కు ప్రో-రాటా ప్రాతిపదికన నెలకు రూ.15,000/- స్టైపెండ్ లభిస్తుంది. ఇంటర్న్​షిప్​ని విజయవంతంగా పూర్తి చేసి, కాంపిటెంట్ అథారిటీ ద్వారా సంతకం చేసిన, ఆమోదించిన రిపోర్ట్​ని సబ్మిట్ చేసిన తరువాత, ఒక సర్టిఫికేట్ జారీ చేస్తారు.

Whats_app_banner

సంబంధిత కథనం