New India Assurance Jobs: న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీలో 500ఉద్యోగాలు.. రూ.40వేల ప్రారంభ వేతనం-500 jobs at new india assurance company starting salary of rs 40 thousand ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  New India Assurance Jobs: న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీలో 500ఉద్యోగాలు.. రూ.40వేల ప్రారంభ వేతనం

New India Assurance Jobs: న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీలో 500ఉద్యోగాలు.. రూ.40వేల ప్రారంభ వేతనం

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 09, 2024 09:11 AM IST

New India Assurance Jobs: ప్రభుత్వ రంగ బీమా సంస్థ న్యూ ఇండియా అస్యూరెన్స్‌‌లో అసిస్టెంట్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా ఇన్సూరెన్స్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ది న్యూ ఇండియా అస్యూరెన్స్‌‌లో 500అసిస్టెంట్‌ ఉద్యోగాలను తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.

న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీలో ఉద్యోగాలు
న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీలో ఉద్యోగాలు

New India Assurance Jobs:న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీలో అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ విండో డిసెంబర్ 17 నుంచి అందుబాటులోకి వస్తుంది. 2025 జనవరి 1వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

yearly horoscope entry point

న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీలో అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు 21ఏళ్ల నుంచి 30ఏళ్ల మధ్య వయస్కులై ఉండాలి. దరఖాస్తుదారులు 2024 డిసెంబర్1 వ తేదీ నాటికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

అభ్యర్థులు ఏ రాష్ట్రంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నారో, అయా రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతీయ భాషలపై అవగాహన, పట్టు తప్పనిసరిగా ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40వేల రుపాయల ప్రాథమిక వేతనం లభిస్తుంది. పూర్తి వివరాలు రాష్ట్రాల వారీగా ఉద్యోగాల ఖాళీల వివరాలను నోటిఫికేషన్‌లో జత చేస్తారు.

న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో ఉద్యోగాల కోసం https://www.newindia.co.in/ ఈ లింకును అనుసరించండి. రిక్రూట్‌మెంట్‌ సెక్షన్‌లో తాజా నోటిఫికేషన్లను ఫాలో అవ్వండి.

ఎంపిక ప్రక్రియ, రిజర్వేషన్లు, పరీక్ష ఫీజులు, వయోపరిమితి, సడలింపు తదితర వివరాలను రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొంటారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను మాత్రమే అనుమతిస్తారు. పోస్టు ద్వారా పంపే దరఖాస్తులు స్వీకరించరని న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ స్పష్టం చేసింది. విద్యార్హతలు, ఇతర నిబంధనలను స్పష్టంగా చదివిన తర్వాత ఆన్‌లైన్‌ దరఖాస్తుల్ని పూర్తి చేయాల్సి ఉంటుంది.

Whats_app_banner