తెలంగాణలో ఉన్న పలు కోర్టుల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 1673 పోస్టుల ఖాళీల భర్తీ కోసం ఇటీవలనే నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. అయితే వీటికి సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు . https://tshc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం 1673 ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో 1277 టెక్నికల్ ఉద్యోగాలు ఉండగా.. మరో 184 నాన్-టెక్నికల్ కోటాలో ఉన్నాయి. ఇక తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్ కింద మరో 212 పోస్టులను కూడా రిక్రూట్ చేయనున్నారు. ఏప్రిల్ లో రాత పరీక్షలు జరుగుతాయి. మరికొన్ని పోస్టులకు జూన్ లో ఎగ్జామ్స్ ఉంటాయి.
ఈ ఉద్యోగాలను పార్టీ ఏ, పార్టీ బీలుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలన్నీ కూడా శాశ్వత ప్రాతిపాదికన భర్తీ చేయనున్నారు. రాత పరీక్షలతో పాటు స్కిల్స్ టెస్ట్ ఆధారంగా తుది జాబితాలను ప్రకటిస్తారు. అయితే పోస్టుల వివరాలతో కూడిన నోటిఫికేషన్లు హైకోర్టు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ఇందులో ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు.
సంబంధిత కథనం