తెలుగు న్యూస్ / career /
TG Courts Recruitment 2025 : తెలంగాణ కోర్టుల్లో 1,673 ఉద్యోగాలు - దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు..!
Telangana Courts Recruitment 2025 : తెలంగాణలోని పలు జిల్లాల్లోని కోర్టుల్లో 1,673 పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది. అర్హులైన అభ్యర్థులు జనవరి 31వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
తెలంగాణ కోర్టుల్లో ఉద్యోగాలు
తెలంగాణలోని జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు మరికొన్ని గంటల్లో పూర్తి కానుంది. అర్హులైన అభ్యర్థులు... జనవరి 31వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గడువు పొడిగించే అవకాశం లేదు.
ఇలా దరఖాస్తు చేసుకోండి...
- అర్హులైన అభ్యర్థులు https://tshc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే రిక్రూట్ మెంట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ లింక్ కనిపిస్తుంది.
- పార్ట్ ఏలో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓటీపీఆర్ ఐడీ, పాస్ వర్డ్ జనరేట్ అవుతుంది.
- ఆ తర్వాత పార్ట్ బీలో అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటాన్నారో దానిపై క్లిక్ చేయాలి.
- నిర్ణయించిన రుసుం చెల్లించాలి. వివరాల పూర్తి తర్వాత సబ్మిట్ బటన్ పై నొక్కాలి. మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది.
- రిజిస్ట్రేషన్ నెంబర్ ను భద్రపర్చుకోవాలి. హాల్ టికెట్ల జారీలో ఉపయోగపడుతుంది.
ముఖ్య వివరాలు:
- ఉద్యోగ నోటిఫికేషన్ - తెలంగాణ హైకోర్టు
- మొత్తం ఖాళీలు - 1,673
- ఖాళీల వివరాలు - 1,277 నాన్-టెక్నికల్ పోస్టులు, 184 టెక్నికల్ పోస్టులు, జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్‌లోని 212 పోస్టులు ఉన్నాయి. వీటిల్లో కంప్యూటర్ ఆపరేటర్లు, అసిస్టెంట్లు, కోర్ట్ మాస్టర్లు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ III, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, కాపీయిస్టులు వంటి క్లరికల్ పోస్టులు ఉన్నాయి.
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్
- దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ - 31 జనవరి 2025.
- వీటికి సంబంధించిన పరీక్షలు 2025 ఏప్రిల్‌లో జరిగే అవకాశం ఉంది.
- అధికారిక వెబ్ సైట్ - https://tshc.gov.in/
- అప్లికేషన్ లింక్ - https://cdn3.digialm.com/EForms/configuredHtml/2775/92210/Index.html
సంబంధిత కథనం