Zomato share price : 10శాతం పతనమైన జొమాటో షేర్- ఇప్పుడు కొంటే లాభమా? లేక ఉన్నది అమ్మేయాలా?
Zomato share price : మదుపర్లను జొమాటో స్టాక్ భయపెడుతోంది! జొమాటో షేర్లు మంగళవారం దాదాపు 10శాతం పతనమయ్యాయి. మరి ఇప్పుడు ఈ స్టాక్‌ని కొనొచ్చా? జొమాటో షేర్ ప్రైజ్ టార్గెట్ ఏంటి? నిపుణులు ఏమంటున్నారంటే..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో జొమాటో షేర్ ప్రైజ్ భారీ పతనాన్ని చూసింది. బలహీనమైన క్యూ3 ఫలితాల కారణంగా జొమాటో స్టాక్‌లో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. నేటి ట్రేడింగ్ సెషన్లో రూ. 223 వద్ద ఓపెన్ అయిన జొమాటో షేరు.. రూ. 207.80 వద్ద ఇంట్రాడే- లో హిట్ చేసింది. 10శాతం పడిన తర్వాత ఉదయం 11:30 గంటల సమయంలో రూ. 217 వద్ద ట్రేడ్ అవుతోంది. మరి ఈ స్టాక్‌ని ఇప్పుడు కొనొచ్చా? లేక ఉన్న షేర్లను అమ్మేయాలా? నిపుణులు ఏమంటున్నారంటే..

జొమాటో స్టాక్ పతనానికి కారణాలు..
క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ నుంచి వచ్చే ఆర్డర్లకు అనుగుణంగా వేగవంతమైన స్టోర్ విస్తరణకు సంస్థ ప్లాన్ చేయండతో మార్జిన్లు దెబ్బతిన్నాయి. దీని వల్ల డిసెంబర్ త్రైమాసికంలో తమ కన్సాలిడేటెడ్ నికర లాభం 57.2 శాతం క్షీణించి రూ.59 కోట్లకు పడిపోయిందని జొమాటో సోమవారం ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.138 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
జొమాటో క్యూ3 ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఏంజిల్ వన్ బ్రోకరేజ్ టెక్నికల్ అండ్ డెరివేటివ్స్ సీనియర్ ఎనలిస్ట్ ఓషో క్రిషన్ ప్రకారం.. జొమాటో క్యూ3 ఫలితాల పతనం కారణంగా సంస్థ షేర్ ప్రైజ్ రోజువారీ చార్ట్‌లో 200 ఎస్ఎంఏ కంటే దిగువకు పడిపోయింది. దీనితో పాటు టెక్నికల్‌గా బలమైన బేరిష్ క్యాండిల్ స్టిక్ ఏర్పడింది. విస్తృత సాంకేతిక కోణంలో చూస్తే, ఈ స్టాక్ 'డబుల్ టాప్' సెటప్ నుంచి పడిపోయింది. ఇది సమీపకాలంలో మరింత కరెక్షన్‌ని సూచిస్తోంది.
“జొమాటో స్టాక్‌కి రూ. 200 లెవల్స్ వద్ద సపోర్ట్ ఉంద. అదే సమయంలో, స్టాక్ రూ. 245, రూ. 250 మధ్య రెసిస్టెన్స్ కూడా ఉంది. అది దాటితే మదుపర్లలో బుల్లిష్ సెంటిమెంట్ కనిపించవచ్చు. ఏదేమైనా, అటువంటి పురోగతి కనిపించేంత వరకు స్టాక్ విషయంలో జాగ్రత్తగా ప్రతికూలంగా ఉండాలి,” అని ఓషో అభిప్రాయపడ్డారు.
బ్రోకరేజీ సంస్థలు ఏం చెబుతున్నాయంటే..
బ్లింకిట్ డార్క్ స్టోర్ చేర్పుల వృద్ధి అంచనాలకు మించి ఉందని, ఇది వేగవంతమైన వృద్ధికి దోహదం చేస్తుందని నువామా బ్రోకరేజీ నివేదిక సూచిస్తోంది. అయినప్పటికీ దుకాణాలను ఓపెన్ చేయడానికి ప్రారంభ ఖర్చులు పెరగడం వల్ల లాభదాయకతకు తాత్కాలిక ఎదురుదెబ్బలు తగిలే అవకాశం ఉందని అభిప్రాయపడుతోంది.
డార్క్ స్టోర్లను జోడించడానికి ఈ ఖర్చుల సేకరణ స్వల్పకాలిక లాభదాయకతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని నువామా అంచనా వేసింది. అయితే ఈ స్టోర్స్ అందుబాటులోకి వచ్చాక రాబోయే త్రైమాసికాల్లో లాభదాయకత స్థిరీకరణకు దారితీస్తుంది. 2027 ఆర్థిక సంవత్సరం అంచనాలకు అనుగుణంగా రూ.300 (గతంలో రూ.325) అప్డేటెడ్ సమ్ ఆఫ్ ది పార్ట్స్ ఆధారిత టార్గెట్ ధరతో 'బై' రేటింగ్‌ని ఈఈ బ్రోకరేజ్ కొనసాగిస్తోంది. అంటే నువామా ప్రకారం జొమాటో షేర్ ప్రైజ్ టార్గెట్ రూ. 300
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్..
“జొమాటో ఫుడ్ డెలివరీ వ్యాపారం స్థిరంగా ఉంది. రిటైల్, కిరాణా, ఈ-కామర్స్ వంటి పరిశ్రమల స్పేస్‌లో బ్లింకిట్‌కి ఇంకా భారీ అవకాశం ఉంది. జొమాటో షేర్ ప్రైజ్ టార్గెట్ రూ.270 అని నిర్ణయించాము,” అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్లడించింది.
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం