Zomato lay offs: ఖర్చులను తగ్గించుకోవడానికి కస్టమర్ సపోర్ట్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకాన్ని పెంచుతున్న సమయంలో జొమాటో 600 మంది కస్టమర్ సపోర్ట్ అసోసియేట్లను తొలగించింది. జొమాటో తన ప్రధాన ఫుడ్ డెలివరీ వర్టికల్ లో వృద్ధి మందగించడం (మూడవ త్రైమాసిక లాభాలు సంవత్సరానికి 57% తగ్గాయి), అలాగే దాని శీఘ్ర వాణిజ్య విభాగమైన బ్లింకిట్ లో పెరుగుతున్న నష్టాలు కూడా దీనికి కారణమని తెలుస్తోంది.
గురుగ్రామ్ కు చెందిన కంపెనీ ఏడాది క్రితం జొమాటో అసోసియేట్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ (JAAP) కింద 1,500 మంది ఉద్యోగులను కస్టమర్ సపోర్ట్ రోల్స్ కోసం నియమించుకుంది. సేల్స్, ఆపరేషన్స్, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్, సపోర్ట్, సప్లయ్ చైన్, కేటగిరీ టీమ్స్ లో కేవలం ఏడాదిలోనే పదోన్నతులు పొందే అవకాశాన్ని కల్పించింది. అయితే కంపెనీ లేటెస్ట్ గా గురుగ్రామ్, హైదరాబాద్ కార్యాలయాల్లో పనిచేస్తున్న సుమారు 600 మంది ఉద్యోగులకు పదవీకాలం ముగిసినా కాంట్రాక్టులు రెన్యువల్ చేయలేదు. బాధిత కార్మికులకు నష్టపరిహారంగా ఒక నెల వేతనం ఇచ్చారని, పనితీరు సరిగా లేకపోవడం, సమయపాలన వంటి కారణాలతో నోటీసు ఇవ్వకుండా తొలగించారని నివేదికలో పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాల కోసం ఏఐ ఆధారిత కస్టమర్ సపోర్ట్ ప్లాట్ఫామ్ అయిన నగ్గెట్ ఇటీవల ప్రారంభమైంది. ఈ ప్లాట్ ఫామ్ తో ఈ ఉద్యోగాలను జొమాటో భర్తీ చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం జొమాటో, బ్లింకిట్ మరియు హైపర్ ప్యూర్ కోసం నెలకు 15 మిలియన్లకు పైగా సపోర్ట్ ఇంటరాక్షన్స్ ను చేస్తోంది. జొమాటో మునుపటి లేఆఫ్ రౌండ్ డిసెంబర్ 2022 లో జరిగింది, ఉత్పత్తి, టెక్, కేటలాగ్, మార్కెటింగ్ వంటి విభాగాలలో సుమారు నాలుగు శాతం మందిని తొలగించారు. దీనికి ముందు, సంస్థ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఆకృతి చోప్రా గత సంవత్సరం సంస్థను విడిచిపెట్టారు. ఆ తరువాత మాజీ సిటిఓ గుంజన్ పాటిదార్ 2023 జనవరిలో రాజీనామా చేశారు.
సంబంధిత కథనం