మిడిల్ క్లాస్ బడ్జెట్ ధరలోని లిటిల్ ఎలక్ట్రిక్ స్కూటర్.. లోకల్‌గా తిరిగేందుకు రేంజ్ కూడా ఓకే!-zelio e little gracy electric scooter at middle class budget price range also good for local rides know top things ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  మిడిల్ క్లాస్ బడ్జెట్ ధరలోని లిటిల్ ఎలక్ట్రిక్ స్కూటర్.. లోకల్‌గా తిరిగేందుకు రేంజ్ కూడా ఓకే!

మిడిల్ క్లాస్ బడ్జెట్ ధరలోని లిటిల్ ఎలక్ట్రిక్ స్కూటర్.. లోకల్‌గా తిరిగేందుకు రేంజ్ కూడా ఓకే!

Anand Sai HT Telugu

బడ్జెట్ ధరలోనే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఆలోచన ఉంటే మీ కోసం జెలియో ఈ ఉత్తమ ఈవీలను అందిస్తుంది. చాలా తక్కువ ధరలో ఈ కంపెనీ స్కూటీలను అందిస్తోంది.

జెలియో లిటిల్​ గ్రేసీ

ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు జెలియో ఈ మొబిలిటీ ఇటీవలే లిటిల్ గ్రేసీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. లిటిల్ గ్రేసీ మూడు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ. 49,500 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. అన్ని వయసులవారికి ఈ స్కూటర్లు సూట్ అవుతాయి.తక్కువ-వేగంతో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్ అని కంపెనీ చెబుతోంది.

ఈ కొత్త లిటిల్ గ్రేసీ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఇందులో బ్యాటరీ కెపాసిటీ ఆధారంగా ధర, రేంజ్ ఉన్నాయి. వేరియంట్‌లు వాటి బ్యాటరీ ఆప్షన్స్ ద్వారా ఉంటాయి.

ధర, రేంజ్

60V/30AH లి-అయాన్ బ్యాటరీ కలిగిన స్కూటర్ ధర రూ. 58,000. 8 నుండి 9 గంటల ఛార్జింగ్ సమయంతో 70 నుండి 75 కి.మీ రేంజ్ అందిస్తుంది. అదేవిధంగా 60V/32AH లెడ్ యాసిడ్ బ్యాటరీ కలిగిన స్కూటర్ ధర రూ. 52,000. 7 నుండి 9 గంటల ఛార్జింగ్ సమయంతో 70 కి.మీ రేంజ్ ఇస్తుంది. 48V/32AH లెడ్ యాసిడ్ బ్యాటరీ కలిగిన స్కూటర్ ధర రూ. 49,500. 7 నుండి 8 గంటల్లో పూర్తి ఛార్జ్‌తో 55 నుండి 60 కి.మీ రేంజ్ వస్తుంది.

కలర్ ఆప్షన్స్

ప్రతి మోడల్‌లో 48/60V BLDC మోటార్ ఉంటుంది. బరువు 80 కిలోలు. దీని లోడింగ్ సామర్థ్యం 150 కిలోలు కూడా ఉంటుంది. నాలుగు ఆకర్షణీయమైన రంగుల కలయికలలో ఈ ఈవీ లభిస్తుంది. రోజ్, బ్రౌన్/క్రీమ్, వైట్/బ్లూ, ఎల్లో/గ్రీన్. ఇది హైడ్రాలిక్ సస్పెన్షన్, ముందు, వెనుక రెండింటిలోనూ డ్రమ్ బ్రేక్‌లను కూడా కలిగి ఉంది. లిటిల్ గ్రేసీ మోటార్, కంట్రోలర్, ఫ్రేమ్‌ను కవర్ చేసే రెండు సంవత్సరాల వారంటీతో వస్తుంది.

ఫీచర్లు

స్కూటర్‌లో డిజిటల్ మీటర్, యూఎస్‌బీ పోర్ట్, కీలెస్ డ్రైవ్, యాంటీ-థెఫ్ట్ అలారంతో సెంటర్ లాక్, రివర్స్ గేర్, పార్కింగ్ స్విచ్, ఆటో-రిపేర్ స్విచ్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. దీని గరిష్ట వేగం గంటకు 25 కిలో మీటర్లు. 2025 చివరి నాటికి 1,000 ప్లస్ డీలర్‌షిప్‌లను కలిగి ఉండాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.