Income tax tips: వార్షిక వేతనం రూ .14.65 లక్షలు ఉన్నా.. ఇలా చేస్తే జీరో ఇన్ కమ్ ట్యాక్స్-your income tax outgo may become zero despite rs 14 65 lakh annual salary ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Income Tax Tips: వార్షిక వేతనం రూ .14.65 లక్షలు ఉన్నా.. ఇలా చేస్తే జీరో ఇన్ కమ్ ట్యాక్స్

Income tax tips: వార్షిక వేతనం రూ .14.65 లక్షలు ఉన్నా.. ఇలా చేస్తే జీరో ఇన్ కమ్ ట్యాక్స్

Sudarshan V HT Telugu

Zero Income tax: ఇటీవల బడ్జెట్ సమర్పణ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ఒక శుభవార్త తెలిపారు. రూ. 12.75 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అయితే, రూ. 14.65 లక్షల ఆదాయం వరకు కూడా ట్యాక్స్ కట్టనక్కర లేదు. ఎలాగంటే..?

ఇలా చేస్తే జీరో ఇన్ కమ్ ట్యాక్స్

No Income tax: మీరు రూ .12 లక్షల బ్రాకెట్ లో ఉన్నారు. త్వరలో మీ వేతనం మరింత పెరగనుంది. అయితే, శాలరీ పెంపుతో మీరు జీరో ట్యాక్స్ స్టేటస్ నుంచి పన్ను చెల్లించాల్సిన కేటగిరీలోకి వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ మీ వార్షిక వేతనం రూ .14.65 లక్షల వరకు ఉన్నాకూడా.. కొత్త పన్ను విధానంలో, మీరు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్లాన్ చేయవచ్చు.అందుకు మీరు మీ మినహాయింపులను వ్యూహాత్మకంగా ఉపయోగించాలి.

రూ.14.65 లక్షల ఆదాయానికి పన్ను మినహాయింపు ఎలా?

రూ.14.65 లక్షల కాస్ట్ టు కంపెనీ (సీటీసీ) కలిగిన వేతన ఉద్యోగులు కొత్త ఆదాయపు పన్ను విధానంలో జీరో ట్యాక్స్ ఎలా చెల్లించవచ్చో ట్యాక్స్2విన్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు అభిషేక్ సోనీ వివరించారు. అదెలాగో చూడండి..

వార్షిక ఆదాయం (సిటిసి): 14,65,000

మూల వేతనం (సిటిసిలో 50 శాతం): 7,32,500

ఎన్పీఎస్ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ (బేసిక్ లో 14 శాతం): 1,02,550

ఈపీఎఫ్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ (బేసిక్ లో 12 శాతం): 87,900

స్టాండర్డ్ డిడక్షన్: 75,000

పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం (మినహాయింపుల తరువాత) : రూ. 11,99,550 (ఈ మొత్తం రూ. 12 లక్షల ఆదాయానికి సంబంధించిన పన్ను మినహాయింపు పరిధిలో ఉంటుంది). అయితే, ఈ విధానం ఉద్యోగుల వేతనాల్లో ఎన్పీఎస్, ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్లు ఉన్నవారికి మాత్రమే వీలవుతుంది. అంటే, యజమాని కంట్రిబ్యూషన్స్ ఉన్న వేతన ఉద్యోగులకు మాత్రమే ఈ ప్రయోజనం వర్తిస్తుందని అభిషేక్ సోని చెప్పారు.

స్టాండర్డ్ డిడక్షన్

కొత్త విధానంలో వేతన జీవులకు రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్ లభిస్తుంది.

సెక్షన్ 80సీసీడీ(2)

సెక్షన్ 80సీసీడీ(2) కింద నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)కు కంట్రిబ్యూషన్ ఇవ్వాలి. ఎన్పీఎస్ లో ఇన్వెస్ట్ చేసే మీ బేసిక్ వేతనంలో 14 శాతం వరకు కోత విధించుకోవచ్చు.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)

ఈపీఎఫ్ కు యజమాని కంట్రిబ్యూషన్ (బేసిక్ వేతనంలో 12 శాతం) కు కూడా పన్ను మినహాయింపు ఉంటుంది.

కొత్త ఆదాయ పన్ను విధానంలో

కొత్త ఆదాయపు పన్ను విధానంలో పన్ను రిబేట్ పరిమితిని రూ .7 లక్షల నుండి రూ .12 లక్షలకు పెంచారు. ఇది మధ్య తరహా, అధిక ఆదాయం సంపాదించేవారికి గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుంది.

పెరిగిన ఎన్పీఎస్ మినహాయింపు: కొత్త పన్ను విధానంలో సెక్షన్ 80సీసీడీ (2) కింద బేసిక్ జీతం+ డీఏలో 14 శాతం వరకు ఎంప్లాయర్ ఎన్పీఎస్ కంట్రిబ్యూషన్లకు పన్ను మినహాయింపు ఉంది.

ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్స్ పన్ను మినహాయింపు: ఈపీఎఫ్ కు యజమాని కంట్రిబ్యూషన్ చేసే బేసిక్ జీతంతో పాటు డీఏలో 12 శాతం పన్ను మినహాయింపు ఉంటుంది.

తాజా ఆదాయ పన్ను శ్లాబులు 2025-26

రూ .0 - రూ .4 లక్షలు → పన్ను లేదు

రూ .4 లక్షలు - రూ .8 లక్షలు → 5% పన్ను

రూ. 8 లక్షలు - రూ .12 లక్షలు → 10% పన్ను

రూ. 12 లక్షలు - రూ .16 లక్షలు → 15%

రూ. 16 లక్షలు - రూ .20 లక్షలు → 20%

రూ .20 లక్షలు - రూ .24 లక్షలు → 25%

రూ .24 లక్షలు, ఆ పై → 30%

సూచన: పై అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులవి, హెచ్ టీ తెలుగు వి కావు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం