Air India: ఇక గిఫ్ట్ కార్డులతో ఎయిర్ ఇండియా టిక్కెట్లు కొనుగోలు చేయొచ్చు..; ఇతర సేవలకు కూడా వాడొచ్చు..
Air India gift cards: ఇక ఎయిర్ ఇండియాలో గిఫ్ట్ కార్డ్ లతో టికెట్స్ కొనుగోలు చేయొచ్చు. సీట్ సెలక్షన్ కు, ఎక్స్ ట్రా లగేజ్ కి కూడా గిఫ్ట్ కార్డులను ఉపయోగించవచ్చు. ఎయిర్ ఇండియా రూ.1,000 నుంచి రూ.2,00,000 విలువ చేసే గిఫ్ట్ కార్డులను ఇందుకోసం అందుబాటులో ఉంచింది.
Air India gift cards: ఎయిరిండియా గిఫ్ట్ కార్డులతో విమాన టికెట్ల కొనుగోలు సదుపాయాన్ని ప్రారంభించింది. రూ.1,000 నుంచి రూ.2,00,000 వరకు డినామినేషన్లలో ఈ-కార్డులు ఆన్ లైన్లో అందుబాటులో ఉంటాయని విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ గిఫ్ట్ కార్డులను దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో ఎక్స్ ట్రా బ్యాగేజ్, సీట్ల ఎంపిక వంటి అనుబంధ సేవలకు కూడా ఉపయోగించుకోవచ్చు.
కస్టమర్-సెంట్రిక్ సేవలను అందించడానికే..
గిఫ్ట్ కార్డుల ద్వారా ఎయిర్ ఇండియా విమానాల్లో డెస్టినేషన్, ప్రయాణ తేదీలు, క్యాబిన్ క్లాస్ ను కూడా ఎంచుకోవచ్చు. మరింత కస్టమర్-సెంట్రిక్ సేవలను అందించడానికి, ఎక్కువ మంది ప్రయాణికులు ఆకర్షించడానికి ఈ గిఫ్ట్ కార్డుల విధానాన్ని ప్రవేశపెట్టామని ఎయిర్ ఇండియా తెలిపింది.
ఎయిర్ ఇండియా గిఫ్ట్ కార్డులను ఎలా కొనుగోలు చేయవచ్చు?
ఎయిర్ ఇండియా గిఫ్ట్ కార్డ్స్ నాలుగు థీమ్ లలో giftcards.airindia.com వెబ్ సైట్ లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. అవి ట్రావెల్ (travel), వెడ్డింగ్ యానివర్సరీ, బర్త్ డే, స్పెషల్ మూమెంట్స్. వీటిని ప్రయాణ అవసరాలకు అనుగుణంగా, అలాగే సందర్భానికి అనుగుణంగా పర్సనలైజ్ చేసుకోవచ్చు.
ఎయిరిండియా గిఫ్ట్ కార్డులు బదిలీ చేయవచ్చా?
ఎయిర్ ఇండియా గిఫ్ట్ కార్డులను (Air India gift cards) కావాలనుకుంటే, బదిలీ కూడా చేసుకోవచ్చు. అంటే ఈ గిఫ్ట్ కార్డులను పొందినవారు తమ గిఫ్ట్ కార్డులను ఇతరుల కోసం విమాన టికెట్లను బుక్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఒకే లావాదేవీలో మూడు గిఫ్ట్ కార్డులను కలిపి క్రెడిట్ కార్డుతో కలిపి కూడా వాడుకోవచ్చు.
ఎయిర్ ఇండియా గిఫ్ట్ కార్డులను బహుళ ట్రిప్పులకు ఉపయోగించవచ్చా?
ఎయిర్ ఇండియా గిఫ్ట్ కార్డులను ఒకే ట్రిప్ కోసం లేదా ఒకటికి మించిన బహుళ బుకింగ్ లకు కూడా ఉపయోగించవచ్చు. మరెందుకు ఆలస్యం.. వెంటనే giftcards.airindia.com వెబ్ సైట్ కు వెళ్లి గిఫ్ట్ కార్డ్ ను కొనేసి మీకు నచ్చిన వారికి గిఫ్ట్ గా ఇచ్చేయండి.