WhatsApp Photo Edit : ఇకపై వాట్సాప్‌లోనే ఫొటో ఎడిట్ చేసుకోవచ్చు.. మరో కొత్త ఫీచర్!
Photo Edit In WhatsApp : వాట్సాప్ ఇటీవలే మెటా ఏఐ తీసుకొచ్చింది. దీనితో ఎలాంటి సమాచారం అయినా మీరు వాట్సాప్‌లోనే తెలుసుకోవచ్చు. అయితే ఇకపై మీ ఫొటోలను కూడా వాట్సాప్‌లోనే ఎడిట్ చేసుకుని ఆప్షన్ వస్తుంది.
ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌లో, వినియోగదారులు ఇటీవల మెటా ఏఐ ఫీచర్‌ను వాడటం మెుదలుపెట్టారు. కొందర సమాచారం కోసం వాడుతుంటే.. మరికొందరు దీనిని ఫన్నీగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు మెటా ఏఐ సాయంతో ఫొటోలను ఎడిట్ చేసుకునే ఆప్షన్ రాబోతోంది. వినియోగదారులకు ఫోటోలను ఎడిట్ చేసే ఎంపిక త్వరలో ఇవ్వనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఫొటోలను త్వరగా ఎడిట్ చేసుకోవచ్చు.
మెటా ఏఐ ఫీచర్‌ను చాలా మందే వాడుతున్నారు. ప్రస్తుతం ఇది చాట్ బాట్ లా పనిచేస్తుంది. మెసేజ్ లకు రిప్లైలు రాయడం లేదా వాటి సారాంశాన్ని రాయడం వంటి పనులు చేస్తుంది. ఏదైనా విషయంపై సమాచారం కావాలి అంటే.. మెటా ఏఐలో టైప్ చేస్తే సరిపోతుంది. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ అప్‌డేట్ తర్వాత మెటా ఏఐ వినియోగదారుల ఫోటోలను కూడా ఎడిట్ చేసే ఆప్షన్ తీసుకువస్తున్నారని అంటున్నారు.
ఫొటోలు క్లిక్ చేసిన తర్వాత వాటిని ఎవరికైనా పంపే ముందు ఎడిటింగ్ చేయడానికి చాలా సమయం, శ్రమ అవసరం. చాలా మంది వినియోగదారులకు, ఫోటోలను ఎడిట్ చేయడం చాలా సమయం తీసుకునే పని, చాలా ఫోటోలను ఒక్కొక్కటిగా ఎడిట్ చేయడం అంత సులభం కాదు. అటువంటి పరిస్థితిలో మెటా ఏఐ ద్వారా ఈజీగా ఫొటోలు ఎడిట్ చేసుకోవచ్చు. ఫోటోలు త్వరగా ఎడిట్ అవుతాయి.
వాట్సాప్ తన కొత్త ఫీచర్లను బీటా వెర్షన్‌లో పరీక్షిస్తుంది. ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే యాక్సెస్ ఉంది. అయితే, కొన్ని అప్‌గ్రేడ్‌ల తర్వాత ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఫొటోలో కనిపించే సబ్జెక్టుల గురించి కూడా ఏఐని అడిగే అవకాశం వస్తుందని అంటున్నారు.
డబ్ల్యూఏబీటాఇన్ఫో ప్రకారం, వినియోగదారులకు త్వరలో రిప్లై, ఎడిట్ ఫోటోల ప్రత్యేక బటన్ ఇస్తారు. దీని సాయంతో చాట్ లో మీ ఫొటోను అప్ లోడ్ చేసిన తర్వాత ఫొటోలోని సమాచారం అడగడమే కాకుండా ఎడిట్ కూడా చేసుకోవచ్చు.
టెక్స్ట్ బార్ లోని ఎమోజీ పక్కన కెమెరా ఐకాన్ ను చూపిస్తూ కొత్త ఫీచర్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా బయటకు వచ్చింది. దాన్ని ట్యాప్ చేయడం ద్వారా యూజర్లు తమ ఫొటోలను మెటా ఏఐకి పంపుకోవచ్చు. ప్రస్తుతం డెవలప్‌మెంట్ దశలో ఉన్నందున కొత్త ఫీచర్ ను ఉపయోగించలేమని, అయితే త్వరలోనే టెస్టింగ్ కోసం బీటా వెర్షన్ లో భాగం చేస్తారని తెలుస్తోంది.