అదిరిపోయే డీల్.. రూ.15,000లోపు వివో 5జీ ఫోన్.. 50 ఎంపీ కెమెరా!-you can buy vivo y29 5g smartphone under 15000 rupees at amazon deal know offer details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  అదిరిపోయే డీల్.. రూ.15,000లోపు వివో 5జీ ఫోన్.. 50 ఎంపీ కెమెరా!

అదిరిపోయే డీల్.. రూ.15,000లోపు వివో 5జీ ఫోన్.. 50 ఎంపీ కెమెరా!

Anand Sai HT Telugu

వివో వై9 5జీ స్మార్ట్‌ఫోన్ రూ.15,000 కంటే తక్కువకు మీరు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌పై క్యాష్‌బ్యాక్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.

ప్రతీకాత్మక చిత్రం

మీరు రూ.15,000 రేంజ్‌లో కొత్త 5జీ ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే.. అమెజాన్ మీ కోసం ప్రత్యేక డీల్‌ను అందిస్తోంది. వివో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వివో వై29 5జీపై ఈ డీల్‌ను అందిస్తున్నారు. 6 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర అమెజాన్‌లో రూ.15,499గా ఉంది. ఈ ఫోన్ మీద రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్‌తో ఈ ఫోన్ రూ.15,000 లోపు ధరకే లభిస్తుంది.

ఫోన్‌పై రూ.464 వరకు క్యాష్ బ్యాక్‌ను కంపెనీ అందిస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్‌లో చౌకగా లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో లభించే డిస్కౌంట్ మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.

వివో వై29 5జీ ఫీచర్లు

ఈ ఫోన్ లో 1608×720 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.68 అంగుళాల డిస్‌ప్లేను కంపెనీ అందిస్తోంది. ఈ డిస్‌ప్లే 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ లెవల్‌తో వస్తుంది. ఈ ఫోన్లో 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు. ప్రాసెసర్‌గా ఈ ఫోన్‌లో డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను చూడొచ్చు.

కెమెరా

ఫొటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక ప్యానెల్‌లో ఎల్ఈడీ ఫ్లాష్‌తో రెండు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 0.08 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 50 మెగాపిక్సెల్ కూడా ఇందులో అందించారు. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది. 5500 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. ఈ బ్యాటరీ 44 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఓఎస్ విషయానికొస్తే ఫన్ టచ్ ఓఎస్ 14పై పనిచేస్తుంది. ఈ ఫోన్ ఐపీ64 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.