రియల్‌మీ లవర్స్‌కు గుడ్‌న్యూస్. రియల్‌మీ పీ1 5జీ ఫోన్ ధరను తగ్గించింది. సాలిడ్ బ్యాంక్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్, కంపెనీ వెబ్‌సైట్‌లో లాంచ్ ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మీ పీ1 5జీ మొబైల్‌లో 50-మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇది డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఈ ఫోన్ 6.67 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో 128జబీ స్టోరేజ్, 5000mAh బ్యాటరీ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌ల ధరను తగ్గించింది.
రియల్‌మీ పీ1 5జీస్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల హెచ్‌డీ ప్లస్ అమోల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 2400 × 1080 పిక్సెల్ రిజల్యూషన్, 2000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. గ్రాఫిక్స్ కోసం 394పీపీ అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ UI 5.0 ఓఎస్‌పై నడుస్తుంది.
రియల్‌మీ పీ1 5జీ ఫోన్‌లో 6జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్ పెంచుకోవచ్చు.
రియల్‌మీ పీ1 5జీ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్‌లో ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. దుమ్ము నుండి రక్షణ కోసం ఐపీ54 రేటింగ్ పొందింది.
ఇక ధరల విషయానికి వస్తే... 6జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 14,999 వద్ద కొనులోగోలు చేయవచ్చు. అంటే 28 శాతం వరకు డిస్కౌంట్ వస్తుంది. ఎందుకటే ఈ ఫోన్ అసలు ధర రూ.20,999. బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
8జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గా ఉంది. దీని అసలు ధర రూ.21999. దీని మీద కూడా బ్యాంక్ ఆఫర్స్ పొందవచ్చు. ఫోన్ ఫీనిక్స్ రెడ్‌లో వస్తుంది. దీనిని ఫ్లిప్‌కార్ట్, కంపెనీ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు.
గమనిక : ప్రస్తుతం ఉన్న డిస్కౌంట్ ఆధారంగా ధరల వివరాలు ఇచ్చాం. భవిష్యత్తులో ఈ ధరలు మారవచ్చు. ఆఫర్ వివరాలు ఎప్పటికప్పుడు చూసుకోండి. డిస్కౌంట్ తగ్గవచ్చు, పెరగవచ్చు.
సంబంధిత కథనం