షోరూమ్‌కు వెళ్లకుండానే ఈ కంపెనీకి చెందిన స్కూటర్లు కొనుగోలు చేయవచ్చు.. ఇలా హోమ్ డెలివరీ!-you can book suzuki two wheelers on online platform flipkart to get home delivery ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  షోరూమ్‌కు వెళ్లకుండానే ఈ కంపెనీకి చెందిన స్కూటర్లు కొనుగోలు చేయవచ్చు.. ఇలా హోమ్ డెలివరీ!

షోరూమ్‌కు వెళ్లకుండానే ఈ కంపెనీకి చెందిన స్కూటర్లు కొనుగోలు చేయవచ్చు.. ఇలా హోమ్ డెలివరీ!

Anand Sai HT Telugu Published Apr 14, 2025 10:00 PM IST
Anand Sai HT Telugu
Published Apr 14, 2025 10:00 PM IST

Suzuki Scooters : సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ద్విచక్ర వాహనాలను కొనడం ఇప్పుడు సులభంగా మారింది. కంపెనీ తన ద్విచక్ర వాహనాలను ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అందుబాటులో ఉంచింది.

ఆన్‌లైన్‌లో సుజుకి స్కూటర్లు
ఆన్‌లైన్‌లో సుజుకి స్కూటర్లు

సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ద్విచక్ర వాహనాలను కొనడం ఇప్పుడు ఈజీగా అయింది. కంపెనీ తన ద్విచక్ర వాహనాలను ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అందుబాటులోకీ తీసుకొచ్చింది. ఇందుకోసం సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఈ రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌

ఈ భాగస్వామ్యాల ప్రయోజనం దేశంలోని 8 రాష్ట్రాల్లో లభిస్తుంది. వీటిలో కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మేఘాలయ, మిజోరం ఉన్నాయి. అదే సమయంలో కంపెనీకి చెందిన 8 మోడళ్లను ఈ ప్లాట్‌ఫామ్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇందులో అవెనిస్ స్కూటర్లు, జిక్సర్, జిక్సర్ ఎస్ఎఫ్, జిక్సర్ 250, జిక్సర్ ఎస్ఎఫ్ 250, వి-స్ట్రోమ్ ఎస్ఎక్స్ వంటి మోడళ్లు ఉన్నాయి.

అనేక ప్రయోజనాలు

భవిష్యత్తులో మరిన్ని రాష్ట్రాలకు తమ ద్విచక్ర వాహనాలకు ఆన్‌లైన్ బుకింగ్ సేవలను విస్తరించాలని సుజుకి యోచిస్తోంది. కంపెనీ డిజిటల్‌ పరంగా ముందుకు వెళ్లడం లక్ష్యంగా ఈ చర్య తీసుకుంది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ నుంచి ఈ వాహనాలను కొనుగోలు చేస్తే వినియోగదారులకు అనేక ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఇందులో కంపెనీ, అమ్మకందారు నుండి డిస్కౌంట్లతో పాటు, నో కాస్ట్ ఈఎంఐ, డెబిట్-క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు, ఉచిత డెలివరీ వంటి అనేక ప్రయోజనాలు కూడా ఉంటాయి.

ఈ టాప్ స్కూటర్లు లేవు

ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్ బుకింగ్ ప్రక్రియ కొనుగోలుదారులు వేరియంట్‌ను ఎంచుకోవడానికి, ఆర్డర్ చేయడానికి అనుమతిస్తుంది. సమీపంలోని డీలర్‌షిప్ డాక్యుమెంటేషన్ ప్రక్రియలో సహాయపడుతుంది. అదే సమయంలో సుజుకి ద్విచక్ర వాహనాలు రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత డెలివరీ అవుతాయి. సుజుకి బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ యాక్సెస్ ఇంకా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో లేదు. ఇందులో బర్గ్‌మన్ స్ట్రీట్ కూడా లేదు.

Anand Sai

eMail

సంబంధిత కథనం