Yes Bank results: ఎస్ బ్యాంక్ ఇన్వెస్టర్లకు బ్యాడ్ న్యూస్; భారీగా తగ్గిన లాభాలు
Yes Bank Q4 results: భారత్ లోని ప్రధాన ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన యెస్ బ్యాంక్ 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (Q4FY23) ఫలితాలను ప్రకటించింది.
Yes Bank Q4 results: 2021 -22 ఆర్థిక సంవత్సరం Q4 (Q4FY22) తో పోలిస్తే ఈ Q4FY23 లో యెస్ బ్యాంక్ (Yes Bank) నికర లాభాలు భారీగా తగ్గాయి. 2021 -22 ఆర్థిక సంవత్సరం Q4 (Q4FY22) లో యెస్ బ్యాంక్ నికర లాభాలు రూ. 367.46 కోట్లు కాగా, Q4FY23 లో యెస్ బ్యాంక్ (Yes Bank) నికర లాభాలు రూ. 202.43 కోట్లు. అంటే యెస్ బ్యాంక్ నికర లాభాల్లో దాదాపు 45% తగ్గుదల నమోదైంది.
Yes Bank Q4 results: Q3 తో పోలిస్తే, అద్భుతమైన ఫలితాలు..
అయితే, 2021 -22 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం Q3 (Q3FY23) తో పోలిస్తే, Q4FY23 లో యెస్ బ్యాంక్ (Yes Bank) అద్భుతమైన ఫలితాలను సాధించింది. Q3 కన్నా Q4 లో యెస్ బ్యాంక్ 293% అధిక లాభాలను సముపార్జించింది. Q3FY23 లో యెస్ బ్యాంక్ నికర లాభాలు రూ. 51.52 కోట్లు కాగా, Q4FY23 లో అవి రూ. 202.43 కోట్లకి పెరిగాయి. ప్రతికూల పరిస్థితులు, పరిణామాల మధ్య కూడా సానుకూల ఫలితాలను సాధించగలిగామని యెస్ బ్యాంక్ (Yes Bank) ఒక ప్రకటనలో తెలిపింది.
Yes Bank Q4 results: ఆదాయంలో మెరుగుదల
2022 -23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (Q4FY23) లో యెస్ బ్యాంక్ (Yes Bank) మొత్తం రూ. 7,298.51 కోట్ల ఆదాయం సముపార్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం Q4 (Q4FY22) లో బ్యాంక్ (Yes Bank) ఆదాయం రూ.5,829.22 కోట్లుగా ఉంది. మొత్తంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో యెస్ బ్యాంక్ అంతకుముందు ఆర్థిక సంవత్సరం (FY22) కన్నా 19.46% అధిక ఆదాయం సముపార్జించింది. FY23 లో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 26,624.08 కోట్లు కాగా, FY22 లో అది రూ. 22,285.98 కోట్లుగా నమోదైంది.