Yes Bank Q2 results: Yes Bank Q2 ఫలితాల వెల్లడి-yes bank q2 results net profit dips on provisioning net income grows 271 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Yes Bank Q2 Results: Yes Bank Q2 ఫలితాల వెల్లడి

Yes Bank Q2 results: Yes Bank Q2 ఫలితాల వెల్లడి

HT Telugu Desk HT Telugu
Oct 22, 2022 08:17 PM IST

Yes Bank Q2 results: Yes Bank Q2 ఫలితాలు శనివారం వెల్లడయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో Yes Bank net interest income (NIM) లో 31.7% మెరుగుదల కనిపించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Yes Bank Q2 results: గత సంవత్సరం Q2 తో పోలిస్తే.. ఈ Q2లో provisioning వ్యయం రూ. 377 crore నుంచి రూ. 583 కోట్లకు పెరగడంతో.. నికర వడ్డీ ఆదాయంలో 31.7% పెరుగుదల నమోదైనప్పటికీ.. నికర ఆదాయంలో రూ. 32.30% లోటు నమోదైంది.

Yes Bank Q2 results: నికర ఆదాయంలో లోటు

ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎస్ బ్యాంక్ రూ. 311 కోట్ల నికర లాభాలను(net profit) ఆర్జించగా, రెండో త్రైమాసికంలో నికర లాభాలు రూ. 153 కోట్లకు పడిపోయాయి. అంటే దాదాపు 50.8% లోటు. అలాగే, గత సంవత్సరం Q2లో బ్యాంక్ నికర లాభం రూ. 225 కోట్లు కాగా, ఈ సంవత్సరం Q2లో అది రూ. 153 కోట్లు మాత్రమే. అయితే, provisioning వ్యయం అనూహ్యంగా పెరగడం వల్లనే నికర లాభాల్లో తగ్గుదల నమోదైందని బ్యాంక్ ప్రకటించింది.

Yes Bank Q2 results: నికర ఆదాయం..

ఈ ఆర్థిక సంవత్సరం Q2లో బ్యాంక్ నికర ఆదాయం రూ. 2,911 కోట్లు. Q1 లో బ్యాంక్ నికర ఆదాయం రూ. 2,632 కోట్లుగా ఉంది. అలాగే, గత ఆర్థిక సంవత్సరం Q2లో బ్యాంక్ net income రూ. 2,290 కోట్లు. అంటే గత ఆర్థిక సంవత్సరం Q2 తో పోలిస్తే.. ఈ Q2లో 27.10 శాతం పెరుగుదల నమోదైంది.

Yes Bank Q2 results: మొత్తం ఆస్తుల విలువ

ఈ సంవత్సరం Q2 లో బ్యాంక్ మొత్తం ఆస్తుల విలువ రూ. 3,34,496 కోట్లు కాగా, Q1లో అది రూ. 3,18,475 కోట్లు. అలాగే, గత ఆర్థిక సంవత్సరం Q2లో బ్యాంక్ మొత్తం ఆస్తుల విలువ రూ. 2,88,523 కోట్లు.

Whats_app_banner