Yes Bank : ఉద్యోగులను తొలగించిన ఎస్ బ్యాంక్.. మరికొన్ని రోజుల్లో ఇంకొంత మంది!-yes bank lays off 500 employees in restructuring exercise and more job cuts likely in future ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Yes Bank : ఉద్యోగులను తొలగించిన ఎస్ బ్యాంక్.. మరికొన్ని రోజుల్లో ఇంకొంత మంది!

Yes Bank : ఉద్యోగులను తొలగించిన ఎస్ బ్యాంక్.. మరికొన్ని రోజుల్లో ఇంకొంత మంది!

Anand Sai HT Telugu
Jun 26, 2024 09:28 AM IST

Yes Bank Lay Offs : ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ అయిన ఎస్ బ్యాంక్ కొంతమంది ఉద్యోగులను తొలగించింది. బ్యాంక్ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా వ్యయ తగ్గింపు కోసం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే రానున్న రోజుల్లో బ్యాంకులో ఇలాంటి లేఆఫ్స్ మరిన్ని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు పలువురు.

ఎస్ బ్యాంక్
ఎస్ బ్యాంక్

ప్రైవేట్ రంగ ఎస్ బ్యాంక్ తన ఉద్యోగులను తొలగించింది. దాదాపు 500 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్టుగా తెలుస్తుంది. వ్యయాన్ని తగ్గించుకునేందుకు ఎస్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. రానున్న రోజుల్లో బ్యాంకులో ఇలాంటి లేఆఫ్స్ మరిన్ని ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే తొలగించిన ఉద్యోగులకు 3 నెలల జీతానికి సమానమైన పరిహారాన్ని కూడా అందించింది.

ఎస్ బ్యాంక్ అంతర్గత పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించిందని నిపుణులు పేర్కొంటున్నారు. అంటే వ్యయం అధికంగా అవుతుండటంతో పలు నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా చెబుతున్నారు. ఇప్పటివరకు 500 మంది ఉద్యోగులను తొలగించారు, రాబోయే వారాల్లో మరింత మందిని తొలగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఉద్యోగులను బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నట్లు ఎస్ బ్యాంక్ చెప్పుకొచ్చింది. దీనికి కారణం డిజిటల్ బ్యాంకింగ్‌పై దృష్టి పెట్టడమే.

'మా బ్యాంకుకు సంబంధించి బలమైన భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉన్నాం. సంస్థగా మా ప్రయత్నం మేం చేస్తున్నాం. శ్రామిక శక్తిని ఎలా పని చేయించుకోవాలని ఆలోచిస్తున్నాం. మా ఖాతాదారులకు అత్యుత్తమ బ్యాంకింగ్ సేవలను అందించడానికి, మా వాటాదారులకు బ్యాంక్ పూర్తి సామర్థ్యాన్ని అందించడానికి మేం కట్టుబడి ఉన్నాం.' అని ఎస్ బ్యాంక్ ప్రతినిధి చెప్పుకొచ్చారు.

డిజిటల్ బ్యాంకింగ్ వైపు మొగ్గు చూపడంపై దృష్టి సారించాలని ఎస్ బ్యాంక్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనితో పాటు మాన్యువల్ వర్క్ ను తగ్గించాలనే ఉద్దేశంలో ఉంది. దీనివల్ల బ్యాంకు వ్యయాలు కూడా తగ్గుతాయి. ప్రస్తుతం కొనసాగుతున్న బ్యాంకు నిర్వహణ వ్యయాలను తగ్గించడానికి కూడా సహాయపడుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

గత ఆర్థిక సంవత్సరంలో ఎస్ బ్యాంకు నిర్వహణ ఖర్చులు 17 శాతం పెరిగాయి. అదే సమయంలో 2023-2024 ఆర్థిక సంవత్సరాల మధ్య సిబ్బంది ఖర్చులు 12 శాతానికి పైగా పెరిగాయి. 2024 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బ్యాంకు ఉద్యోగుల కోసం రూ .3774 కోట్లు ఖర్చు చేయగా, 2023 ఆర్థిక సంవత్సరంలో రూ .3363 కోట్లు ఖర్చు చేసింది. 2024 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి బ్యాంకులో 28,000 మంది ఉద్యోగులు ఉండగా ఏడాది వ్యవధిలో 484 మంది ఉద్యోగులను చేర్చుకుంది.

అయితే తాజాగా వ్యయాలను తగ్గించుకుని డిజిటల్ బ్యాంకింగ్ వైపు దృష్టి పెట్టాలని ఎస్ బ్యాంక్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా 500మందికి పైగా ఉద్యోగులను తొలగించింది.

Whats_app_banner