Yamaha bikes launch: యమహా బైక్స్ లవర్స్ కు శుభవార్త; త్వరలో భారత మార్కెట్లోకి యమహా ఆర్ 3, ఎంటీ 03; ధర ఎంతంటే..?-yamaha r3 and mt 03 to launch tomorrow price expectation ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Yamaha Bikes Launch: యమహా బైక్స్ లవర్స్ కు శుభవార్త; త్వరలో భారత మార్కెట్లోకి యమహా ఆర్ 3, ఎంటీ 03; ధర ఎంతంటే..?

Yamaha bikes launch: యమహా బైక్స్ లవర్స్ కు శుభవార్త; త్వరలో భారత మార్కెట్లోకి యమహా ఆర్ 3, ఎంటీ 03; ధర ఎంతంటే..?

HT Telugu Desk HT Telugu
Published Dec 14, 2023 06:14 PM IST

Yamaha R3 and MT-03: యమహా లేటెస్ట్ మోడల్స్ అయిన ఎంటీ 03, ఆర్ 3 (Yamaha R3 and Yamaha MT-03) బైక్స్ త్వరలో భారతీయ రోడ్లపై పరుగులు తీయనున్నాయి. ఆ రెండు బైక్స్ ను త్వరలో భారతీయ మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు యమహా ప్రకటించింది.

మోటోజీపీ 2023 లో ఆవిష్కరించిన యమహా లేటెస్ట్ బైక్
మోటోజీపీ 2023 లో ఆవిష్కరించిన యమహా లేటెస్ట్ బైక్

Yamaha R3 and MT-03: యమహ నుంచి వచ్చిన ఆర్ 3, ఎంటీ 03 బైక్స్ భారతీయ మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయని యమహా ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఫలించాయి. త్వరలోనే ఆ రెండు బైక్స్ (Yamaha R3 and Yamaha MT-03) భారతీయ రోడ్లపై పరుగులు తీయనున్నాయి.

ఆర్ 3 మళ్లీ..

యమహా ఆర్ 3 బైక్ (Yamaha R3) ను గతంలో భారత్ లో లాంచ్ చేశారు. సేల్స్ కూడా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. కానీ, కాలుష్య ఉద్గార నిబంధనల కారణంగా ఆ మోడల్ సేల్స్ ను నిలిపేశారు. ఇప్పుడు అప్డేట్ చేసిన యమహా ఆర్ 3 మోడల్ భారత మార్కెట్లోకి రాబోతోంది. యమహా ఎంటీ 03 (Yamaha MT-03) మాత్రం భారత మార్కెట్లో అడుగుపెట్టడం ఇదే ప్రథమం.

రెండు ఒకే ప్లాట్ ఫామ్ పై..

యమహా ఎంటీ 03 (Yamaha MT-03), యమహా ఆర్ 3 (Yamaha R3) ఒకే ప్లాట్ ఫామ్ పై రూపొందాయి. ఈ రెండింటిలో ఇంజిన్, ఛాసిస్, ట్రాన్స్‌మిషన్, సస్పెన్షన్ ఒకే విధంగా ఉంటాయి. సస్పెన్షన్స్ విషయానికి వస్తే, ముందు వైపు అప్-సైడ్ డౌన్ ఫోర్క్స్, వెనుక వైపు మోనోషాక్స్ ఉంటాయి. ముందు, వెనుక వీల్స్ కు డిస్క్ బ్రేక్స్ ను అమర్చారు. అలాగే, ఆఫర్‌లో డ్యూయల్-ఛానల్ ABS, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

ఇంజన్ వివరాలు..

యమహా ఎంటీ 03 (Yamaha MT-03), యమహా ఆర్ 3 (Yamaha R3) బైక్స్ లో 321 సీసీ, లిక్విడ్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజన్ ఉంటుంది. ఇది 41.4 bhp గరిష్ట శక్తిని, 29.6 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది.

ఎల్ఈడీ లైటింగ్

యమహా R3, యమహా MT-03 బైక్స్ లో LED లైటింగ్, రైడర్‌కు ప్రాథమిక సమాచారాన్ని చూపే LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఉంటాయి. యమహా R3 మార్కెట్లో కవాసకి నింజా 300, KTM RC 390, అప్రిలియా RS 457 లకు పోటీగా నిలుస్తుంది. యమహా MT-03 డ్యూక్ 390, BMW G 310 R లకు పోటీగా నిలుస్తుంది.

ధర భారీగానే..

R3, MT-03 మోడల్ బైక్ లను డిసెంబర్ 15వ తేదీన భారత మార్కెట్లో యమహా విడుదల చేయనుంది. ఈ మోటార్‌సైకిళ్లు CBU లేదా కంప్లీట్లీ బిల్ట్ యూనిట్‌గా భారతదేశానికి వస్తాయి. అందువల్ల వాటి ధర ఎక్కువగా ఉంటుంది. యమహా R3 ఎక్స్-షోరూమ్‌ ధర దాదాపు రూ. 4 లక్షల వరకు ఉండవచ్చు. యమహా MT-03 ధర కాస్త తక్కువగా రూ. 3.8 లక్షల వరకు ఉండవచ్చు. తగినంత డిమాండ్ ఉంటే భవిష్యత్తులో ఈ మోటార్‌సైకిళ్ల ధర తగ్గే అవకాశం ఉంది.

Whats_app_banner