Xiaomi Summer Service Camp: షావోమీ, రెడ్‍మీ ఫోన్లు వాడుతున్న వారికి గుడ్‍న్యూస్.. ఫ్రీగా మొబైల్ చెకప్ సహా మరిన్ని..
Xiaomi Summer Service Camp 2023: షావోమీ సమ్మర్ సర్వీస్ క్యాంప్ జూన్ 1వ తేదీ నుంచి జూన్ 10 వరకు ఉండనుంది. షావోమీ, రెడ్‍మీ ఫోన్లు వాడుతున్న వారు సర్వీస్ సెంటర్లకు వెళ్లి చాలా ప్రయోజనాలను పొందవచ్చు.
Xiaomi Summer Service Camp 2023: సమ్మర్ సర్వీస్ క్యాంప్ కార్యక్రమాన్ని ప్రముఖ బ్రాండ్ షావోమీ ప్రకటించింది. జూన్ 1వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు ఈ సర్వీస్ క్యాంప్ ఉండనుంది. షావోమీ, రెడ్‍మీ మొబైళ్లు వాడుతున్న వారికి ఈ క్యాంప్ సందర్భంగా ప్రత్యేకమైన కస్టమర్ సపోర్ట్ బెనిఫిట్స్ అందుతాయి. ఆ 10 రోజుల్లో మొబైళ్లను షావోమీ సర్వీస్ సెంటర్లలో ఉచితంగా చెక్ చేయించుకోవచ్చు. లేబర్ కాస్ట్ ఉండదు. అలాగే ఉచితంగా సాఫ్ట్‌వేర్ అప్‍డేట్ చేయించుకోవచ్చు. మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ సమ్మర్ సర్వీస్ క్యాంప్ వివరాలు ఇవే.
ట్రెండింగ్ వార్తలు
ఈ షావోమీ సర్వీస్ క్యాంప్ సమయంలో షావోమీ, రెడ్‍మీ మొబైళ్లు వాడుతున్న యూజర్లు దగ్గర్లోని షావోమీ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి ఈ బెనిఫిట్స్ పొందవచ్చు. ఆ ప్రయోజనాలు ఏంటో ఇక్కడ చూడండి.
ఉచితంగా ఫోన్ హెల్త్ చెక్అప్: ఫోన్ సరైన కండీషన్‍లో ఉందా.. ఏవైనా సమస్యలు ఉన్నాయా అని సర్వీస్ సెంటర్‌లో యూజర్లు చెక్ చేయించుకోవచ్చు. ఈ సమ్మర్ క్యాంప్ 10 రోజులు పూర్తి ఉచితంగా ఈ మొబైల్ హెల్త్-చెక్అప్ సేవలను పొందవచ్చు.
లేబర్ చార్జీలపై 100శాతం ఆఫర్: మీ మొబైల్‍కు ఏదైనా రిపేర్ అవసరమైతే కేవలం స్పేర్ పార్ట్స్ కోసమే డబ్బు చెల్లించాలి. ఈ సర్వీస్ క్యాంప్ కాలంలో లేబర్ చార్జీలను పూర్తిగా మినహాయించనుంది షావోమీ. సాధారణంగా వారెంటీలో ఉండే మొబైళ్లకు సర్వీస్ మొత్తం ఉచితమే.
సాఫ్ట్‌వేర్ అప్‍డేట్లు ఉచితం: ఈ సమ్మర్ సర్వీస్ క్యాంప్ సమయంలో షావోమీ సర్వీస్ సెంటర్‌కు మొబైల్‍ను తీసుకెళ్లి.. ఉచితంగా సాఫ్ట్‌వేర్ అప్‍డేట్ చేయించుకోవచ్చు. ఇందుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సి అవసరం ఉండదు.
బ్యాటరీ రీప్లేస్‍మెంట్‍పై 50 శాతం వరకు ఆఫర్: మీ మొబైల్ బ్యాటరీ సరిగా పని చేయకుంటే 50 శాతం వరకు తగ్గింపుతో ఈ సమ్మర్ క్యాంప్‍లో కొత్త బ్యాటరీని పొందవచ్చు. అయితే, ఇది కొన్ని మోడళ్లకే వర్తిస్తుంది.
ఈ షావోమీ సమ్మర్ సర్వీస్ క్యాంప్ జూన్ 1వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు ఉంటుంది. దేశంలోని 1000కి పైగా ఉన్న షావోమీ ఆథరైజ్డ్ సెంటర్లకు వెళ్లి యూజర్లు ఈ ప్రయోజనాలను పొందవచ్చు. మీ దగ్గర్లో సర్వీస్ సెంటర్ ఎక్కడ ఉందో షావోమీ అధికారిక వెబ్‍సైట్‍లో, షావోమీ సర్వీస్+ యాప్‍లో తెలుసుకోవచ్చు.