Xiaomi Fan Festival 2023: షావోమీ మొబైళ్లు, స్మార్ట్ టీవీలపై ఆఫర్లు.. సేల్ తేదీలు, డిస్కౌంట్ల వివరాలు
Xiaomi Fan Festival 2023: షావోమీ ఫ్యాన్ ఫెస్టివల్ సేల్ అందుబాటులోకి వచ్చింది. ఈ సేల్‍లో షావోమీ మొబైళ్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‍టాప్‍లతో పాటు ఇతర గాడ్జెట్లు ఆఫర్లతో ఉన్నాయి. బ్యాంక్ కార్డు, ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
Xiaomi Fan Festival 2023: ప్రముఖ బ్రాండ్ షావోమీ(Xiaomi)కి చెందిన స్మార్ట్‌ఫోన్లు, స్మార్ టీవీలు, ల్యాప్‍టాప్‍లతో పాటు ఇతర ప్రొడక్టులు కొనాలకుంటున్న వారికి గుడ్‍న్యూస్ ఇది. కస్టమర్ల కోసం షావోమీ ప్రత్యేక సేల్ (Xiaomi Sale) తీసుకొచ్చింది. షావోమీ ఫ్యాన్ ఫెస్టివల్ (Xiaomi Fan Festival) పేరుతో ఈ సేల్‍ను మొదలుపెట్టింది. నేటి (ఏప్రిల్ 6) నుంచి ఈనెల 11వ తేదీ వరకు ఈ సేల్ జరగనుంది. షావోమీ అధికారిక వెబ్‍సైట్ mi.comలో ఈ సేల్ ఉంటుంది. ఈ సేల్‍లో 75 శాతం వరకు ఆఫర్లు ఉంటాయని షావోమీ పేర్కొంది. ముఖ్యంగా మొబైళ్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‍టాప్‍లపై ఆఫర్లు ఉన్నాయి. బ్యాంక్ కార్డు, వ్యాలెట్ చెల్లింపులపై డిస్కౌంట్లు దక్కుతాయి. షావోమీ ఫ్యాన్ ఫెస్టివల్ వివరాలివే.
ట్రెండింగ్ వార్తలు
Xiaomi Fan Festival 2023: బ్యాంక్ కార్డు సహా మరిన్ని ఆఫర్లు
షావోమీ ఫ్యాన్ ఫెస్టివల్ 2023లో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోళ్లు చేస్తే రూ.5,000 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. రూ.30వేలలోపు ప్రొడక్టులపై రూ.3,000 వేల వరకు ఈ కార్డు ఆఫర్ వర్తిస్తోంది. పేటీఎం వ్యాలెట్‍తో పేమెంట్ చేస్తే 10 శాతం రూ.1000 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే కొన్ని ప్రొడక్టులపై షావోమీ కూపన్లను ఇస్తోంది. కొనుగోలు చేసే సమయంలో వీటిని యాడ్ చేసుకుంటే మరింత తక్కువకే ప్రొడక్టులను పొందవచ్చు. ఎక్స్చేంజ్ చేసుకుంటే చాలా ప్రొడక్టులకు ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఈ ఫ్యాన్ ఫెస్టివల్ సేల్‍లో వర్తిస్తోంది. షావోమీ వెబ్‍సైట్ (mi.com)లో ఈనెల 11వ తేదీ వరకు సేల్ ఉంటుంది.
Xiaomi Fan Festival 2023: కొన్ని టాప్ డీల్స్
షావోమీ ఫ్యాన్ ఫెస్టివల్ సేల్‍లో ఆఫర్లను వినియోగించుకుంటే రెడ్‍మీ కే50ఐ 5జీ మొబైల్‍ను రూ.19,999కే దక్కించుకోవచ్చు. షావోమీ 12 ప్రో 5జీ ఫోన్‍ను రూ.50,000లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు. రెడ్‍మీ నోట్ 12 ప్రో 5జీ, రెడ్‍మీ నోట్ 12ప్రో+ 5జీ, రెడ్‍మీ నోట్ 12 5జీ, షావోమీ 13 ప్రో 5జీ సహా చాలా మొబైళ్లపై ఆఫర్లు ఉన్నాయి.
Xiaomi Fan Festival 2023: షావోమీ ఫ్యాన్ ఫెస్టివల్ సేల్‍లో 32 ఇంచుల స్మార్ట్ టీవీని రూ.11,500లోపు ధరకే కొనుగోలు చేసేలా ఆఫర్లు ఉన్నాయి. 43 ఇంచుల ఎక్స్ సిరీస్ స్మార్ట్ టీవీని రూ.24,999కే దక్కించుకోవచ్చు. కార్డు ఆఫర్ వాడుకుంటే ఈ సిరీస్‍లో 50 ఇంచుల మోడల్ రూ.32వేలలోపు ధరకే సొంతం చేసుకోవచ్చు. దాదాపు అన్ని మోడళ్లపై ఈ సేల్‍కు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. బ్యాంక్ కార్డు ఆఫర్లు వాడుకోవచ్చు.
Xiaomi Fan Festival 2023: రెడ్‍మీ బుక్ 15 ప్రో, షావోమీ నోట్‍బుక్ ప్రో 120 సిరీస్, ఎంఐ నోట్‍బుక్ అల్ట్రా ల్యాప్‍టాప్‍లపై కూడా డిస్కౌంట్లు ఈ ఫ్యాన్ ఫెస్టివల్ సేల్‍లో అందుబాటులో ఉన్నాయి. ఇక షావోమీకి చెందిన స్మార్ట్ కెమెరాలు, స్మార్ట్ వాచ్‍లు, హోమ్ అప్లియన్సెస్, ఇతర గాడ్జెట్లపైనా ఈ సేల్‍లో ఆఫర్లు ఉన్నాయి.
సంబంధిత కథనం