Phone Battery : ఫోన్ ఛార్జింగ్ ఎక్కువ సేపు ఉండాలంటే ఏం చేయాలి? ఈ ఫోన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు
Phone Charging Saving Tips : ఫోన్ ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండదు అనే కంప్లైంట్ చాలా మంది చేస్తారు. అయితే షియోమి కంపెనీ ఎక్కువసేపు ఛార్జింగ్ ఉండే బ్యాటరీలపై వర్క్ చేస్తుంది. దీనితోపాటుగా ఛార్జ్ ఎక్కువ సేపు రావాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.
ఫోన్‌తో చాలా మందికి ఉండే సమస్య ఏంటంటే.. ఎక్కువ సేపు ఛార్జింగ్ ఉండదు అని. ఏదో ముఖ్యమైన పనిలో ఉంటాం. అలాంటి సమయంలో ఛార్జింగ్ అయిపోతుంది. దీనితో చిరాకు వస్తుంది. అయితే షియోమి ఫోన్ ఛార్జింగ్ ఎక్కువసేపు వచ్చే బ్యాటరీలపై పని చేస్తోంది.
షియోమీ ఇప్పుడు చాలా ఫోన్లలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగిస్తోంది. భారత మార్కెట్లో రెడ్ మీ నోట్ 13 ప్రో ప్లస్ తాజా ఫోన్ లో కంపెనీ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఉపయోగించింది. ఈ ఫోన్ 25 నిమిషాల్లో 100 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. లీకర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం.. షియోమి కంపెనీ 5500 ఎంఏహెచ్, 6000 ఎంఏహెచ్, 6500 ఎంఏహెచ్, 7500 ఎంఏహెచ్, 100వాట్ లేదా 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్న ఫోన్లను పరీక్షిస్తోంది. షియోమి 7500 ఎంఏహెచ్ బ్యాటరీతో ఫోన్‌ను తీసుకువస్తోంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 3-4 రోజులు పనిచేస్తుంది
వన్‌ప్లస్ ఇటీవల 100వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6100 ఎంఏహెచ్ బ్యాటరీతో ఏస్ ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ఇది 36 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. వన్‌ప్లస్, హానర్ వంటి పలు కంపెనీలు చిన్న సైజుల్లో అధిక శక్తితో వచ్చే సిలికాన్-కార్బన్ నెగటివ్ ఎలక్ట్రోడ్ బ్యాటరీలను ఉపయోగించడం ప్రారంభించాయి. అయితే కొన్ని ఫోన్లలో 150 వాట్ ప్రయత్నించిన తరువాత చాలా కంపెనీలు ఛార్జింగ్‌ను 100 వాట్ లేదా 120 వాట్లకు పరిమితం చేస్తున్నాయి. షియోమి ఇప్పుడు తన ఫోన్ బ్యాటరీ ఎక్కువసేపు వచ్చేందుకు కసరత్తులు చేస్తోంది.
ఫోన్ ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండాలంటే ఏం చేయాలి?
ఏరోప్లేన్ మోడ్ : చాలాసార్లు బ్యాడ్ సిగ్నల్స్ ఉన్న ప్రాంతాల్లో ఫోన్ ఛార్జ్ చేయడానికి సమయం పడుతుంది. ప్లగ్ ఇన్ చేసే ముందు మీ ఫోన్‌ను ఎయిర్ ప్లేన్ మోడ్ లో ఉంచండి. ఇది పూర్తి ఛార్జింగ్ సమయాన్ని 25 శాతం వరకు తగ్గించగలదని టెస్టింగ్ చూపిస్తుంది. తర్వాత ఇది ఎక్కువసేపు బ్యాటరీ వస్తుంది.
ఫోన్ ఆఫ్ : ఛార్జింగ్ పెట్టేటప్పుడు మీ ఫోన్ ఆఫ్ అయితే, అది చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది. ఇలా చేయడం వల్ల ఛార్జింగ్ సమయంలో ఫోన్ యాక్టివిటీస్ అన్నీ ఆగిపోయి ఫోన్ వేగంగా ఛార్జ్ అవుతుంది. పూర్తి ఛార్జింగ్‌ను ఎక్కువసేపు వాడుకోవచ్చు.
సరైన ఛార్జర్ ఎంచుకోండి : కంప్యూటర్, ల్యాప్‌టాప్ యూఎస్బీ పోర్ట్ నుండి ఫోన్ను ఛార్జ్ చేయడం మానుకోండి. ఇలా చేస్తే చాలా స్లోగా ఛార్జింగ్ ఎక్కుతుంది. ఎక్కువసేపు రాదు.
కేబుల్ క్వాలిటీ : చాలాసార్లు ఒరిజినల్ ఛార్జర్ కేబుల్ కట్ అయిపోయి కొత్త కేబుల్ కొంటాం. కానీ లోకల్ కేబుల్ నుంచి ఛార్జింగ్ వేగం తగ్గి ఫోన్ ఆలస్యంగా ఛార్జ్ అవుతుంది. ఎక్కువ కాలం బ్యాటరీ రాదు.
టాపిక్