Xiaomi Civi 2 । ఐదు కెమెరాలతో షావోమి నుంచి స్టైలిష్ స్మార్ట్‌ఫోన్!
షావోమి నుంచి Xiaomi Civi 2 అనే స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనకవెపు ట్రిపుల్ కెమెరా, ముందువైపు డ్యుఎల్ కెమెరాలు ఇచ్చారు. ఇది ప్రీమియం ఫీచర్లు కలిగిన మీడియం రేంజ్ ఫోన్, ధరలు ఎలా ఉన్నాయో చూడండి.
చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమి, తాజాగా Xiaomi Civi 2 పేరుతో ఒక సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ పూర్తిగా సరికొత్త డిజైన్‌తో వచ్చింది. అలాగే కొత్త తరం చిప్‌సెట్‌లు, మెరుగైన కెమెరాలతో ప్రీమియం రేంజ్ ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో భాగంగా ట్రిపుల్ రియర్ కెమెరాలు, డ్యూయల్ ఫ్రంట్ కెమెరాలు, 5G కనెక్టివిటీ, డాల్బీ అట్మోస్ సపోర్ట్, 67W ఫాస్ట్ ఛార్జింగ్ వంటివి ప్రధాన అంశాలుగా చెప్పుకోవచ్చు.
Xiaomi Civi 2 డిజైన్ తమ బ్రాండ్ లోని పాత మోడళ్ల కంటే పూర్తిగా భిన్నంగా ఉన్నప్పటికీ, ఫీచర్ల పరంగా పోల్చి చూస్తే ఈ ఫోన్ Xiaomi 12 Lite 5G NE అలాగే Xiaomi 13 Lite వంటి స్మార్ట్‌ఫోన్‌లకు రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఉంది.
Xiaomi 12 సిరీస్ ఫోన్‌ల మాదిరిగానే Xiaomi Civi 2 స్మార్ట్‌ఫోన్ వెనుక ప్యానెల్ పై కెమెరా ఐలాండ్ డిజైన్‌తో వచ్చింది. అలాగే ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP Sony IMX766 ప్రధాన లెన్స్, 20MP IMX376K అల్ట్రా-వైడ్ లెన్స్ , 2MP గెలాక్సీకోర్ GC02M1 మాక్రో సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది క్వాడ్-LED ఫ్లాష్ సపోర్ట్‌తో ముందు భాగంలో 32MP + 32MP డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
ర్యామ్, స్టోరేజ్ ఆధారంగా Xiaomi Civi 2 మూడు కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. ఫోన్‌లో హీట్ నియంత్రణ కోసం ప్రత్యేకమైన VC లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. మరిన్ని ఫీచర్లు, స్పెక్స్, ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూడండి.
Xiaomi Civi 2 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.55అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే
- 8GB/12 GB RAM (12GB వరకు LPDDR4X RAM)
- 256 GB/512 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- Qualcomm స్నాప్‌డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్
- వెనకవైపు 50 MP+ 20MP +2MP ట్రిపుల్ కెమెరా సెటప్
- 32MP + 32MP డ్యూయల్ కెమెరా సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
- 4500 mAh బ్యాటరీ సామర్థ్యం, 67W ఛార్జర్
కనెక్టివిటీ కోసం Wi-Fi , బ్లూటూత్ వెర్షన్ 5.2, GPS/ A-GPS, 4G VoLTE, 5G (SA/NSA), NFC, USB టైప్-C పోర్ట్, యాక్సిలెరోమీటర్, మాగ్నెటోమీటర్, గైరోస్కోప్, IR (ఇన్‌ఫ్రారెడ్) బ్లాస్టర్ , ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ రీడర్ మొదలైనవి ఉన్నాయి.
ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ధరలను పరిశీలిస్తే..
8 GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర- CNY 2,399 (సుమారు రూ. 27,800)
8 GB RAM, 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర- CNY 2,499 (సుమారు రూ. 28,500)
12 GB RAM, 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర - CNY 2,799 (సుమారు రూ. 32,000)
Xiaomi Civi 2 గ్లోబల్ మార్కెట్లో ఎప్పుడు విడుదల అవుతుందనే దానిపై స్పష్టత లేదు. షావోమి ఆన్‌లైన్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
సంబంధిత కథనం