ియోమీ కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. ఇందులో షియోమీ సివి 5 ప్రో, 15ఎస్ ప్రో ఉన్నాయి. ఈ రెండు ఫోన్ల గురించి వివరాలు ఏంటో తెలుసుకుందాం..
కొత్త షియోమీ సివి 5 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.55 అంగుళాల క్వాడ్-కర్వ్డ్ ఓఎల్ఇడి డిస్‌ప్లే ప్యానెల్ ఉంది. ఇది 1.5 కె రిజల్యూషన్, సెల్ఫీ కెమెరా కోసం పిల్ షేప్ కటౌట్ కలిగి ఉంది. 3200 నిట్స్ బ్రైట్‌నెస్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను ఈ స్క్రీన్ అందిస్తుంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 చిప్‌సెట్, 16 జీబీ వరకు ఎల్పీపీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ ఉన్నాయి. షియోమీ హైపర్ ఓఎస్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఉంది. సుమిలక్స్ లెన్స్, ఓఐఎస్ సపోర్ట్ ఉంది. దీంతోపాటు 2ఎక్స్ ఆప్టికల్ జూమ్(శాంసంగ్ జేఎన్5 సెన్సార్), 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాతో 50 మెగాపిక్సెల్ ఫ్లోటింగ్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంది. సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ లెన్స్ ఉంది.
ఈ ఫోన్లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ మందం కేవలం 7.45 ఎంఎం కాగా, బరువు 184 గ్రాములు. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ రీడర్, వై-ఫై 7 సపోర్ట్, ఎన్ఎఫ్సీ, ఐఆర్ బ్లాస్టర్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.
ర్యామ్, స్టోరేజ్ ప్రకారం ఈ ఫోన్ మూడు కాన్ఫిగరేషన్లలో లాంచ్ అయింది. చైనాలో దీని బేస్ 12 ప్లస్ 256జీబీ వేరియంట్ ధరను 2,999 యువాన్లుగా(సుమారు రూ.35,800) నిర్ణయించారు. 12 ప్లస్ 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 3,299 యువాన్లుగా(సుమారు రూ.39,300), టాప్ ఎండ్ 16 ప్లస్ 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 3,599 యువాన్లుగా(సుమారు రూ.43,000) నిర్ణయించారు. నెబ్యులా పర్పుల్, సకురా పింక్, బ్లాక్ అండ్ వైట్ రంగులతో పాటు లిమిటెడ్ 'ఐస్డ్ అమెరికన్' ఎడిషన్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
ఇది షియోమీ ఫ్లాగ్ షిప్ ఫోన్. ఇందులో 6.73 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్‌డీఆర్10 ప్లస్, సిరామిక్ గ్లాస్ ప్రొటెక్షన్ 2.0తో డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్నాయి. షియోమీ స్వీయ-అభివృద్ధి చేసిన ఎక్స్ఆర్ఐ 01 3ఎన్ఎమ్ ప్రాసెసర్, 16 జీబీ వరకు ఎల్పిపీడీడీఆర్ 5ఎక్స్ ర్యామ్, 1 టీబీ వరకు యుఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.
50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఫోన్ నుంచి 8కే వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. 50వాట్ వైర్డ్, 6100వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 90 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.
షియోమీ 15ఎస్ ప్రో 16జీబీ ప్లస్ 512జీబీ వేరియంట్ ధరను 5499 యువాన్లుగా(సుమారు రూ.65,610), టాప్ ఎండ్ 16జీబీ ప్లస్ 1టీబీ వేరియంట్ ధరను 5999 యువాన్లుగా(సుమారు రూ.71,580) నిర్ణయించారు. ఈ ఫోన్ ఇప్పటికే చైనాలో అమ్మకానికి అందుబాటులో ఉంది.
టాపిక్