Realme Discount : ప్రపంచంలో అత్యంత ప్రకాశవంతమైన డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్.. రూ.5250 తగ్గింపు ధరతో-world brightest display 32mp selfie camera fastest charging phone realme gt 6t price cut by 5250 rupees know in details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Realme Discount : ప్రపంచంలో అత్యంత ప్రకాశవంతమైన డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్.. రూ.5250 తగ్గింపు ధరతో

Realme Discount : ప్రపంచంలో అత్యంత ప్రకాశవంతమైన డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్.. రూ.5250 తగ్గింపు ధరతో

Anand Sai HT Telugu
Oct 15, 2024 09:48 AM IST

Realme GT 6T Discount Offer : రియల్‌మీ ఫోన్ కొనాలని చూస్తుంటే మీ కోసం మంచి ఆఫర్ ఉంది. రియల్‌మీ జీటీ 6టీ ఫోన్‌ను రూ.5250 తగ్గింపుతో కొనుక్కోవచ్చు. ఈ ఫోన్ డిస్‌ప్లే బాగుంటుంది.

రియల్‌మీ జీటీ 6టీ ఫోన్‌
రియల్‌మీ జీటీ 6టీ ఫోన్‌

భారీ డిస్కౌంట్‌తో స్ట్రాంగ్ ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే అమెజాన్ బెస్ట్ డీల్స్ అందిస్తోంది. ఈ ఏడాది అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో లాంచ్ అయిన రియల్‌మీ జీటీ 6టీని రూ.5250 తగ్గింపుతో విక్రయిస్తున్నారు. 6000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వచ్చిన ఈ ఫోన్ ప్రపంచంలోనే అత్యంత ప్రకాశవంతమైన డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ ఎయిర్ గెస్చర్ కంట్రోల్‌తో వస్తుంది. ఈ డీల్ గురించి వివరంగా తెలుసుకుందాం:

రియల్ మీ జీటీ 6టీ గేమింగ్ ఫోన్‌పై అమెజాన్ సేల్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 16 జీబీ వరకు ర్యామ్‌తో వస్తుంది. 8 జీబీ హార్డ్‌వేర్, 8 జీబీ వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను అమెజాన్లో రూ.25,749 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై అమెజాన్ రూ.4250 కూపన్ డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే రూ.1000 డైరెక్ట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. దీని వల్ల మొత్తం డిస్కౌంట్ రూ.5250 అవుతుంది.

మరోవైపు, మీరు పాత ఫోన్ ఎక్స్ఛేంజ్లో కొనుగోలు చేస్తే మీరు రూ .20,000 వరకు తగ్గింపును సద్వినియోగం చేసుకోవచ్చు. అయితే ఈ డిస్కౌంట్ పూర్తిగా మీ పాత ఫోన్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.

రియల్‌మీ చెందిన ఈ ఫోన్లో 6.78 అంగుళాల ఎల్టీపీఓ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో 6000నిట్స్ డిస్‌ప్లేను ఈ ఫోన్ కలిగి ఉంది. అత్యంత శక్తివంతమైన కూలింగ్ సిస్టమ్ కూడా ఉన్నట్టుగా కంపెనీ పేర్కొంది.

ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 3 చిప్‌తో వస్తుంది. ఈ ప్రాసెసర్‌తో వస్తున్న భారత్‌లో ఇదే తొలి ఫోన్ అని కంపెనీ పేర్కొంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్ మీ యూఐ 5 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.

రియల్‌మీ జీటీ 6టీలో ఓఐఎస్ సపోర్ట్, సోనీ ఎల్వైటీ-600 లెన్స్, 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం సోనీ ఐఎంఎక్స్ 615 సెన్సార్‌తో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

రియల్‌మీ ఫోన్లో 120వాట్ సూపర్ వూక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. సౌండ్ కోసం స్టీరియో స్పీకర్లు కూడా ఈ ఫోన్లో ఉన్నాయి. దుమ్ము, నీటి నుంచి రక్షణకు ఐపీ 65 రేటింగ్‌తో వస్తుంది.

Whats_app_banner