Cars launch in September : సెప్టెంబర్​లో ఎలక్ట్రిక్​ వాహనాల జోరు- లాంచ్​కు రెడీ అవుతున్న..-windsor ev to e6 mpv electric cars expected to launch in india in september ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Cars Launch In September : సెప్టెంబర్​లో ఎలక్ట్రిక్​ వాహనాల జోరు- లాంచ్​కు రెడీ అవుతున్న..

Cars launch in September : సెప్టెంబర్​లో ఎలక్ట్రిక్​ వాహనాల జోరు- లాంచ్​కు రెడీ అవుతున్న..

Sharath Chitturi HT Telugu
Aug 31, 2024 05:48 AM IST

Electric cars launch in India : సెప్టెంబర్​లో భారతదేశంలో కనీసం మూడు ఎలక్ట్రిక్ కార్ల లాంచ్​ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..

సెప్టెంబర్​లో ఎలక్ట్రిక్​ వాహనాల జోరు- లాంచ్​కు రెడీ అవుతున్న..
సెప్టెంబర్​లో ఎలక్ట్రిక్​ వాహనాల జోరు- లాంచ్​కు రెడీ అవుతున్న..

రాబోయే పండుగ సీజన్​లో భారతదేశంలో అనేక కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు లాంచ్​కు రెడీ అవుతున్నాయి. వచ్చే కొన్ని వారాల్లో మూడు లాంచ్​లు జరిగే అవకాశం ఉండటంతో సెప్టెంబర్ నెల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలకు కీలకంగా మారింది. ఇప్పటికే రెండు కార్ల తయారీ సంస్థలు తమ మోడళ్ల లాంచ్ తేదీని ప్రకటించాయి. మూడో సంస్థ తన రాబోయే ఫేస్​లిఫ్ట్ ఎలక్ట్రిక్ వాహనం టీజర్​ను విడుదల చేసింది. బహుశా వచ్చే నెలాఖరులో అది విడుదల కానుందని సూచిస్తుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్​లో భారత్​లో లాంచ్​కానున్న ఎలక్ట్రిక్ కార్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

మెర్సిడెస్ మేబాచ్ ఈక్యూఎస్: సెప్టెంబర్ 5న లాంచ్..

జర్మనీ ఆటో దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ అల్ట్రా లగ్జరీ కార్ వింగ్ అయిన మేబాచ్ నుంచి మొదటి ఎలక్ట్రిక్ కారు వచ్చే వారం భారతదేశంలో లాంచ్ కానుంది. మేబాచ్ ఈక్యూఎస్ ఈక్యూఏ తర్వాత ఈ ఏడాది కార్ల తయారీ సంస్థ విడుదల చేసిన రెండో ఎలక్ట్రిక్ కారు. భారతదేశంలో జర్మన్ కార్ల తయారీదారుల లైనప్​లో ఇది అత్యంత ఖరీదైన ఈవీ.

ఈక్యూఎస్ ఎస్​యూవీ ఆధారంగా ప్రత్యేకమైన డ్యూయెల్ టోన్ ఎక్స్​టీరియర్ కలర్ థీమ్, మేబాచ్​ బ్యాడ్జింగ్​తో పాటు ఇతర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మెర్సిడెస్ మేబాచ్​ ఈవీని కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సీబీయూ) మార్గం ద్వారా భారతదేశానికి తీసుకురానున్నారు. సుమారు 600 కిలోమీటర్ల పరిధి గల మేబాక్ ఈక్యూఎస్ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ 649 బీహెచ్​పీ పవర్​ని, 950 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 4.4 సెకన్లలో 0- 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 210 కిలోమీటర్లకు పరిమితమైంది.

ఎంజీ విండ్సర్ ఈవీ: సెప్టెంబర్ 11న లాంచ్

జెడ్ఎస్ ఈవీ, కామెట్ ఈవీ విజయం తర్వాత జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్ తన మూడో ఎలక్ట్రిక్ కారును భారత్​లో ప్రవేశపెట్టనుంది. వచ్చే నెల రెండొవ వారంలో విడుదల కానున్న విండ్సర్ ఈవీ బుకింగ్స్ ఇప్పటికే అనధికారికంగా ఎంపిక చేసిన డీలర్​షిప్ షోరూమ్స్​లో ప్రారంభమయ్యాయి. చైనాలో తయారైన ఎలక్ట్రిక్ క్రాసోవర్ అయిన వులింగ్ క్లౌడ్ ఈవీ ఆధారంగా విండ్సర్ ఈవీని రూపొందించారు.

విండ్సర్ ఈవీ సెగ్మెంట్​లో అతిపెద్ద స్క్రీన్​తో వస్తుందని ఎంజి మోటార్ ఇప్పటికే ధృవీకరించింది. కార్ల తయారీ సంస్థ 15.6 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్​ని టీజ్ చేసింది. లాంజ్ లాంటి అనుభవం కోసం 135 డిగ్రీల రిక్లైనింగ్ ఫంక్షన్లతో ఈవీ వెనుక సీట్లను అందిస్తుందని కార్ల తయారీ సంస్థ ధృవీకరించింది. ఈ రెండింటితో పాటు వైర్ లెస్ స్మార్ట్​ఫోన్ కనెక్టివిటీ, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, ఫుల్లీ డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్ తదితర ఫీచర్లు ఈ ఎలక్ట్రిక్ క్రాసోవర్​లో ఉండనున్నాయి. ఇది 50.6 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​తో వస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాని పరిధిని 460 కిలోమీటర్లు అని తెలుస్తోంది.

బీవైడీ ఈ6 ఫేస్​లిఫ్ట్: సెప్టెంబర్​లో విడుదల..

చైనా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ బీవైడీ తన లేటెస్ట్ ఫేస్​లిఫ్ట్ వెర్షన్​లో తొలి ఎలక్ట్రిక్ ఎంపీవీ ఈ6ను విడుదల చేయనుంది. ఈ6 ఎలక్ట్రిక్ ఎం​పీవీ ఇటీవల గ్లోబల్ మార్కెట్ కోసం ఎం6గా ఆవిష్కరించడం జరిగింది. మూడేళ్ల క్రితం ఈవీ మేకర్ ఇండియాలో లాంచ్ చేసిన తొలి ఎలక్ట్రిక్ కారు ఈ6. బీవైడీ రాబోయే ఈవి టీజర్​ని వచ్చే నెలలో ప్రవేశపెట్టడానికి ముందు పంచుకుంది.

కొత్త ఇ6 ఎలక్ట్రిక్ ఎంపీవీలో 55.4 కిలోవాట్, 71.8 కిలోవాట్ల యూనిట్​తో సహా రెండు ఎంపికల బ్యాటరీ ప్యాక్​లను అందించవచ్చు. ఈ బ్యాటరీలను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 420 కిలోమీటర్ల నుంచి 530 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇది గరిష్టంగా 201బీహెచ్​పీ పవర్, 310ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం