అలర్ట్​- 2026 మార్చ్​ నాటికి రూ. 500 నోట్లు రద్దు.. ఈ వార్తల్లో నిజం ఎంత?-will the 500 rupee note go out of circulation in march 2026 govt said this ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  అలర్ట్​- 2026 మార్చ్​ నాటికి రూ. 500 నోట్లు రద్దు.. ఈ వార్తల్లో నిజం ఎంత?

అలర్ట్​- 2026 మార్చ్​ నాటికి రూ. 500 నోట్లు రద్దు.. ఈ వార్తల్లో నిజం ఎంత?

Sharath Chitturi HT Telugu

2026 మార్చ్​ నుంచి రూ.500 నోట్లను కేంద్రం దశలవారీగా రద్దు చేస్తుందని పేర్కొంటూ గత కొన్ని రోజులుగా యూట్యూబ్​లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వార్తల్లో నిజమెంతా? ఇక్కడ తెలుసుకోండి..

రూ. 500 నోట్లు! (Bloomberg/Representative Image)

రూ. 2వేల నోట్లను ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది. ఇక ఇప్పుడు రూ. 500 ఓట్లు కూడా రద్దు అవుతాయని గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి కేంద్రం తాజాగా చెక్​ పెట్టింది! 2026 మార్చ్​ నుంచి రూ. 500 నోట్లు చెలామణిలో ఉండవని వినిపిస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.

రూ. 500 నోట్ల రద్దు..

2026 మార్చ్​ నాటికి రూ. 500 నోట్లు రద్దు అవుతాయని క్యాపిటల్ టీవీ అనే యూట్యూబ్​ ఛానెల్​ నుంచి వీడియో బయటకు వచ్చింది. 12 నిమిషాల నిడివిగల ఈ వీడియో జూన్ 2 నుంచి ఐదు లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. ఫలితంగా ప్రజల్లో అయోమయం, భయాందోళనలు నెలకొన్నాయి.

ఇక ఇప్పుడు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ వాదనలపై స్పందించింది.

"రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అటువంటి ప్రకటన చేయలేదు. ప్రజలు ఎటువంటి తప్పుడు సమాచారాన్ని నమ్మకూడదని, వాదనలను ఎల్లప్పుడూ వెరిఫై చేసుకోవాలని భారత ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్ చెకింగ్ ఏజెన్సీ కూడా సూచిస్తోంది. రూ.500 నోట్లను రద్దు చేయలేదు, చట్టబద్ధంగానే ఉన్నాయి,. వార్తలను నమ్మడానికి లేదా భాగస్వామ్యం చేయడానికి ముందు అధికారిక వనరుల నుంచి ఎల్లప్పుడూ ధృవీకరించండి," అని సోషల్ మీడియా ప్లాట్​ఫామ్​ ఎక్స్​లో పీఐబీ పోస్ట్ పేర్కొంది.

భారతదేశంలో కొత్త రూ. 500 నోట్లను ఎప్పుడు ప్రవేశపెట్టారు?

2016 నవంబర్​లో పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.500 నోట్లను ప్రవేశపెట్టారు. ప్రస్తుత నోటు 66 ఎంఎం x 150 ఎంఎం, స్టోన్ గ్రే కలర్​లో వస్తుంది. దీని వెనుక భాగంలో భారతీయ వారసత్వ ప్రదేశాల థీమ్​కు అనుగుణంగా ఎర్రకోట చిత్రం ఉంది.

ప్రస్తుతం చలామణిలో ఉన్న అన్ని నోట్ల మాదిరిగానే రూ.500 నోట్లు కూడా 17 భాషల్లో ఉన్నాయి. ఈ భాషల్లో ఆంగ్లం, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, సంస్కృతం, తమిళం, తెలుగు, ఉర్దూ ఉన్నాయి.

2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ టెలివిజన్ ప్రసంగంలో రూ.1000 నోట్లతో పాటు రూ.500 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. దేశంలో అవినీతిపై పోరుకు, నకిలీ నోట్ల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెద్దనోట్ల రద్దు సమయంలో ఆర్బీఐ కొత్త రూ.2,000 నోటును ప్రవేశపెట్టింది. అయితే ఆ నోట్లను 2023 మేలో చెలామణి నుంచి ఉపసంహరించుకున్నారు. కాగా ఉపసంహరించుకున్నప్పటికీ రూ.2000 నోట్లు చట్టబద్ధంగానే ఉన్నాయి.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం