Why is Sensex down 2,000 points this month:2 వేల పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్
Sensex down 2,000 points this month: అంతర్జాతీయ పరిణామాలు భారతీయ స్టాక్ మార్కెట్స్ పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ నెలలో సెన్సెక్స్ 2 వేల పాయింట్లకు పైగా దిగజారి, మదుపర్లకు నష్టాలు మిగిల్చింది.
Sensex down 2,000 points this month: స్టాక్ సూచీలు చాలా సున్నితంగా ఉంటాయి. ఏ చిన్న ప్రతికూల వార్త అయినా, స్టాక్ మార్కెట్ ను కుప్పకూలుస్తుంది. అదే సమయంలో, ఏ చిన్న సానుకూల వార్త అయినా, మార్కెట్ ను అత్యున్నత శిఖరాలకు చేరుస్తుంది.
2400 points loss: ఈ నెలలో 2400 పాయింట్లు లాస్
స్టాక్ మార్కెట్ సెన్సిటివిటీ ఇండెక్స్ సెన్సెక్స్(Sensex) ఈ నెలలో గరిష్టానికి చేరింది. అదే సమయంలో, ఒవరాల్ గా సెన్సెక్స్ 2400 పాయింట్లను కోల్పోయింది. డిసెంబర్ 20న ఒక్కరోజే సెన్సెక్స్ 600 పాయింట్లను కోల్పోయింది. డిసెంబర్ 1న ఆల్ టైమ్ హై అయిన 63,583 పాయింట్లకు చేరుకున్న సెన్సెక్స్.. ఆ రోజు నుంచి ఇప్పటివరకు మొత్తంగా 2400 పాయింట్లను కోల్పోయింది.
recession impact: అంతర్జాతీయ పరిణామాలు
చైనాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం ముంచుకువస్తోంది. పలు దేశాల సెంట్రల్ బ్యాంక్ లు తమ ద్రవ్య విధానాలను మరింత కఠినం చేస్తున్నాయి. ఇవన్నీ మొత్తంగా ఇన్వస్టర్లు తమ పెట్టుబడుల విషయంలో రక్షణాత్మక ధోరణిలోకి వెళ్లేలా చేస్తున్నాయి. మాంద్యం పరిస్థితులు చివరకు బ్యాంక్ ఆఫ్ జపాన్ ను కూడా తమ 10సంవత్సరాల టార్గెట్ ను సవరించుకునేలా చేశాయి.
selling in the global markets: అమ్మకాల వెల్లువ
‘అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ట్రెండ్ కొనసాగుతోంది. సేఫ్ గేమ్ దిశగా ఇన్వెస్టర్లు తమ ట్రేడింగ్ స్ట్రాటెజీని మార్చుకుంటున్నారు. అమెరికా ఫెడ్ పాలసీ నిశిత, కఠిన నిర్ణయాలు భారత్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. భారతీయ ఈక్విటీ మార్కెట్ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ అయినప్పటికీ, ఇన్ స్టిట్యూషన్ ఇన్వెస్టర్ రిస్క్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. మరోవైపు, ముంచుకువస్తున్న మాంద్యంతో పాటు పెరుగుతున్న వడ్డీ రేట్లు మార్కెట్లకు గడ్డుకాలం తప్పదన్న సంకేతాలను ఇస్తున్నాయి’ అని స్వస్తిక ఇన్వెస్ట్ మెంట్ లిమిటెడ్ హెడ్ ఆఫ్ రీసెర్చ్ సంతోష్ మీనా విశ్లేషించారు. యూఎస్ ఫెడ్ కీలక వడ్డీ రేట్లను పెంచుతూ తీసుకున్న నిర్ణయం, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కూడా అదే దిశలో సాగే అవకాశం ఉండడం ఇన్వెస్టర్ల విశ్వాసాలను మరింత దెబ్బతీస్తున్నాయి.
surge in corona cases in China: చైనా కరోనా ప్రభావం
చైనాలో కరోనా కేసుల భారీ పెరుగుదల ప్రత్యక్షంగా, పరోక్షంగా అంతర్జాతీయ ఆర్థికరంగంపై చూపే ప్రతికూల ప్రభావం రానున్న రోజుల్లో మార్కెట్ కు గడ్డు రోజులు తప్పవన్న సంకేతాలనే ఇస్తున్నాయి. మరోవైపు, చైనాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో, భారత్ సహా చాలా దేశాలు తమ కొవిడ్ ప్రొటొకాల్ ను సమీక్షించుకుంటున్నాయి. ఒకవేళ, మరో కరోనా వేవ్ కు అవకాశముందా? అనే విషయాన్ని, అందుకు సిద్ధం కావాల్సిన అవసరాన్ని సమీక్షించుకుంటున్నాయి.
సూచన: ఇక్కడ పేర్కొన్న అంశాలు నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. మదుపర్లు సొంత విశ్లేషణతో నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం.