Mutual fund SIPs : దీపావళి బోనస్‌ని ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే-లాభాలెన్నో!
Top 10 performing Mutual funds : ఈ దీపావళికి మీకు బోనస్ వచ్చిందా? ఆ డబ్బులను ఖర్చు చేసేద్దామని చూస్తున్నారా? దాని బదులు.. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టొచ్చు కదా! టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్ మీకోసమే..
Top 10 performing Mutual funds : దేశంలో పండుగ సీజన్ జోరుగా నడుస్తోంది. గణేశ్ చతుర్థి, దసరా అయిపోయాయి. ఇక దీపావళి కోసం ప్రజలు ఎదురుచూస్తున్నాయి. సహజంగా దీపావళికి చాలా మందికి బహుమతులు అందుతూ ఉంటాయి. కొన్ని కంపెనీలు.. ఉద్యోగులకు బోనస్‌లు కూడా ఇస్తూ ఉంటాయి. మరి ఆ నగదును మ్యూచువల్ ఫండ్‌లో పెట్టొచ్చు కదా! మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ ఆధారంగా పెట్టుబడులు పెడితే దీర్ఘకాలంలో మంచి రిటర్నులు వస్తాయని అందరికీ తెలిసిందే. కానీ చాలా మంది మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టరు. కొందరు పెట్టుబడి చేద్దామని, సమయం కుదరకో లేదా డబ్బులు లేకో పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటారు. మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు.. ఈ దీపావళి సరైన సమయం. మీ బోనస్‌ను మంచి మ్యూచువల్ ఫండ్లె పెట్టండి.
ట్రెండింగ్ వార్తలు
మ్యూచువల్ ఫండ్ సహీ హే..!
వాస్తవానికి రూ. 500తోనే ఒక మ్యూచువల్ ఫండ్ మొదలుపెట్టొచ్చు. అయితే మినిమం అమౌంట్ అనేది ఒక్కో మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌కు ఒక్కో విధంగా ఉంటుంది. ఇలా నెలవారీ పెట్టుబడల ద్వారా మదుపర్లలో క్రమశిక్షణ పెరుగుతుంది. డబ్బు విషయంలో క్రమశిక్షణ ఎంత అవసరమో అందరికి తెలిసిందే.
Mutual fund SIPs : "దీపావళి అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. కుటుంబాలు ఒక్కచోట చేరి పండుగ చేసుకుంటాయి. బోనస్‌ల రూపంలో ఉద్యోగులకు అదనపు నగదు అందుతుంది. పెద్దలు, పిల్లలకు వస్తువులను గిఫ్ట్‌గా ఇస్తూ ఉంటారు. డబ్బు ఖర్చు చేస్తే ఆనందం వస్తుంది. కానీ అదే డబ్బుతో చాలా చేయవచ్చు. మ్యూచువల్ ఫండ్‌లో సిప్ ద్వారా పెట్టుబడి పెడితే.. మంచి రిటర్నులు వచ్చే ఆస్కారం ఉంటుంది," అని ఫైయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కవలిరెడ్డి పేర్కొన్నారు.
ఇండియాలో ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతున్నాయి. డీమ్యాట్ ఖాతాల సంఖ్య ఇప్పటికే రూ. 10కోట్లు దాటిపోయింది. అధికారిక లెక్కల ప్రకారం.. ఎఫ్వై22లో 2.66కోట్ల కొత్త సిప్‌లు పుట్టుకొచ్చాయి. ఇక ఎఫ్వై23లోని తొలి ఆరు నెలల్లో ఆ సంఖ్య 1.21కోట్లు దాటిపోయింది.
Top performing Mutual funds : ఈక్విటీ పెట్టుబడులు అంటే రిస్క్‌తో కూడుకున్న విషయమే. ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులకు గురయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు నిఫ్టీ50.. మైనస్ 4.8శాతం రిటర్నులు ఇచ్చింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 3.3శాతం నెగిటివ్‌లో ఉంది. ఇక స్మాల్ క్యాప్ ఇండెక్స్ 17.1శాతం మైనస్‌లో ఉంది.
ఇన్ని ప్రతికూలతలు ఉన్నా.. టాప్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్.. మంచి రిటర్నులు తెచ్చిపెట్టాయి. అందుకే నెలవారీగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం ఉపయోగకరం అని నిపుణులు చెబుతున్నారు.
టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్ (ఫైయర్స్ లిస్ట్):-
2021 అక్టోబర్- 2022 అక్టోబర్ 11 డేటా..
- మోతీలాల్ ఒస్వాల్ మిడ్‌క్యాప్ ఫండ్:- యీల్డ్- 12.9శాతం, సీఏజీఆర్- 29.5శాతం.
- నిప్పాన్ ఇండియా కన్సంప్షన్ ఫండ్:- యీల్డ్- 12.5శాతం, సీఏజీఆర్- 28.4శాతం.
- ఎస్బీఐ కన్సంప్షన్ ఆప్ ఫండ్:- యీల్డ్ 10.7శాతం, సీఏజీఆర్- 24.1శాతం.
- ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్:- యీల్డ్ 10.7శాతం, సీఏజీఆర్- 22.4శాతం.
- ఐసీఐసీఐ ప్రు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్:- యీల్డ్ 9.7శాతం, సీఏజీఆర్- 21.7శాతం.
- హెచ్డీఎఫ్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్:- యీల్డ్ 9.6శాతం, సీఏజీఆర్- 21.4శాతం.
- క్వాంట్ ఈఎస్జీ ఈక్విటీ ఫండ్:- యీల్డ్ 9.5శాతం, సీఏజీఆర్ 21.3శాతం.
- ఐసీఐసీఐ ప్రూ ఎఫ్ఎంసీజీ ఫండ్:- యీల్డ్ 9.5శాతం, సీఏజీఆర్ 21.1శాతం,
- నిప్పాన్ ఇండియా మల్టీక్యాప్ ఫండ్:- యీల్డ్ 9.4శాతం, సీఏజీఆర్ 21శాతం.
- క్వాంట్ క్వాంటమెంటల్ ఫండ్:- యీల్డ్ 9.2శాతం, సీఏజీఆర్ 20.5శాతం.
*యూల్డ్ అంటే.. పెట్టుబడులపై వడ్డీ, డివిడెండ్ల ద్వారా మదుపర్లకు వచ్చిన ఆదాయం.
*సీఏజీఆర్ అంటే.. ఒక కాల వ్యవధికి.. పెట్టుబడి వార్షిక వృద్ధి రేటు.
(గమనిక: ఇవి కేవలం నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఎవైనా పెట్టుబడులు పెట్టే ముందు మీ ఫైనాన్షియల్ ఎడ్వైజర్‌ను సంప్రదించడం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం