Best Tata Group stock in 2023: 2023 లో అత్యధికంగా లాభాలను ఆర్జించిన టాటా గ్రూప్ స్టాక్ ఏదో తెలుసా..?-which tata group stock performed the best in 2023 the answer may surprise you ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Tata Group Stock In 2023: 2023 లో అత్యధికంగా లాభాలను ఆర్జించిన టాటా గ్రూప్ స్టాక్ ఏదో తెలుసా..?

Best Tata Group stock in 2023: 2023 లో అత్యధికంగా లాభాలను ఆర్జించిన టాటా గ్రూప్ స్టాక్ ఏదో తెలుసా..?

HT Telugu Desk HT Telugu
Dec 21, 2023 04:51 PM IST

Tata Group stock: స్టాక్ మార్కెట్లో టాటా గ్రూప్ నకు చెందిన 29 కంపెనీలు ఉన్నాయి. 2023లో టాటా గ్రూప్ లోని ఏ సంస్థ స్టాక్స్ ఎక్కువ లాభాలు ఆర్జించాయో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Tata Group stock: భారతీయ స్టాక్ మార్కెట్లో బుల్ రన్ కొనసాగుతోంది. 2023 లో దాదాపు అన్ని స్టాక్స్ మంచి పని తీరును చూపాయి. ఫార్మా, ఆటో, టెక్, ఎఫ్ఎంసీజీ, రియాల్టీ, బ్యాంకింగ్.. ఇలా అన్ని సెక్టార్లకు చెందిన స్టాక్స్ లాభాలు సాధించాయి.

టాటా గ్రూప్..

లేటెస్ట్ గా వచ్చిన టాటా టెక్నాలజీస్ తో కలిపి టాటా గ్రూప్ (Tata Group) నకు చెందిన 29 స్టాక్స్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇన్వెస్టర్ల విశ్వసనీయతను పొందిన స్టాక్స్. అలాగే, ఇవన్నీ కూడా 2023 లో మంచి ఫలితాలను సాధించాయి. అయితే, వాటిలో ఏ కంపెనీ స్టాక్స్ ఎక్కువ లాభాలను ఆర్జించిందో తెలిస్తే, ఆశ్చర్యపోతారు. ఎందుకంటే, టాటా గ్రూప్ లో అది అంతగా పాపులర్ కాని స్టాక్. చాలా మంది ఇటీవల మార్కెట్లోకి లాంచ్ అయిన టాటా టెక్నాలజీస్ (Tata Technologies) స్టాక్ ఎక్కువ లాభాలను పొందిందనుకుంటారు. కానీ టాటా టెక్నాలజీస్ కన్నా మరో అంతగా పాపులర్ కాని స్టాక్ ఎక్కువ లాభాలను పొందింది.

ఏ స్టాక్ ఎంత లాభపడింది?

లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో టాటా గ్రూప్ (Tata Group) షేర్లు పాపులర్. ఉదాహరణకు, 2023లో ట్రెంట్ (Trent) షేర్ ధర 122% పెరిగింది. టాటా ఈఎల్ఎక్స్ఎస్ఐ (Elxsi) 42% లాభపడింది. టైటాన్ (Titan) 40% పెరిగింది. టీసీఎస్ (TCS), టాటా స్టీల్ (Tata Steel) రెండూ దాదాపు 15% పెరిగాయి.

జనవరి లో రూ. 3వేలు, ఇప్పుడు రూ. 8,700

టాటా గ్రూప్ నకు చెందిన బెనారస్ హోటల్స్ (Benares Hotels) స్టాక్ 2023 ఎక్కువగా వృద్ధి సాధించింది. ఈ స్టాక్ షేర్ విలువ 2023 జనవరిలో సుమారు రూ. 3 వేలు ఉండగా, ఇప్పుడు ఆ షేర్ ధర రూ. 8700 సమీపంలో ఉంది. అంటే, కేవలం ఒక సంవత్సరంలో ఈ స్టాక్ సుమారు మూడు రెట్లు పెరిగింది. ఈ బెనారస్ హోటల్స్ టాటా గ్రూప్ నకు చెందిన ఇండియన్ హోటల్స్ కు సబ్సిడయరీ సంస్థ.

ఏంటీ బెనారస్ హోటల్స్..

తాజ్ హోటల్స్ (Taj Hotels) గ్రూప్ తో పోలిస్తే బెనారస్ హోటల్స్ (Benares Hotels) అంత పాపులర్ కాదు. 2011లో ఈ బెనారస్ హోటల్స్ ఇండియన్ హోటల్స్ కంపెనీ (IHC)కి అనుబంధ సంస్థగా మారింది. ప్రస్తుతం వారణాసిలోని తాజ్ గంగాస్, తాజ్ నాడేసర్ ప్యాలెస్ అనే రెండు హోటళ్లు, ముంబైలోని ది గేట్‌వే హోటల్‌ (ప్రస్తుతం జింజర్ హోటల్) ఈ కంపెనీ నిర్వహణలో ఉన్నాయి. 2022 వరకు బెనారస్ హోటల్స్ ప్రాథమికంగా గది, ఆహారం, విందు సేవల ద్వారా ఆదాయాన్ని ఆర్జించింది.

Whats_app_banner