WhatsApp new feature : వాట్సాప్‌లో కొత్త ఫీచర్- మెసేజ్‌కి రిప్లై ఇవ్వకపోతే..
WhatsApp new feature : వాట్సాప్ కొత్త ఫీచర్‌ని తీసుకొస్తోంది! మెసేజ్‌కి రిప్లై ఇవ్వడం మర్చిపోతే ఈ కొత్త ఫీచర్ మీకు నోటిఫికేషన్ పంపి అలర్ట్ చేస్తుంది.
ఫ్రెండ్స్, ఫ్యామిలీ సభ్యులతో చాట్ చేసేందుకు మీరు వాట్సాప్ ఎక్కువగా వాడుతుంటారా? కానీ ఒక్కోసారి ముఖ్యమైన మెసేజెస్‌కి రిప్లై ఇవ్వడం మర్చిపోయి, తర్వాత బాధపడుతుంటారా? అయితే మీ సమస్యను పరిష్కరించేందుకు వాట్సాప్ ఒక కొత్త ఫీచర్‌ని తీసుకురాబోతోంది. ఈ ఫీచర్.. ఒక అన్‌సీన్ మెసేజ్ రిమైండర్‌గా పనిచేస్తుందని సమాచారం. మీరు రెగ్యులర్‌గా చాట్ చేసే వారి మెసేజ్‌కి రిప్లై ఇవ్వడం మర్చిపోతే, ఈ ఫీచర్ మీకు గుర్తుచేస్తుందట! ఈ ఫీచర్ గురించి ఇప్పటి వరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
అన్‌సీన్ మెసేజ్ రిమైండర్స్..
యూజర్ ఫ్రెండ్లీ వాట్సాప్.. వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్‌ని తీసుకొస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఈ కొత్త ఫీచర్‌పై పనిచేస్తోందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ బీటా టెస్టర్లకు అందుబాటులో ఉన్న ఈ కొత్త రిమైండర్ ఫీచర్‌ని వాట్సాప్ పరీక్షిస్తోందని డబ్ల్యూఏబీటాఇన్ఫో నివేదించింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ కోసం వాట్సాప్ బీటా వెర్షన్ 2.24.0.25.29లో అందుబాటులో ఉంది. వినియోగదారులు మిస్ అయిన సందేశాలు లేదా స్టేటస్ అప్డేట్ల గురించి నోటిఫికేషన్ అలర్ట్‌లను ఈ వెర్షన్ అందిస్తుంది.
ఒక నిర్దిష్ట కాంటాక్ట్‌తో మీరు ఎంత తరచుగా టచ్‌ల ఉన్నారో పర్యవేక్షించడం ద్వారా పనిచేసే ఇంటర్నల్ అల్గారిథమ్ ఆధారంగా ఈ ఫీచర్ పనిచేస్తుందని నివేదిక తెలిపింది. మీరు పెద్దగా చాట్ చేయని వారితో పోలిస్తే ఎక్కువగా కమ్యూనికేట్ చేసే కాంటాక్ట్‌ల గురించి మీకు తెలియజేయస్తుంది. తరచూ కాంటాక్ట్ అయ్యే వారి జాబితాకు ప్రాధాన్యం లభిస్తుంది. వాట్సాప్ ఈ డేటాను లోకల్‌గానే స్టోర్ చేయబోతున్నట్లు సమాచారం.
ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంది. మీరు బీటాను ఎంచుకోవాలనుకుంటే, మీరు ఆండ్రాయిడ్‌లో వాట్సాప్ బీటాకు సైన్ అప్ చేయడానికి ప్రయత్నించవచ్చు. ఏదేమైనా, ఈ ఫీచర్ ఇప్పటికే బీటా వెర్షన్‌లోకి వచ్చినందున, త్వరలోనే అందరికి అందుబాటులోకి వచ్చే అవకాశంఉంది. లాంచ్ డేట్‌పై క్లారిటీ లేనప్పటికీ, ఈ అప్డేట్ అందరికీ అందుబాటులోకి రావడానికి ఎక్కువ సమయం పట్టదని తెలుస్తోంది.
డిలీట్ చేసిన వాట్సాప్ చాట్లను ఇలా రికవర్ చేసుకోండి..
పొరపాటున మీ వాట్సాప్ చాట్స్ డిలీట్ అయ్యాయా? డిలీట్ చేసిన చాట్స్ రికవర్ చేయడం అసాధ్యం అనుకుంటున్నారా? కొన్ని సింపుల్ స్టెప్స్‌తో మళ్లీ వాటిని రికవరీ చేసుకోవచ్చు. అయితే, మీ బ్యాకప్ సెట్టింగ్ లు, డివైజ్ మోడల్‌ను బట్టి ఆ చాట్ లను రికవరీ చేయడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం