WhatsApp new update: వాట్సాప్ లో కొత్త అప్ డేట్; ఇక హెచ్ డీ క్వాలిటీ ఫొటోలు పంపించవచ్చు
WhatsApp new update: వాట్సాప్ లో సరికొత్త అప్ డేట్ వచ్చింది. ఇకపై వాట్సాప్ ద్వారా మరింత నాణ్యమైన ఫొటోలను షేర్ చేయవచ్చు. హెచ్ డీ క్వాలిటీ (4096 x 2692) ఫొటోలను పంపించేందుకు వీలుగా వాట్సాప్ ను అప్ డేట్ చేసినట్లు వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా చీఫ్ మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు.

క్వాలిటీ ఫొటోలు..
షార్ట్ మెసేజింగ్ యాప్ గా ప్రారంభమైన వాట్సాప్ ఆ తరువాత వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ వస్తోంది. ఇప్పుడు తాజాగా హై క్వాలిటీ ఫొటోలను ఈ ప్లాట్ ఫామ్ ద్వారా షేర్ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ లేటెస్ట్ అప్ డేట్ ను ప్రకటించింది. ఈ విషయాన్ని వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా చీఫ్ మార్క్ జుకర్ బర్గ్ తన ఇన్ స్టా అకౌంట్ ద్వారా వెల్లడించారు. ‘‘వాట్సాప్ లో ఫొటోలను షేర్ చేసే విషయంలో కొత్త అప్ డేట్ వచ్చింది. ఇకపై మీరు హెచ్ డీలో ఫొటోలను షేర్ చేసుకోవచ్చు’’ అని జుకర్ బర్గ్ ఇన్ స్టాలో వెల్లడించారు.
కొన్ని వారాల్లో..
ఈ అప్ డేట్ ను మరికొద్ది వారాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు వినియోగదారులకు అదుబాటులోకి వస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్ ప్లాట్ ఫామ్స్ లోని వినియోగదారులు అందరూ ఈ అప్ డేట్ ను పొందుతారు. అయితే, ఈ అప్ డేట్ తో హైయర్ క్వాలిటీ ఫొటోలను పంపించవచ్చు. కానీ ఒరిజినల్ సైజ్ తో పోలిస్తే, ఇమేజ్ కొంత కంప్రెస్ అవుతుందని తెలుస్తోంది. ఇమేజ్ ను షేర్ చేస్తున్న సమయంలో, అలాగే, ఇమేజ్ ను రిసీవ్ చేసుకున్న సమయంలో అది హెచ్ డీ క్వాలిటీ ఇమేజ్ అని తెలియజేయడానికి ఇమేజ్ పైన ఒక చిన్న ఐకన్ కూడా కనిపిస్తుంది. హెచ్ డీ క్వాలిటీలో వీడియోలను కూడా షేర్ చేసే అప్ డేట్ ను త్వరలో తీసుకురానున్నట్లు మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు.