WhatsApp update: వాట్సాప్ ను ఇక 4 డివైజెస్ లో లింక్ చేసుకోవచ్చు; ఇలా చేస్తే చాలు
WhatsApp new update: గరిష్టంగా నాలుగు డివైజెస్ కు లింక్ చేసుకునేలా వాట్సాప్ ను అప్ డేట్ చేశారు.
WhatsApp new update: గరిష్టంగా నాలుగు డివైజెస్ కు లింక్ చేసుకునేలా వాట్సాప్ (WhatsApp) ను అప్ డేట్ చేశారు. ఫోన్ ఆఫ్ లైన్ కు వెళ్లినా వాట్సాప్ (WhatsApp) మెసేజెస్ సింక్ అవుతాయి.
WhatsApp new update: లింక్ చేయడం ఇలా..
ఈ మెసేజింగ్ యాప్ ను నాలుగు డివైజెస్ కు ఎలా లింక్ చేయాలనే విషయాన్ని వాట్సాప్ తన అధికారిక ట్విటర్ హ్యాండిల్ లో వాట్సాప్ (WhatsApp) వెల్లడించింది. అందుకు సంబంధించిన ఒక లింక్ ను కూడా పోస్ట్ చేసింది. విండోస్ లో డివైజ్ లింకింగ్ సులభం చేయడం కోసం ప్రత్యేకంగా ఒక యాప్ ను రూపొందించామని WhatsApp తెలిపింది. ఈ కొత్త విండోస్ యాప్ ను https://whatsapp.com/download ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
WhatsApp new update: గ్రూప్ అడ్మిన్స్ కోసం..
వాట్సాప్ (WhatsApp) అదనంగా గ్రూప్ అడ్మిన్స్ కోసం రెండు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రూప్స్ మధ్య కమ్యూనికేషన్ ను మరింత సులభతరం చేయడం కోసం గత సంవత్సరం కమ్యూనిటీస్ అప్ డేట్ ను తీసుకువచ్చామని గుర్తు చేసింది. ఇప్పుడు, తాజాగా, గ్రూప్ లోకి ఎవరిని జాయిన్ చేయాలనే విషయంలో గ్రూప్ అడ్మిన్ కు మరింత వెసులుబాటు కలిగేలా మరో అప్ డేట్ ను వాట్సాప్ తీసుకువచ్చింది. దాంతో పాటు వివిధ గ్రూప్ ల్లో కామన్ గా ఉన్న సభ్యుల వివరాలను గ్రూప్ అడ్మిన్స్ తేలిగ్గా తెలుసుకునేలా మరో అప్ డేట్ ను కూడా వాట్సాప్ తీసుకువచ్చింది. వాట్సాప్ (WhatsApp) కమ్యూనిటీస్ (Communities) ఆప్షన్ లో ఈ అప్ డేట్స్ చాలా ఉపయోగకరమని వాట్సాప్ (WhatsApp) తెలిపింది.