వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. ఈ కొత్త ఫీచర్‌తో ఫోన్ స్టోరేజ్, డేటా సేవింగ్!-whatsapp to introduce download quality feature with hd and standard to save phone storage and data ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. ఈ కొత్త ఫీచర్‌తో ఫోన్ స్టోరేజ్, డేటా సేవింగ్!

వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. ఈ కొత్త ఫీచర్‌తో ఫోన్ స్టోరేజ్, డేటా సేవింగ్!

Anand Sai HT Telugu

వాట్సాప్ ఇప్పుడు తన వినియోగదారుల కోసం ఒక ప్రత్యేక ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఇది డేటాను సేవ్ చేయడానికి సహాయపడుతుంది.

వాట్సాప్ కొత్త ఫీచర్

వాట్సాప్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. డేటాను సేవ్ చేయడానికి వాట్సాప్ కొత్త ఫీచర్ సహాయపడుతుంది. ఒక నివేదిక ప్రకారం.. వాట్సాప్ మీడియా డౌన్‌లోడ్‌లపై వినియోగదారులకు మరింత నియంత్రణ ఇవ్వడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఆండ్రాయిడ్ వెర్షన్ 2.25.18.11 కోసం వాట్సాప్ బీటా అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ వెర్షన్ కింద యూజర్లు తమ డివైస్‌లో ఆటోమేటిక్‌గా డౌన్ లోడ్ అయ్యే ఫొటోలు, వీడియోల క్వాలిటీని ఎంచుకునే వెసులుబాటు కల్పిస్తోంది.

అయితే, ఈ అప్‌డేట్ ప్రస్తుతం కొన్ని బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. రాబోయే వారాల్లో ఇది క్రమంగా ఎక్కువ మంది వినియోగదారులకు చేరుతుంది. వాట్సాప్ అప్డేట్ ఫోటోలు, వీడియోలతో సహా ఆటో-డౌన్‌లోడ్ మీడియా క్వాలిటీని నిర్వహించడానికి ఆప్షన్‌ను ప్రవేశపెట్టిందని వాబీటాఇన్ఫో వెబ్‌సైట్ తెలిపింది. ఈ అప్‌డేట్‌తో యూజర్లు వాట్సాప్‌లో మీడియాను స్టాండర్డ్ క్వాలిటీలో డౌన్ లోడ్ చేసుకోవాలో, హెచ్‌డీ క్వాలిటీలో డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకోవచ్చు.

ఈ ఫీచర్ ప్రస్తుతం అందుబాటులో ఉంది.. బీటా టెస్టర్లు మాత్రమే ఉపయోగించవచ్చు. బీటా టెస్టర్‌లో చేరితే కొత్త సెట్టింగ్స్ తెలుసుకోవడానికి ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వొచ్చు. ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లి స్టోరేజ్ అండ్ డేటాపై ట్యాప్ చేస్తే మీడియా ఆటో డౌన్‌లోడ్ క్వాలిటీ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. మీరు ఇప్పుడు రెండు ఆప్షన్స్ చూస్తారు:

స్టాండర్డ్ క్వాలిటీ: స్థలాన్ని ఆదా చేయడానికి, డేటా వినియోగాన్ని తగ్గించడానికి మీడియాను కంప్రెస్ చేస్తుంది.

హెచ్‌డీ క్వాలిటీ: అధిక రిజల్యూషన్, మెరుగైన వివరాలను నిర్వహిస్తుంది, అయితే ఎక్కువ డేటా, స్టోరేజీని ఉపయోగిస్తుంది.

ఒక వ్యక్తి హెచ్‌డీ క్వాలిటీలో ఇమేజ్ లేదా వీడియోను పంపినప్పుడు వాట్సాప్ ప్రామాణిక, హెచ్‌డీ ఫైళ్లతో సహా రెండు వెర్షన్లను సృష్టిస్తుంది. కొత్త అప్డేట్ కింద, మీరు ఇప్పుడు స్టాండర్డ్ వెర్షన్ లేదా హెచ్‌డీ వెర్షన్‌‌లో ఆటో డౌన్‌లోడ్‌లను సెటప్ చేయగలరు.

ప్రస్తుతం ఎంపిక చేసిన బీటా టెస్టర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. అయితే రాబోయే వారాల్లో ఇది మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ ధృవీకరించింది. మీరు దీన్ని ప్రయత్నించాలనుకుంటే మీ యాప్‌ను అప్డేట్ చేసుకోవాలి. ఈ కొత్త ఫీచర్‌తో ఫోన్ స్టోరేజ్, డేటా సేవ్ కానుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.