వాట్సాప్ మెసేజ్‌కి రియాక్షన్ ఇవ్వాలంటే ప్రెస్ చేసి పట్టుకోనక్కర్లేదు.. కొత్తగా డబుల్ ట్యాప్ ఫీచర్-whatsapp to bring double tap feature for reacting to messages know how it will work details inside ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  వాట్సాప్ మెసేజ్‌కి రియాక్షన్ ఇవ్వాలంటే ప్రెస్ చేసి పట్టుకోనక్కర్లేదు.. కొత్తగా డబుల్ ట్యాప్ ఫీచర్

వాట్సాప్ మెసేజ్‌కి రియాక్షన్ ఇవ్వాలంటే ప్రెస్ చేసి పట్టుకోనక్కర్లేదు.. కొత్తగా డబుల్ ట్యాప్ ఫీచర్

Anand Sai HT Telugu

WhatsApp Double Tap Feature : వాట్సాప్ మరో కొత్త ఫీచర్ తీసుకువస్తుంది. ఇప్పటివరకూ వచ్చిన మెసేజ్‌కి రిప్లై ఇవ్వాలంటే ప్రెస్ చేసి రియాక్షన్ ఇచ్చేవాళ్లం. కానీ ఇకపై డబుల్ ట్యాప్ చేస్తే సరిపోతుంది.

వాట్సాప్ డబుల్ ట్యాప్ ఫీచర్ (Pixabay)

మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ తీసుకువస్తుంది. తాజాగా మరో ఫీచర్‌ను ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. ఏదైనా మెసేజ్ వస్తే యూజర్లు స్పందించడానికి టెక్ట్స్ మీద ప్రెస్ చేసి ఉంటాం. ఇలా చేస్తే కొన్ని రకాల ఎమోజీలు వస్తాయి. తర్వాత ఏది కావాలో సెలక్ట్ చేసుకుంటాం. కానీ ఇకపై అలా కాకుండా డబుల్ ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఈ మేరకు వాట్సాప్ కొత్త ఫీచర్ కోసం సన్నాహాలు చేస్తోంది.

టెక్ట్స్‌పై డబుల్ ట్యాప్ చేయడానికి వీలు కల్పించే కొత్త ఫీచర్‌పై వాట్సాప్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇది వినియోగదారులకు సందేశాలకు వెంటనే స్పందించడానికి ఇబ్బంది లేని మార్గాన్ని అందిస్తుంది. అయితే రియాక్షన్ ఎమోజీ డిఫాల్ట్‌గా సెట్ చేయబడుతుందని భావిస్తున్నారు. కస్టమైజ్డ్ పద్ధతిలో వినియోగదారులు సందేశానికి ప్రతిస్పందించే ప్రస్తుత మార్గాన్ని అనుసరించాల్సి ఉంటుంది. వాట్సప్ తన రాబోయే యాప్ అప్ డేట్ కోసం ఏం అభివృద్ధి చేస్తుందో మరింత తెలుసుకోండి.

డబ్ల్యూఏబీటాఇన్ఫో నివేదిక ప్రకారం.. వాట్సాప్ వేగంగా రియాక్షన్ ఫీచర్‌పై పనిచేస్తోంది. నిర్దిష్ట సందేశం, ఫోటోలు, వీడియోలు, జీఐఎఫ్‌లకు స్పందించడానికి డబుల్ ట్యాప్ ఫీచర్‌ను తీసుకువస్తున్నట్లు సమాచారం. రియాక్షన్ డిఫాల్ట్‌గా సెట్ చేస్తారు. ఇది హార్ట్ సింబల్ ఉండే ఎమోజీగా ఉంటుందని భావిస్తున్నారు. స్క్రీన్‌పై డబుల్ క్లిక్ చేయడం ద్వారా సందేశాలకు ప్రతిస్పందించినప్పుడు, హార్ట్ సింబల్ ఉన్న ఎమోజీ రావడం అనేది ఇన్‌స్టాగ్రామ్ ఫీచర్. ఇది కూడా అలానే ఉపయోగించే మాదిరిగానే ఉంటుంది. వాట్సప్‌లో కూడా ఇలాంటి ఫీచర్‌ను మనం పొందవచ్చు.

అంటే వాట్సాప్ రియాక్షన్ ఫీచర్ వేగవంతమైన విధానంలో రాబోతోంది. ఇకపై యూజర్లు రియాక్షన్ ఇవ్వడానికి టెక్ట్స్‌పై ఎక్కువసేపు ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా డబుల్ ట్యాప్‌తో సందేశాలకు ప్రతిస్పందించవచ్చు. మెసేజ్‌లకు స్పందించే ప్రక్రియను వేగవంతం చేయడమే ఈ ఫీచర్ లక్ష్యమని, వినియోగదారులు తమ భావాలను త్వరగా వ్యక్తీకరించడానికి మరింత సౌకర్యవంతంగా ఉంటుందని తెలుస్తోంది.

ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. ఇంకా విడుదల కానందున స్పష్టత రాలేదు.. రాబోయే నెలల్లో వాట్సాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పేస్‌తో సహా కొత్త ఫీచర్లతో మార్పులకు శ్రీకారం చూడుతుంది. మెటా ఏఐ కోసం లామా 3.1 405బిని విడుదల చేస్తున్నట్లు మెటా ప్రకటించింది. ఇది అధికారిక విడుదల తర్వాత త్వరలో దేశంలో అందుబాటులోకి రానుంది. రాబోయే వాట్సప్ అప్‌డేట్స్‌లో కొత్త ఫీచర్లను మనం చూడవచ్చు. మెటా ఈ కొత్త ఫీచర్లను యాప్‌లో ఎలా పరిచయం చేస్తుందో వేచి చూడాల్సిందే..