WhatsApp stops: ‘ఇక ఈ ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు..’
WhatsApp stops: కొత్త ఫీచర్లను సజావుగా సపోర్ట్ చేయలేని పాత డివైజ్ లలో వాట్సాప్ నిలిచిపోనుంది. ఆ ఫోన్స్ లో సెక్యూరిటీ ఫీచర్స్ సరిగా లేకపోవడం వల్ల అవి సైబర్ దాడులకు గురయ్యే అవకాశం ఉండటంతో ఆయా డివైజ్ లకు వాట్సప్ సపోర్ట్ నిలిపివేసింది.
WhatsApp stops: అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ సర్వీస్ వాట్సాప్ సేవలు కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో నిలిచిపోయాయి. తన ప్లాట్ఫామ్ సపోర్ట్ రిక్వైర్మెంట్స్ ను వాట్సాప్ ఇటీవల అప్డేట్ చేసింది. దాంతో, 2025 జనవరి 1 నుండి ఎంపిక చేసిన కొన్ని ఆండ్రాయిడ్ డివైజెస్ లో వాట్సాప్ పనిచేయడం నిలిచిపోయింది. వీటిలో ఆండ్రాయిడ్ 4.0 లేదా కిట్ క్యాట్ వంటి ఆపరేటింగ్ సిస్టంలపై పనిచేసే స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు ఉన్నాయి.
2025 జనవరి 1 నుంచి ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు
- శాంసంగ్ గెలాక్సీ ఎస్3
- మోటరోలా మోటో జి
- హెచ్ టీసీ వన్ ఎక్స్
- సోనీ ఎక్స్ పీరియా జెడ్
- శాంసంగ్ గెలాక్సీ ఎస్3
- శాంసంగ్ గెలాక్సీ నోట్ 2
- శాంసంగ్ గెలాక్సీ ఎస్4 మినీ
- మోటరోలా మోటో జి (1 వ తరం)
- మోటరోలా రేజర్ హెచ్ డీ
- మోటో ఇ 2014
- హెచ్ టీసీ వన్ ఎక్స్
- హెచ్ టీసీ వన్ ఎక్స్ ప్లస్
- హెచ్ టీసీడిజైర్ 500
- హెచ్ టీసీడీ 601
- ఎల్జీ ఆప్టిమస్ జి
- ఎల్జీ నెక్సస్ 4
- ఎల్జీ జీ2 మినీ
- ఎల్జీ ఎల్90
- సోనీ ఎక్స్ పీరియా జెడ్
- సోనీ ఎక్స్ పీరియా ఎస్పీ
- సోనీ ఎక్స్ పీరియా
ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు?
మీరు ఉపయోగిస్తున్న ఫోన్ పైన పేర్కొన్న జాబితాలో ఉంటే లేదా ఈ పాత ఆండ్రాయిడ్ (android) ఆపరేటింగ్ సిస్టమ్ లలో ఒకదానితో అది రన్ అవుతున్నట్లయితే, మీకు రెండు ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి.
- మీ ఫోన్లో లేటెస్ట్ సాఫ్ట్ వేర్ అప్ డేట్ ఏదైనా అందుబాటులో ఉందేమో చూడండి. వాట్సాప్ (WhatsApp) రన్ అయ్యే ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ కు మీ ఫోన్ ను అప్ డేట్ చేయండి.
- మీ ఫోన్ లేదా టాబ్లెట్ ను మార్చండి. కొత్త స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్ ను పొందండి.
ఈ పాత డివైజ్ లలో వాట్సప్ ఎందుకు పనిచేయదు?
పైన పేర్కొన్న జాబితాలోని డివైస్ లలో వాట్సప్ పనిచేయదు. వాట్సాప్ కొత్త వెర్షన్లలో పాత ఫోన్లు సజావుగా సపోర్ట్ చేయలేని ఫీచర్లు ఉంటాయి. కాబట్టి కంపెనీ అధికారికంగా ఇలాంటి పాత పరికరాలకు సపోర్ట్ ను నిలిపివేస్తోంది. ఇది కాకుండా, పాత ఫోన్లకు రెగ్యులర్ సెక్యూరిటీ ప్యాచ్ లు కూడా లభించకపోవచ్చు. దాంతో, ఆ పరికరాలు మాల్వేర్ లేదా వైరస్ ల బారిన పడే ప్రమాద ఉంది.